మంత్రి మల్లారెడ్డి అంటే అంతే..

విద్యాసంస్థల అధినేత, మంత్రి మల్లారెడ్డి అంటే అంతే.. ఆయన రూటే సపరేటు.. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే.. ఇపుడు ఆయన వ్యవహార శైలి మాత్రం మేడ్చల్ జిల్లాలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా భూ సమస్యలు, భూ కబ్జాలను ప్రోత్సహించడం, రియల్ వ్యాపారుల నుంచి డబ్బు డిమాండ్ చేయడం లాంటివి చేస్తున్నాడని పార్టీలోని పలువురు నాయకులు పార్టీకి ఫిర్యాదు చేశారని తెలిసింది. అయితే ఇంత జరుగుతున్నా తనకు కేసీఆర్, కేటీఆర్ తనకు బాగా క్లోజ్ […]

కారులో ఇమడలేకపోతున్న పొంగులేటి

ఖమ్మం జిల్లాలో సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇపుడు పార్టీలో కష్టకాలం వచ్చిందట. గతంలో వైసీపీలో ఉన్నపుడు ఖమ్మం ఎంపీగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో వైసీపీ రాజకీయ కార్యకలాపాలు చేపట్టకపోవడం, ఏపీపైనే పూర్తిగా ద్రుష్టి సారించడంతో పొంగులేటి కారు పార్టీ వైపు వెళ్లిపోయారు. అప్పటి నుంచీ టీఆర్ఎస్ పార్టీలోనే చురుగ్గా ఉంటున్నారు. అయితే కొద్ది కాలంగా పొంగులేటికి గులాబీ నేతల నుంచి సహకారం లభించడం లేదని, అధిష్టానానికి ఆయన […]

గరం..గరం..గద్వాల రాజకీయం

డీకే అరుణ.. అప్పట్లో కాం‍గ్రెస్‌ ఫైర్‌ బ్రాండ్‌.. ఇప్పుడు బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షురాలు. రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు వేయడంలో అందెవేసిన చేయి. అయితే ఇప్పుడు అరుణ సొంత నియోజకవర్గం (గద్వాల) ఎమ్మెల్యే అయిన తన మేనల్లుడు బండ్ల క్రిష్ణ మోహన్‌రెడ్డితో ఢీ అంటే ఢీ అంటున్నారు. డీకే అరుణ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నపుడు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009, 2014లో విజయం సాధించి తనకు తిరుగులేదని నిరూపించారు. అయితే రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడూ […]

కేటీఆర్‌ సార్‌.. మేయర్‌ గారెక్కడ?

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్పొరేటర్లు సరికొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. కార్పొరేటర్లందరికీ కాదు కదా సొంతపార్టీ కార్పొరేటర్లకు కూడా మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అందుబాటులో ఉండటం లేదు. తమ డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మేయర్‌ ను కలిసి వివరిద్దామనుకుంటే వారికి నిరాశే ఎదురవుతోంది. మాకే మేయర్‌ అందుబాటులో లేకపోతే మేం ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించగలం? అని వాపోతున్నారని సమాచారం. 2021 ఫిబ్రవరిలో మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి పేరు బయటకు రావడం.. ఆమెను […]

రేపే ఫస్ట్ మీటింగ్.. టెన్షన్.. టెన్షన్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)..ప్రభుత్వానికి, ప్రభుత్వ ఆదాయానికీ ఇదే ఆయువుపట్టు.. ఇక్కడ సక్సెస్ అయితే రాజకీయ నాయకులు త్వరగా పేరు వస్తుంది.. మీడియా, సోషల్ మీడియాలో కూడా హైదరాబాదులో జరిగే కార్యకలాపాలు, వ్యవహారాలు కనిపిస్తాయి.. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం రేపు (శనివారం) జరుగనుంది. బల్దియాకు ఎన్నికలు జరిగి సంవత్సరం గడిచినా కనీసం ఒక్కసారి కూడా సమావేశం ఏర్పాటు చేయలేదు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు గ్రేటర్ కార్యాలయంపై ఏకంగా దాడిచేసినంత పని చేశారు. కార్పరేటర్లుగా […]

ఫస్ట్ ఎటు పోదాం సామీ?

