2019 క్లారిటీ: ఎన్టీఆర్‌+ప‌వ‌న్‌+లోకేశ్ ఒక‌వైపు జ‌గ‌న్ ఒక వైపు

2019 ఎన్నిక‌లు రెండు తెలుగు రాష్ట్రాల్లోను హీటెక్కిస్తున్నాయి. ఈ హీట్ తెలంగాణ‌లో కంటే ఏపీలోనే ఎక్కువుగా ఉంది. ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులు మార‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. నేడు మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న‌వాళ్లు ఎన్నిక‌ల వేళ శ‌త్రువులు అవుతార‌న్న ఊహాగానాలు కూడా మొద‌ల‌య్యాయి. ఇదిలా ఉంటే ఏపీలో బీజేపీ+టీడీపీ పొత్తు బ్రేక‌ప్ అవుతుంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో బుధవారం ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. […]

బీజేపీతో వైసీపీ పొత్తు…. సీట్ల డీల్ ఇదే..!

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న అధికార టీడీపీ+బీజేపీ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి క‌లిసుండే ఛాన్సులు లేవ‌ని ప్రచారం జ‌రుగుతోంది. కొద్ది రోజులుగా జ‌రుగుతోన్న ప‌రిణామాలు కూడా అందుకు ఊతం ఇచ్చేలా ఉన్నాయి. చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడు అయిన మాజీ కేంద్ర మంత్రి ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెళ్లిపోతుండ‌డం, ఇక ఇప్పుడు ఏపీ బీజేపీ అంతా చంద్ర‌బాబును టార్గెట్ చేసే వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోవ‌డంతో ఏపీలో బీజేపీ టీడీపీ మ‌ధ్య ఫ్యూచ‌ర్‌లో వార్ ఓ […]

నంద్యాల‌లో వైసీపీ షాడో టీంలు!

భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంలో ఖాళీ అయిన నంద్యాల ఎమ్మెల్యే స్థానానికి వ‌చ్చే నెలలో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించి ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ కూడా జారీ చేసింది. అయితే, ఈ స్థానం నుంచి గెలిచి తీరాల‌ని ఏపీ అధికార ప‌క్షం టీడీపీ, విప‌క్షం వైసీపీలు గ‌ట్టి  పంతం ప‌ట్టాయి. ఈ సీటు త‌మ‌దేన‌ని వైసీపీ, లేదు త‌మ అభ్య‌ర్థిగా ఉన్న భూమా మ‌ర‌ణించాడు కాబ‌ట్టి ఇది త‌మ‌దేన‌ని టీడీపీలు వాదిస్తున్నాయి. ఇక‌, అధికార ప‌క్షం ఎన్నిక‌ల […]

న‌లుగురు వైసీపీ ఎంపీ అభ్య‌ర్థులు ఖ‌రారు!

సంచ‌ల‌న నిర్ణ‌యాల‌కు పెట్టి పేరైన దివంగత వైఎస్ కుమారుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల‌కు సంబంధించి.. మ‌రింత సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యంలో ఉండ‌గానే ఆయ‌న ప్ర‌జ‌ల‌పై న‌వ ర‌త్నాల పేరుతో వ‌రాల జ‌ల్లు కురిపిస్తూ.. ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు.  అదేస‌మ‌యంలో ఎంపీ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌డం ఇప్పుడు మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. వైసీపీ త‌ర‌ఫున 2019లో పార్ల‌మెంటుకు పోటీ చేసే అభ్య‌ర్థుల‌పై జ‌గ‌న్ ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు ప్రారంభించేశారు. ఈ […]

నంద్యాల వార్ భూమా, శిల్పాది కాదు బాబు-జ‌గ‌న్ మ‌ధ్యే

భూమా నాగిరెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణంతో ఖాళీ అయిన నంద్యాల ఎమ్మెల్యే సీటుకు ఉప ఎన్నిక త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించి ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ కూడా జారీ చేసింది. అయితే, ఈ ఉప ఎన్నిక‌పై అంచ‌నాలు రోజు రోజుకు మారిపోతున్నాయి. వాస్త‌వానికి ఈ ఉప ఎన్నిక పార్టీ ల మ‌ధ్య కాకుండా పార్టీ అధినేత ల మ‌ధ్య ఫైట్‌గా మారిపోయింది. సుదీర్ఘ అనుభ‌వం ఉన్న రాజ‌కీయ నేత‌గా బాబుకు, యువ‌నేత‌గా జ‌గ‌న్‌కు మ‌ధ్య సాగుతున్న పోరుగా నంద్యాల […]

జగన్ చెంతకు ముద్ర‌గ‌డ…ఎంపీగా పోటి అక్కడ నుండే

కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పొలిటిక‌ల్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స‌యిపోయిందా? ఆయ‌న ప్ర‌ధాన విప‌క్షం జ‌గ‌న్ పార్టీ వైసీపీలోకి ఎంట్రీ ఇస్తున్నారా? అంటే ఔన‌నే అంటున్నారు తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌కీయ నేత‌లు. విష‌యంలోకి వెళ్తే.. గ‌డిచిన రెండేళ్లుగా ముద్ర‌గ‌డ ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా క‌నిపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కాపు ల‌కు రిజ‌ర్వేష‌న్ ఇవ్వ‌డంలో చంద్ర‌బాబు తాత్సారం చేస్తున్నార‌ని ఆయ‌న ప‌దే ప‌దే విమ‌ర్శించ‌డ‌మే కాకుండా కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ సాధించేందుకు ఆయ‌న అలుపెరుగ‌ని కృషి చేస్తున్నారు. త‌న […]

వైసీపీలోకి మాజీ మంత్రి..!

వైసీపీలోకి మరో సీనియర్ నేత….కీలకనేత చేరబోతున్నారు. గ‌తంలో స‌మైక్యాంధ్ర‌ప్రదేశ్‌కు మంత్రిగా ప‌నిచేసిన స‌ద‌రు కీల‌క నేత ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. దీంతో పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ నేప‌థ్యంలో ఆయ‌న పార్టీ మారేందుకు రెడీ అవుతోన్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌కాశం జిల్లా కందుకూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన మానుగుంట మహీధర్ రెడ్డి త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మహీధర్ రెడ్డి మూడు సార్లు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఆయ‌న కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసేందుకు […]

బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకోవ‌డం ఎంత క్షేమం, ఎంత మేర‌కు లాభం ?

అవును! ఇప్పుడు ఏ రాజ‌కీయ విశ్లేష‌కులను ప‌ల‌క‌రించినా ఏపీలో ప‌రిస్థితిపై చెబుతున్న మాట ఇది! బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఐర‌న్ లెగ్‌తో సంసారం చేసిన‌ట్టేన‌ని అంటున్నారు. విష‌యం లోకి వెళ్లిపోతే.. 2019లో ఏపీలో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు అత్యంత ప్రాధాన్యం ఏర్ప‌డింది. మిగిలిన రాష్ట్రాల‌తో పోల్చుకుంటే ఇక్క‌డ విప‌క్షం గ‌ట్టిగా ఉండ‌డం, ప్ర‌జ‌లు ఆయ‌న‌తో ఉండ‌డం, 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని డిసైడ్ అవ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల‌పై అంచ‌నాలు ఊపందుకున్నాయి. ఈ క్ర‌మంలో […]

మంత్రి పితానిపై వైసీపీ క్యాండెట్ రెడీ!

ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో క్యాండెట్ల ఎంపిక గజిబిజి గంద‌ర‌గోళంగా ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇంకా చాలా రోజుల టైం ఉన్నా ఎవ‌రు ఎక్క‌డ పోటీ చేస్తారు ? ఏ నియోజ‌క‌వ‌ర్గం ఎవ‌రికి సేఫ్‌గా ఉంటుంది ? అన్న‌దానిపై ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా టీడీపీకి కంచుకోట‌గా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ అన్ని స్థానాల్లోను క్వీన్‌స్వీప్ చేసేసింది. ఈ ఎన్నిక‌ల‌కు ముందు తీవ్ర వ్య‌తిరేక‌త‌తో కొట్టుమిట్టాడుతోన్న మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ చివ‌రి […]