కర్నూలు జిల్లా వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. నిన్న మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి పార్టీలో చేరడంతో ఫుల్ ఖుషీగా ఉన్న జగన్ పార్టీకి ఆ మరుసటి రోజే ఎవ్వరూ ఊహించని షాక్ తగిలింది. భూమా ఫ్యామిలీకి చెందిన మంత్రి అఖిలప్రియ ప్రాథినిత్యం వహిస్తోన్న ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బోరెడ్డి లక్ష్మీరెడ్డి తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసిన లక్ష్మీరెడ్డి పార్టీ అధిష్టానంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీలో డబ్బున్న […]
Tag: YS Jagan
పార్టీకి గుడ్ బై యోచనలో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే..?
గుంటూరులో టీడీపీకి త్వరలోనే షాక్ తగలబోతోందా? కొంత కాలం నుంచీ ప్రభుత్వ పనితీరు, అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే.. పార్టీకి `ఇక సెలవు` అంటూ తన దారి తాను చూసుకోవాలని నిర్ణయించుకున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గుంటూరు-2 ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వ్యవహార శైలి పార్టీ నేతలకు అంతుచిక్కడం లేదు. మంత్రులే టార్గెట్గా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. స్వపక్షంలో ఉంటూనే విపక్షంలా ఉండటం మింగుడు పడని అంశం! తనపై […]
ఏపీ పాలిటిక్స్‌లో సీన్ రివర్స్
ఏపీలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. పార్టీ బలోపేతం కోసం ఏపీ సీఎం చంద్రబాబు నిన్నటి వరకు విపక్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను వరుసపెట్టి సైకిల్ ఎక్కించేసుకున్నారు. దీంతో ఇక్కడ టీడీపీ బండి ఓవర్ లోడ్ అయ్యింది. వైసీపీ నుంచి వచ్చిన కొత్త నాయకులకు అప్పటి వరకు టీడీపీలో ఉన్న పాత నాయకులకు మధ్య కూల్‌వాటర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతోంది. దీంతో కొత్త నాయకులతో పొసగని పాత నాయకులు ఇప్పుడు రివర్స్ జంప్ చేస్తున్నారు. వారంతా టీడీపీకి […]
ట్విస్ట్: నంద్యాల వైసీపీలో ఫైటింగ్
ఏపీలోని నంద్యాల నియోజకవర్గంలో రాజకీయాలు థ్రిల్లర్ పాలిటిక్స్‌ను తలపిస్తున్నాయి. నిన్నటి వరకు టీడీపీలో ఉప ఎన్నికల్లో సీటు కోసం భూమా వర్గం వర్సెస్ శిల్పా వర్గాల మధ్య ఓ రేంజ్‌లో ఫైట్ నడిచింది. చివరకు చంద్రబాబు సైతం వీరిలో ఎవరికి టిక్కెట్టు ఇవ్వాలో తెలియక నాన్చుతూ వచ్చారు. తాజాగా మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరడంతో ఇప్పుడు ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. నిన్నటి వరకు నంద్యాల టిక్కెట్టు ఎవరికి ఇవ్వాలో తెలియక […]
వారసుల ఫ్యూచరే ముఖ్యం….వైసీపీలోకి సీనియర్లు
ఏపీలో టీడీపీ బండి లోడ్ ఎక్కువైనట్టే కనిపిస్తోంది. డీ లిమిటేషన్ ఆశ చూపి చంద్రబాబు విపక్ష వైసీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చేసుకున్నారు. డీ లిమిటేషన్ జరిగితే ఓకే…లేనిపక్షంలో ఇప్పుడు వాళ్లకు టిక్కెట్ల కేటాయింపు చంద్రబాబుకు పెద్ద తలపోటే అవుతుంది. దీంతో ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్లంతా రివర్స్‌గేర్‌లో వైసీపీలోకి వెళుతున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రస్తుతం అదే జరిగింది. వీళ్ల సంగతి ఇలా ఉంటే కొందరు సీనియర్లు సైతం తమ, తమ […]
వైసీపీకి ఎంపీ అభ్యర్థులు కావలెను..?
ఏపీలో 2019 ఎన్నికల్లో విజయమే టార్గెట్‌గా ముందుకు వెళుతోన్న విపక్ష వైసీపీ పరిస్థితి మూడు అడుగులు ముందుకు…ఆరు అడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సలహాలు ఫాలో అవుతోన్న జగన్ అసెంబ్లీ నియోజకవర్గాల వరకు కాన్‌సంట్రేషన్ చేస్తోన్నా లోక్‌సభ నియోజకవర్గాలను లైట్ తీసుకుంటున్నట్టే కనపడుతోంది. ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీలుగా గెలిచిన నంద్యాల ఎంపీ ఎస్పీవై.రెడ్డి, అరకు ఎంపీ కొత్తపల్లి […]
జగన్ కి హైకోర్టు మరో ఝలక్
వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. జగన్ వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. జగన్ గతంలో తనపై కృష్ణా జిల్లా నందిగామ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టి వేయాలని హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటీషన్ పరిశీలించిన హైకోర్టు జగన్‌కు షాక్ ఇస్తూ ఆ పిటీషన్‌ను తోసిపుచ్చింది. దివాకర్ బస్సు ట్రావెల్ ప్రమాదం జరిగినప్పుడు ఆ బాధితులను పరామర్శించేందుకు వచ్చిన జగన్ అధికారులతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు […]
వైసీపీకి సీనియర్ నేతలు కావలెను?!
ఇప్పుడు ఎక్కువ మంది ఇలానే ఆలోచిస్తున్నారట! రాబోయే రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు పెట్టుకుని ఇప్పుడు వైసీపీ తడబడుతోందని, అధికార టీడీపీని ఎదుర్కొనే సత్తా కూడా ఈ పార్టీలో కరువవుతోందని అంటున్నారు. ఈ నపథ్యంలోనే సీనియర్ల కోసం జగన్ ఎదురు చూస్తున్నాడని అంటున్నారు. అసలు ఏం జరుగుతోందో తెలుసుకుందాం.. ఇటీవల కాలంలో పొలిటికల్ పరిణామాలను గమనిస్తే.. ఏపీలో అధికార టీడీపీపై వైసీపీ పైచేయి సాధించలేకపోతోంది. ముఖ్యంగా అసెంబ్లీలో జగన్ చాంబర్‌లో వర్షపునీళ్లు పారడంపై పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన నేతలు […]
వైసీపీ సిట్టింగులలో 16 మందికి టిక్కెట్లు లేవా
ఏపీలో 2019 ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన పని అప్పుడే స్టార్ట్ చేసేశాడు. ఇప్పటికే వైఎస్.జగన్‌ను హైదరాబాద్ నుంచి విజయవాడకు మకాం మార్చేయాలని చెప్పిన ప్రశాంత్ ప్రస్తుతం వైసీపీకి ఉన్న ప్రజాప్రతినిధుల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోన్న వారిలో కొందరికి టిక్కెట్లు ఇవ్వకూడదని కూడా జగన్‌కు ప్రాధమిక నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ ప్రాధమిక నివేదికలో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టేయాలని జగన్‌కు చెప్పినట్టు ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి. తిరుపతి […]