శ‌భాష్‌.. రాజా… జ‌క్కంపూడికి ప్ర‌జ‌ల జేజేలు..!

తినిప‌డుకుంటే.. మ‌నిషికి గొడ్డుకు తేడా ఏముంటుంది ? .. మ‌న‌కంటూ.. కొంత వ్యత్యాసం ఉండాలిగా..! ఇప్పు డు ఇదే ప‌నిచేస్తున్నారు. తూర్పు గోదావ‌రిజిల్లా రాజాన‌గ‌రం ఎమ్మెల్యే, వైసీపీ యువ‌ నాయ‌కుడు.. జ‌క్కంపూ డి రాజా. నిరంత‌రం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటూ.. వారికి అన్ని విధాలా సేవ‌లు అందిస్తున్న నాయ‌కుల్లో రాజాకు తిరుగులేదు. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర మంచి మార్కులు వ‌చ్చాయంటే.. కార‌ణం.. రాజా దూర దృష్టి.. ప్ర‌జాసేవ కార‌ణ‌మ‌ని అంటారు ప‌రిశీల‌కులు. మ‌నం ఏం చేసినా.. ప‌దిమందికి న్యాయం చేసేలా ఉండాల‌నేది రాజా భావ‌న‌. ఇది రాజాకు ఆయ‌న తండ్రి నుంచే అబ్బిన వార‌స‌త్వ ల‌క్ష‌ణంగా చెప్పుకోవాలి.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న అనేక సామాజిక కార్య‌క్ర‌మాలు కూడా చేప‌ట్టారు. అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌భుత్వ సంక్షేమ ఫ‌లాల‌ను అందిస్తున్నారు. నేనున్నానంటూ.. క‌ష్టాల్లో వారిని ఆదుకుంటున్నారు. ఇటీవ‌ల తుఫాను వ‌చ్చిన‌ప్పుడు.. త‌న నియోజ‌క‌వ‌ర్గంతో సంబంధం లేకుండా.. జిల్లా వ్యాప్తంగా ఆయ‌న సేవ‌లు అందించారు. ఇలా.. ప్ర‌జ‌ల‌కు తాను ఒక ఐకాన్‌గానే కాకుండా.. అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు ఆదుకునే నాయ‌కుడిగా రాజా సేవ‌లు చేరువ చేస్తున్నారు. తాజాగా ఆయ‌న ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన వ‌లంటీర్ల‌కు లైఫ్ ఇన్సూరెన్స్ క‌ల్పించారు.

త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని వార్డుల్లో ప‌నిచేస్తున్న వ‌లంటీర్ల‌కు రాజా త‌న సొంత నిధుల‌ను వెచ్చించి ప్ర‌తి ఒక్క‌రికీ లైఫ్ ఇన్సూరెన్స్ క‌ట్టారు. క‌రోనా తొలి, రెండో ద‌శ‌లు స‌హా ప్ర‌స్తుతం వ్యాపిస్తున్న మూడో ద‌శ‌లోనూ వ‌లంటీర్లు… ప్రాణాల‌కు తెగించి. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తున్న విష‌యం తెలిసిందే. కుటుంబ స‌భ్యులు కూడా క‌రోనా సోకిన వ్య‌క్తి జోలికి వెళ్లేందుకు భ‌య‌ప‌డుతున్న స‌మ‌యంలో వ‌లంటీర్లు.. ద‌గ్గ‌ర ఉండి సేవ‌లు అందిస్తున్నారు. వీరికి కూడా క‌రోనా సోకే అవ‌కాశం ఉన్నప్ప‌టికీ.. ప్ర‌జా సేవ‌లో వారు ముందుంటున్నారు.

ఇలాంటి వారికి ఎంత చేసినా త‌క్కువే అని భావించిన రాజా.. వారికి ఇన్సూరెన్స్ సౌక‌ర్యం క‌ల్పించారు. ఇన్సూరెన్స్ చేయించేందుకు అవ‌స‌ర‌మైన నిధుల‌ను త‌న సొంత డ‌బ్బును వినియోగించ‌డం విశేషం. సాధార‌ణంగా.. స్వ‌చ్ఛంద సంస్థ‌ల నుంచి సేక‌రించిన నిధుల‌తో చాలా మంది ఎమ్మెల్యేలు.. ఇలా చేయించారు కానీ, వీరికి భిన్నంగా రాజా ఆలోచించారు.. త‌న సొంత నిధుల‌తోనే వ‌లంటీర్ల‌కు ఇన్సూరెన్స్ చేయించి.. వారికి క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్ చేతుల మీదుగా ఇన్సూరెన్స్ ప‌త్రాల‌ను అందించారు. రాజా చూపిన చొర‌వ‌.. వ‌లంటీర్ల‌ను ఆనందంలో ముంచెత్తింది.