ఆయనంటే రాజకీయ నాయకులకు ఓ నమ్మకం.. ఓ భరసా.. తమ పార్టీని అధికారంలోకి తెస్తాడనే ఆశ.. అలా చేశాడు కూడా.. కావాల్సినంత డబ్బులిస్తే తన మేధస్సు ఉపయోగించి ఎలాగైనా పవర్ తెప్పిస్తాడు అనేది అందరూ నమ్ముతున్నారు.. అలా జరుగుతోంది కూడా. ఆయనే పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్. అలాంటి వ్యక్తే ఇపుడు కన్ఫ్యూజన్ లో ఉన్నాడట. ఏ విషయంలో అంటే తెలుగు రాష్ట్రాల విషయంలో. ఏపీలో వైసీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి సలహాలు, సూచనలు ఇస్తానని మాటిచ్చాడు. […]

కారులో ఇమడలేకపోతున్న డీఎస్!

ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్).. ఉమ్మడి ఏపీలో రాజకీయాల్లో చురుగ్గా ఉన్న వ్యక్తి.. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం.. హస్తం పార్టీకి తెలంగాణలో పెద్దగా ఆదరణ లేకపోవడంతో డీఎస్ కారు పార్టీ ఎక్కాడు. ఆయనకున్న ఇమేజిని ద్రుష్టిలో పెట్టుకున్న కేసీఆర్ రాజ్యసభకు పంపాడు. అయితే ఎందుకో రెండు, మూడేళ్లుగా ఆయన గులాబీ పార్టీలో అయిష్టంగానే ఉన్నాడు. ఉమ్మడి ఏపీలో ఆయన హవానే వేరు.. వైఎస్, డీఎస్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీని శాసించారని కూడా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. […]

కారెక్కనున్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే?

రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అస్మదీయులు.. తస్మదీయులుగా మారవచ్చు.. తస్మదీయులు అస్మదీయులుగా మారవచ్చు. ఎందుకంటే అది కూడా ఓ ఆటలాంటిదే. ఐపీఎల్ కూ, పాలిటిక్స్ కూ పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోఉంటారో తెలియదు. ఐపీఎల్ లో కూడా ఏ ప్లేయర్ ఏ టీమ్ లోఉంటాడో అర్థం కాదు. ఇపుడు తెలంగాణలో మరో పుకారు షికారు చేస్తోంది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం ప్రగతి భవన్ లో […]

కారు పార్టీలో ‘స్మార్ట్‘ భయం!

ల్యాండ్ ఫోన్.. బేసిక్ ఫోన్ ఉన్నపుడే అందరూ ప్రశాంతంగా ఉండేవాళ్లు..ఒక్కరి విషయాలు ఒకరికి మాట్లాడితే తప్ప తెలిసేది కాదు.. కానీ స్మార్ట్ ఫోన్ వచ్చిన తరువాత ఆ పరిస్థితి లేదు.. ప్రైవసీ అసలే లేదు.. స్మార్ట్ ఫోన్ మన మనసుల్లోకి తొంగి చూస్తోంది.. ఎప్పుడేం మాట్లాడినా కనిపెట్టేస్తోంది..కనిపెట్టడమే కాదు ఇతరుల చెవుల్లోకి దూరిపోతోంది.. అందుకే స్మార్ట్ ఫోన్ లో మాట్లాడాలంటేనే భయం.. పర్సనల్ విషయాలు అస్సలు మాట్లాడే పరిస్తితి లేదు.. ఎందుకంటే రికార్డింగ్ సౌకర్యం అందులో ఉండటంతో […]