గత ఎన్నికల ముందు జగన్ పార్టీకి అన్నీ తానై నడిపిన ప్రశాంత్ కిశోర్ ఈసారి కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కాకపోయినా వైసీపీ కోరిక మేరకు ఈ ఎన్నికలకు కూడా పీకే పనిచేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వైజాగ్ పై పీకే టీమ్ కాన్సంట్రేట్ చేసింది. అక్కడ ప్రాథమికంగా సర్వే చేసినట్లు సమాచారం. ఈ సర్వేలో వైసీపీ నేతలు.. ముఖ్యంగా స్థానిక నాయకుడు, పార్టీ సీనియర్ లీడర్, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి షాకయ్యే […]
Tag: YS Jagan
పవన్ భజన చేస్తున్న టీడీపీ దళాలు!
జనసేనాని పవన్ కల్యాణ్ షూటింగుల విరామంలో ఒక సినిమా ఫంక్షన్ కు హాజరయ్యారు. చాన్నాళ్ల తర్వాత.. ఎదురుగా షూటింగు కెమెరాలు కాకుండా ప్రజలు కనిపించారు. చాన్నాళ్ల తర్వాత మైకు దొరికింది. మైకు దొరకడమే తడవుగా.. అది సినిమా ఫంక్షన్ అనే సంగతిని మర్చిపోయి.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎడా పెడా తూర్పారపట్టేశారు. యావత్ సినీ పరిశ్రమకు తాను రక్షకుడు అన్న రీతిలో.. పరిశ్రమ తరఫున తానొక్కడే గళంవినిపిస్తున్నాననే రీతిలో.. గర్జించారు. ప్రభుత్వానికి సవాళ్లు విసిరారు. ఇదంతా ఒక […]
జగన్ గారూ.. చురుగ్గా స్పందించాల్సిందే!
అమ్మాయిల మానరక్షణ కోసం, దుర్మార్గుల వెన్నులో వణుకు పుట్టించడం కోసం ‘దిశ’ వంటి కఠినమైన చట్టాలను తీసుకువచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. మరి ఆయన పార్టీకి చెందిన వారే.. అకృత్యాలకు పాల్పడితే ఏం చేయాలి? పార్టీ ఎలా స్పందించాలి? ఆరోపణలు వచ్చిన తక్షణమే స్పందించి, చర్యలు తీసుకుంటే తప్ప.. ఇతరత్రా దక్కుతున్న మంచిపేరును ప్రభుత్వం నిలబెట్టుకోవడం కష్టం. విశాఖ జిల్లా సీలేరులో ఒక దుర్మార్గం జరిగింది. ఆ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చిన్న […]
పరువు పోయె : వెల్లంపల్లి ప్రకటనతో మరిన్ని సందేహాలు
కోర్టులనుంచి వరుస ఎదురుదెబ్బలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి విషయంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ప్రభుత్వానికి ఇంకా ఇబ్బందికరమైనవి. భారీ సంఖ్యలో టీటీడీకి ప్రత్యేక ఆహ్వానితుల్ని నియమిస్తూ జగన్ సర్కారు జీవో ఇవ్వగా, ఆ జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేసింది. ఇదంతా ఒక ఎత్తు. కోర్టుల్లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగలడం పెద్ద విషయమేమీ కాదు. కొత్త సంగతి కూడా కాదు. అయితే […]
జగన్ ని కలిసే చిరంజీవి టీమ్ ఇదే..!
సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీ సర్కారు తెచ్చిన జీఓ సినిమా పెద్దలను నిద్రలేకుండా చేస్తోంది. థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్లు టాలీవుడ్ ప్రముఖులపై ఒత్తిడి తెస్తున్నారు. టికెట్లు ప్రభుత్వమే అమ్మితే మేం ఎందుకు? మేం థియేటర్లు మూసేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో సినీ ప్రముఖులు సీఎంను కలిసేందుకు కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 20న జగన్ తో సమావేశమై చర్చించనున్నారు. అయితే సీఎం మీటింగ్ లో ఎవరెవరు పాల్గొంటున్నారనేది బయటకు రావడం లేదు. అయితే ఇంతకుముందే టాలీవుడ్ […]
డేట్ ఫిక్స్ అయినట్టేనా..మరోసారి వాయిదా పడుతుందా?
