కొన్ని విషయాలు ఇంతే గురూ.. విని వదిలేయడమే! ఇదీ… ఒక వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య. అది కూడా.. సీఎం జగన్.. రెండు రోజుల కిందట నిర్వహించిన సమావేశం అనంతరం.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు వచ్చాయి. అయితే.. ఆయన సీమకు చెందిన నాయకుడిగా చెబుతున్నారు. పైగా.. ఆయనకు సొంత పార్టీపై కంటే.. కూడా ప్రతిపక్షాలపై జాలి ఎక్కువగా ఉందని.. నాయకులు భావిస్తున్నారు.
దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధిష్టానం వరకు కూడా వెళ్లాయి. ఇటీవల అసెంబ్లీ సమావేశా ల సమయంలోనూ.. ఈయన ఇలానే వ్యాఖ్యానించారు. సభలో మా వోళ్లు చేస్తున్న వ్యాఖ్యల వల్ల ప్రయోజనం ఏదైనా ఉందా? విలువైన సమయం.. డబ్బు కూడా వృథా చేస్తున్నారు.. అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం అన్ని పత్రికల్లోనూ వచ్చింది. అయితే.. అప్పట్లో లైట్ తీసుకున్న అధిష్టానం.. ఆయన మారతారని అనుకుంది.
కానీ, ఇటీవల నిర్వహించిన జగన్ సమావేశం అనంతరం.. వెళ్తూ. వెళ్తూ.. తన అనుచరులను కలుసుకు న్నారు. విజయవాడలోనిఓ హోటల్ లో పార్టీ కూడా చేసుకున్నారట. ఈ సందర్భంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై చర్చ వచ్చింది. సర్వేల విషయంలో జగన్ సీరియస్‌గా ఉన్నారని.. ఆయన చెప్పినట్టు.. మార్చేస్తే.. మన పరిస్థితి ఇబ్బందేనని.. మనం ఏదో ఒకటి చేయాలని.. సీమకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు.
అంటే.. వారుసీఎం చేసిన.. వ్యాఖ్యలను సీరియస్‌గానే తీసుకున్నారు. సర్వేలను కూడా నమ్ముతున్నా రట. కానీ, సీమకు చెందిన ఒక నాయకుడు.. అది కూడా.. సీఎం జగన్ సొంత సొంత జిల్లాలోని ఒక కీలక నియోజవకర్గం నాయకుడు మాత్రం.. అదంతా ట్రాష్. అసలు సర్వే చేయిస్తే.. ప్రభుత్వం చేస్తున్న తప్పులనే ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మనం ప్రజల మధ్య ఉండి ఏం చేయాలి? మనకు నిధులు ఇవ్వరు.. మనకు పింఛన్లు కేటాయించే ఛాన్స్ లేదు. మరి మనం ప్రజల వద్దకు వెళ్లి పోస్టు మ్యాన్ ఉద్యోగం చేయాలా.. అదంతా వేస్ట్.. కొన్ని విషయాలు ఇంతే విని వదిలేయాలి గురూ! అని వ్యాఖ్యానించారట. ప్రస్తుతం ఇవి తాడేపల్లి వరకు చేరాయని అంటున్నారు.