బీజేపీలో సోముకు ఎస‌రు పెడుతున్న స‌త్తెన్న‌…?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో చెప్ప‌డం క‌ష్టం. ప‌క్క‌నే ఉన్న నేత‌లు ఎస‌రు పెట్టిన సంద ర్భాలు చాలానే ఉన్నాయి. వైసీపీలో జ‌గ‌న్‌తో క‌లిసి మెలిసిన తిరిగిన క‌ర్నూలుకు చెందిన రెడ్డి నాయ‌కుడు టీడీపీలోకి వెళ్లి.. విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించిన సంద‌ర్భాలు తెలిసిందే. సో.. పార్టీ ఏదైనా.. నాయ‌కుల ల‌క్ష‌ణం.. రాజ‌కీయ ల‌క్ష‌ణం.. అంతా వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నం.. ప‌ద‌వులే! ఇప్పుడు ఏపీ బీజేపీలోనూ ఇదే త‌ర‌హా ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. గ‌త […]

సీనియర్లకు సీటు లేదా..జగన్ షాక్ ఎవరికి..!

ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం సరిగ్గా నిర్వహించని వారికి జగన్ క్లాస్ పీకిన విషయం తెలిసిందే..ఇకనుంచైనా కార్యక్రమం ద్వారా గడపగడపకు వెళ్లాలని..లేదంటే నెక్స్ట్ సీటు కూడా ఇవ్వనని తేల్చి చెప్పేశారు. అయితే గడపగడకు వెళ్లకపోతే సీటు ఇవ్వకుండా ఉంటారా? అబ్బో కష్టమే అని చెప్పొచ్చు. ఎందుకంటే గడపగడపకు తక్కువ సమయం వెళ్ళిన వారిలో సీనియర్లు ఎక్కువ ఉన్నారు..అందులో జగన్‌కు అత్యంత సన్నిహితులే ఉన్నారు. వారికి సీటు ఇవ్వకుండా ఉండటమనేది చాలా కష్టమైన పని. ఒకసారి తక్కువ రోజులు […]

వైసీపీలో నాలుగు సర్వేలు..బయటపడ్డ రిపోర్ట్..!

వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ఏ పార్టీకి ఆ పార్టీ పనిచేస్తున్న విషయం తెలిసిందే..మళ్ళీ అధికారం దక్కించుకోవాలని..ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ..ఈ సారి ఖచ్చితంగా అధికారం దక్కించుకోవాలని ప్రతిపక్ష టీడీపీ ప్రయత్నిస్తుంది. ఈ రెండు పార్టీలు అధికారం దక్కించుకోవడం కోసం దూకుడుగా ముందుకెళుతున్నాయి. ఎక్కడకక్కడ తమ బలాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో తమ పార్టీల గెలుపోటములకు సంబంధించి..ఎవరికి వారు అంతర్గంగా సర్వేలు చేయించుకుంటున్నారు. థర్డ్ పార్టీ సర్వేలే కాకుండా…వైసీపీ-టీడీపీలు సెపరేట్‌గా సొంత […]

ఆ టీడీపీ ఎమ్మెల్యేలకు వైసీపీ ఇంచార్జ్‌లతో టఫ్ ఫైట్..!

ఈ సారి 175కు 175 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్న విషయం తెలిసిందే..కుప్పంతో సహ అన్నీ సీట్లు గెలుచుకోవాలని జగన్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న 23 సీట్లని కూడా లాగేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో బలమైన వైసీపీ నేతలకు ఇంచార్జ్‌ పదవి ఇచ్చారు. ఆ ఇంచార్జ్‌లు కూడా దూకుడుగా పనిచేస్తున్నారు. పైగా అధికారంలో ఉండటంతో..వారే ఎమ్మెల్యేల మాదిరిగా నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారు. పైగా వైసీపీ అధిష్టానం ఇచ్చిన ప్రతి […]

వైసీపీ ట్రాప్‌లో టీడీపీ..బీజేపీ అలెర్ట్..!

మరొకసారి వైసీపీ ట్రాప్‌లో టీడీపీ పడుతుందని బీజేపీ అలెర్ట్ చేస్తుంది..రైల్వే జోన్ విషయంలో వైసీపీ పన్నిన ట్రాప్‌లో టీడీపీ పడిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అంటున్నారు. తాజాగా విభజన హామీలకు సంబంధించి కేంద్ర అధికారులతో, రాష్ట్ర అధికారులు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో రైల్వే జోన్ సాధ్యం కాదని..కేంద్రం చెప్పినట్లు కథనాలు వచ్చాయి. గత ఎన్నికల ముందే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ అది ఇంకా […]

వైసీపీ ఎమ్మెల్యేలు పోస్ట్‌మ్యాన్‌లా… తాడేప‌ల్లికి చేరిన సీక్రెట్‌…!

కొన్ని విష‌యాలు ఇంతే గురూ.. విని వ‌దిలేయ‌డ‌మే! ఇదీ… ఒక వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌. అది కూడా.. సీఎం జ‌గ‌న్‌.. రెండు రోజుల కింద‌ట నిర్వ‌హించిన స‌మావేశం అనంత‌రం.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. అయితే.. ఆయ‌న సీమ‌కు చెందిన నాయ‌కుడిగా చెబుతున్నారు. పైగా.. ఆయ‌నకు సొంత పార్టీపై కంటే.. కూడా ప్ర‌తిప‌క్షాల‌పై జాలి ఎక్కువ‌గా ఉంద‌ని.. నాయ‌కులు భావిస్తున్నారు. దీంతో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు అధిష్టానం వ‌ర‌కు కూడా వెళ్లాయి. […]

చీరాల‌లో ఆమంచి ప‌క్కా సేఫ్ జోన్లోనే ఉన్నాడా….!

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో టైగ‌ర్ నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌.. ప‌రిస్తితి ఒకింత ఇబ్బందిగా మారింద‌నే టాక్ వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ క‌న్ప‌ర్మ్ చేయ‌లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న త‌న‌కే టికెట్ ఇస్తార‌ని అనుకుంటున్నారు. ఒత్తిడి కూడా పెంచుతున్నారు. అయినా.. ఎక్క‌డా ఆయ‌న కు అభ‌యం ద‌క్క‌లేదు. మ‌రోవైపు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. చీరాల నుంచి టీడీపీ యువ నాయ‌కుడు.. ద‌గ్గుబాటి వార‌సుడు చెంచురామ్ ను […]

మంత్రులకు సొంత కష్టాలు..కష్టమేనా..!

ఇప్పుడు అధికారం ఉంది అని, జగన్ మెప్పు పొందాలని చెప్పి ఎడాపెడా నోరు పారేసుకునే మంత్రులు..పొరపాటున నెక్స్ట్ ఎన్నికల్లో ఓడిపోతే పరిస్తితి ఎలా ఉంటుంది..అలాగే టీడీపీ అధికారంలోకి వస్తే ఇంకా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలని, కాబట్టి మంత్రులు ఇప్పటినుంచే నోరు అదుపులో పెట్టుకోవాలంటూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. వాస్తవానికి ఏపీలో దాదాపు అందరూ మంత్రులు..చంద్రబాబుని తిట్టడానికే ఉన్నారా? అనే విధంగా పనిచేస్తున్నారని చెప్పొచ్చు. రాజకీయాలు గురించి అవగాహన ఉన్నవారికి మంత్రులు […]

ఆ మంత్రులు అవుట్..జగన్ ఫిక్స్..?

జగన్ అధికారంలోకి వచ్చాక కేవలం రెండుసార్లు మాత్రమే మంత్రివర్గ విస్తరణ చేద్దామని అనుకున్నారు…కానీ పరిస్తితులు అలా లేవు..సమయాన్ని బట్టి మంత్రివర్గంలో మార్పులు చేయాల్సిన పరిస్తితి కనిపిస్తోంది..అధికారంలోకి రాగానే ఒకేసారి 25 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని..అప్పుడు అవకాశాలు రానివారికి మళ్ళీ రెండున్నర ఏళ్లలో అవకాశం ఇస్తానని చెప్పారు. అయితే మధ్యలోనే ఒకసారి చిన్న మార్పు చేయాల్సి వచ్చింది. అది కూడా మండలి రద్దు నేపథ్యంలో ఎమ్మెల్సీ నుంచి మంత్రి అయిన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లని […]