ఏపీలో నెలకొన్నథియేటర్ ఇబ్బందులను, పరిశ్రమ సమస్యలను చర్చించేందుకు చిరంజీవి అండ్ టీమ్ ఈనెల 20న సీఎం జగన్ తో సమావేశమవుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. సమావేశానికి సినీ పెద్దలు సమాయత్తమవుతున్నారని కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సీఎం తో సమావేశం మంత్రి పేర్ని నాని కూడా ఖరారు చేశారట. మంత్రితో చిరంజీవి నిరంతరం టచ్ లోఉంటున్నారట. ఈ విషయంపై నాని కూడా సజ్జలతో మాట్లాడారని సమాచారం. గతంలోనే ఈ సమావేశం జరగవలసి ఉంది. సెప్టెంబర్ 4వ […]
లోకేష్ ను పాపులర్ లీడర్ చేస్తున్న జగన్
చదవడానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజమేమో అన్నట్లుంది ఏపీలో రాజకీయ పరిస్థితులు.. అదేంటి లోకేష్ ను రాజకీయంగా జగన్ ఎందుకు పాపులర్ చేస్తాడనే అనుమానాలు వస్తాయి. కానీ.. ఆలోచిస్తే అదే జరుగుతోంది. ఎలా అంటే.. రాష్ట్రంలో ఎక్కడ లైంగిక దాడి జరిగినా.. టీడీపీ కార్యకర్తలపై ఎవరు దాడిచేసినా నారా లోకేష్ వాలిపోతున్నాడు. వారిని పరామర్శిస్తున్నాడు. ధైర్యం చెబతున్నాడు.. అదే ఇపుడు జగన్ కు ఇబ్బందిగా మారింది. ఎక్కడ చూసినా లోకేష్ వార్తల్లో ఉంటుండటంతో చెక్ పెట్టాలని జగన్ […]
ఆ ఇద్దరూ సంతోషపడేలా జగన్ నిర్ణయం!
వైసీపీలో ఇద్దరు నాయకులు బాగా అసంత్రుప్తిగా ఉన్నారు. ఒకరు స్పీకర్ తమ్మినేని సీతారాం, మరొకరు సీనియర్ లీడర్ ధర్మాన ప్రసాదరావు. ఈ విషయం సీఎం, పార్టీ చీఫ్ జగన్ కు కూడా తెలుసు. తనకు స్పీకర్ పదవి వద్దు.. మంత్రి పదవి కావాలని తమ్మినేని చాలా రోజులుగా అడుగుతున్నాడు.. సమయం ఇంకా రాలేదు కదా అని జగన్ అనుకుంటున్నాడు.. ఇక ధర్మాన ప్రసాదరావు అయితే.. తీవ్ర అసంత్రుప్తిగా ఉన్నాడు. ఇంత సీనియర్ లీడర్ అయిన తనకు పార్టీలో […]
డైలాగులు రీల్ లైఫ్ లోనే.. పేరుకు సినిమా పెద్దలు!
మన సినిమా హీరోలున్నారే.. సినిమాల్లో అద్భుతమైన డైలాగులు చెబుతారు.. వావ్ .. అనిపించేలా మాట్లాడతారు.. ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంటారు.. మరి నిజజీవితంలో.. బిల్ కుల్ సైలెంట్.. ఎక్కడ ఏం జరిగినా మనకేంటి అన్నట్లుంటారు.. మనకెందుకులే అనేది వాళ్ల ఫీలింగ్.. సమస్య ఎవరిదైనా సినిమా.. పక్కింటివాడిదైనా.. తన సినిమా నిర్మాతదైనా.. ఏ సమస్య వచ్చినా మేము జడపదార్థాలే అనేది మరోసారి నిరూపించారు.. ఏ విషయంలో అంటే.. సినిమా టికెట్ల విషయంలో జగర్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఎవరూ […]