కొడాలి నాని పొలిటిక‌ల్ రూటు మారుతోందా..!

కృష్ణా జిల్లా గుడివాడ‌లో గ‌త ద‌శాబ్దంన్న‌ర‌గా తిరుగులేని రాజ‌కీయాలు చేస్తూ గుడివాడ ఫైర్‌బ్రాండ్‌గా మారిపోయాడు కొడాలి నాని. పార్టీ ఏదైనా ఆయ‌న మాత్రం వ‌రుస‌గా ఎమ్మెల్యేగా గెలుస్తూనూ ఉన్నాడు. నాని గెలిచిన ప్ర‌తిసారి ఆయ‌న పార్టీ అధికారంలోకి రావ‌డం లేదు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నో ఇబ్బందుల్లో ఉంటున్నాడు…అయినా గెలుపు మాత్రం ఆయ‌న‌దే. దివంగ‌త మాజీ సీఎం ఎన్టీఆర్ గ‌తంలో ప్రాథినిత్యం వ‌హించిన గుడివాడ ఒక‌ప్పుడు టీడీపీకి కంచుకోట‌. అలాంటిది ఇప్పుడు నానిని కంచుకోట‌గా మారింది. ఇదిలా ఉంటే 2004, […]

పీకే వ్యూహాల‌తో జ‌గ‌నే కాదు…ఆయ‌నా సీఎం అవ్వాల‌ట‌

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహాల‌కు బాగా డిమాండ్ పెరిగిపోయింది. వివిధ రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షాల్లో ఉన్న పార్టీ నేత‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు పీకే ఓ ఆప్ష‌న్‌గా క‌నిపిస్తున్నాడు. పీకే చేప‌ట్టిన ప్రాజెక్టులు గుజ‌రాత్‌, ఢిల్లీ, బిహార్‌, పంజాబ్‌ల‌లో సూప‌ర్ స‌క్సెస్ అయ్యాయి. ఆయ‌న టేకాఫ్ చేసిన ప్రాజెక్టుల్లో ఒక్క యూపీలో మాత్ర‌మే ఫెయిల్ అయ్యింది. ఇక్క‌డ బీజేపీని ఓడించేందుకు ఆయ‌న ఎస్పీ+కాంగ్రెస్‌ను ఒక్క‌టి చేసినా ఘోర ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు. ఇక […]

జ‌గ‌న్ హామీలు స‌రే.. లెక్క‌లు చూస్తే టెన్ష‌నే!! 

ప్లీన‌రీ వేదిక‌గా వైసీపీ అధినేత జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల‌కు స‌మ‌ర‌భేరి మోగించారు. అన్ని వ‌ర్గాల‌కు చేరువయ్యేలామొత్తం తొమ్మిది ప‌థ‌కాలు ప్ర‌క‌టించేశారు. దీనిపై హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే వీటి అమ‌లు ఎంత వ‌ర‌కూ సాధ్య‌మ‌నే దానిపైనే ఇప్పుడుచ‌ర్చ మొద‌లైంది. అల‌వికాని హామీలిచ్చి.. వాటిని నెర‌వేర్చేందుకు సీఎం చంద్ర‌బాబు ఎన్ని క‌ప్ప‌గంతులు వేస్తున్నారో తెలిసిందే! ఇప్పుడు జ‌గ‌న్ ఇచ్చిన హామీల అమ‌లు సాధ్య‌మ‌య్యేనా అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప‌థ‌కాలకు ఎంత ఖర్చు అవుతుంది. అంతంత‌మాత్రంగా ఉన్న‌ రాష్ట్ర ఆదాయ ప‌రిస్థితి. […]

జ‌గన్ సీఎం అయితే రోజా ఆ కీల‌క శాఖ‌కు మంత్రా..!

రోజాకు చంద్ర‌బాబు పొలిటిక‌ల్ లైఫ్ ఇచ్చినా ఆ పార్టీలో ఆమెకు ఏ మాత్రం క‌లిసి రాలేదు. చంద్ర‌బాబు రోజాను తెలుగు మహిళా అధ్య‌క్షురాలిగా చేసి ఆమె త‌న వాయిస్ వినిపించుకునే ఛాన్స్ ఇచ్చారు. ఈ ప‌ద‌వితో రోజా స్టేట్ వైడ్‌గా హైలెట్ అయ్యింది. త‌ర్వాత రోజాకు చంద్ర‌బాబు 2004, 2009లో రెండుసార్లు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినా రెండుసార్లు ఆమె ఓడిపోయింది. 2004లో న‌గ‌రి సీటు ఇచ్చిన బాబు 2009లో అక్క‌డ గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు కోసం ఆమెను చంద్ర‌గిరికి […]

మ‌రో అద్భుత‌ ర‌త్నం మ‌రిచిపోయిన జ‌గ‌న్‌

`ప్ర‌త్యేక హోదా కోసం చివ‌రి వ‌ర‌కూ పోరాడ‌తాం, ఎంపీల‌తో రాజీనామా చేస్తాం. కేంద్రం మెడ‌లు వంచైనా హోదా సాధిస్తాం` అంటూ ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్ ప‌దేప‌దే చెబుతూ ఉంటారు. హోదా ఇస్తామ‌ని మాట ఇచ్చి.. త‌ర్వాత దానిని తుంగ‌లో తొక్కిన బీజేపీపై ప్ర‌జ‌ల్లో ఉన్న ఆగ్ర‌హాన్ని క్యాష్ చేసుకునేందుకు ఆయ‌న ప‌దేప‌దే ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడ ప్లీన‌రీ వేదిక‌గా ప్రజ‌ల‌కు అన్ని హామీలు ఇచ్చిన వైసీపీ అధినేత‌.. ఇప్పుడు హోదా అంశాన్ని ప‌క్క‌న పెట్టేశార‌నే విమ‌ర్శ‌లు […]

ప‌వ‌న్ కూడా రెడీ..!

ఏపీలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌కు పాద‌యాత్ర‌లు బాగానే క‌లిసొస్తున్నాయి. గ‌తంలో దివంగ‌త మాజీ సీఎం వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి 2003లో పాద‌యాత్ర చేసి సీఎం అయ్యారు. ఇక ప‌దేళ్ల‌పాటు ప్ర‌తిప‌క్షంలో ఉన్న చంద్ర‌బాబు సైతం పాద‌యాత్ర చేసి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచి ఇప్పుడు ఏపీ సీఎం అయ్యారు. మ‌ధ్య‌లో జ‌గ‌న్ జైలులో ఉన్న‌ప్పుడు సోద‌రి ష‌ర్మిల పాద‌యాత్ర చేసినా ఆమె పాద‌యాత్ర‌కు జ‌నాల్లో అనుకున్నంత మైలేజ్ రాలేదు. ఇక ఇప్పుడు విప‌క్ష వైసీపీ అధినేత ప్లీన‌రీ సాక్షిగా తాను పాద‌యాత్ర‌కు రెడీ […]

జ‌గ‌న్ ప‌థ‌కాల‌తో బాబుకు చెమ‌ట‌లు ప‌డుతున్నాయా

ప్లీన‌రీ వేదిక‌గా వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎన్నిక‌ల మ్యానిఫెస్టోని ప్ర‌క‌టించేశారు. అన్ని వ‌ర్గాల‌కు ల‌బ్ధి చేకూరేలా ప‌థ‌కాలు వెల్ల‌డించారు. 2019 ఎన్నిక‌ల్లో గెలుపే ధ్యేయంగా ప‌క్కా వ్యూహంతో ముందుకొచ్చారు. అందుకు త‌గిన ప్ర‌ణాళిక కూడా ప్ర‌క‌టించేశారు. అయితే ప్ర‌తిప‌క్ష నేత ప్రవేశ‌పెట్టిన ప‌థ‌కాలు ఇప్పుడు టీడీపీ నేత‌లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా రైతు, పేద‌, బ‌డుగు వ‌ర్గాల‌కు చేరువ‌య్యేందుకు 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఎన్నో హామీలు గుప్పించారు. వాటికి […]

వైసీపీ ప్లీన‌రీ ప్లాపా..హిట్టా..యావ‌రేజా..!

స్త‌బ్దుగా ఉన్న‌ కార్య‌క‌ర్త‌ల్లో నయా జోష్ నింపేలా.. నిస్తేజ‌మై ఉన్న క్యాడ‌ర్‌లో `న‌వ` శక్తి నింపేలా.. వైఎస్సార్ సీపీ ప్లీన‌రీ వేదిక‌గా అధ్య‌క్షుడు జ‌గ‌న్ 2019 ఎన్నిక‌లకు స‌మ‌ర‌శంఖం పూరించాడు. ఎన్నిక‌ల హామీలు రెండేళ్ల ముందుగానే ప్ర‌క‌టిస్తూ.. పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని పిలుపునిచ్చారు. అయితే ప్లీన‌రీ సూప‌ర్ హిట్ అయింద‌ని కార్య‌క‌ర్త‌లు సంబ‌ర‌ప‌డుతున్నారు. ఇది కేవ‌లం చంద్ర‌బాబును తిట్ట‌డానికేన‌ని, ఇది అట్ట‌ర్ ప్లాప్ అని టీడీపీ చెబుతోంది. వైసీపీ ప్లీన‌రీ మాత్రం యావ‌రేజ్ అని విశ్లేష‌కులు అంచ‌నా […]

ఆంధ్ర‌జ్యోతితో క్లోజ్‌గా ఉండే వైసీపీ నాయ‌కుల ప‌ని అంతే..!

ప్ర‌స్తుతం తెలుగు మీడియాలో చాలా ప‌త్రిక‌లు పార్టీల‌కు క‌ర‌ప‌త్రిక‌లుగా మారిపోయాయ‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. పార్టీలు – ప‌త్రిక‌లు క‌ర‌ప‌త్రిక‌లు అన్న అంశంపై తెలంగాణ‌లో కంటే ఏపీలోనే ఎక్కువుగా చ‌ర్చ జరుగుతోంది. ఏపీలో అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీకి అనుకూలంగా మీడియా చీలిపోయింద‌న్న‌ది నిజం. ఈ క్ర‌మంలోనే వైసీపీకి అనుకూలంగా ఉన్న మీడియాను టీడీపీ వాళ్లు త‌మ స‌భ‌లు, స‌మావేశాల‌కు అనుమ‌తించ‌డం లేదు. ఇక టీడీపీకి అనుకూలంగా కొమ్ముకాస్తోన్న మీడియా సంస్థ‌ల‌ను వైసీపీ వాళ్లు అలాగే చేస్తున్నారు. గతంలో […]