మన తెలుగు సినిమాల బడ్జెట్ కూడా ఇప్పుడు బాలీవుడ్‌కు ధీటుగా ఉంటోంది. తెలుగులో స్టార్ హీరోతో సినిమా చేయాలంటే తక్కువలో తక్కువ 50 కోట్లు కావాల్సిందే. ఇప్పుడు ఈ లెక్కను ఎనిమిది రెట్లు పెంచేశాడు సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ శంకర్. 2.0 సినిమా కోసం ఏకంగా 400 కోట్లు పెట్టిస్తున్నాడు. సౌత్ ఇండియా సినిమాకు రూ.400 కోట్ల బడ్జెట్ అంటే అది ఊహకే అందడం లేదు. ఇది కలా ? నిజమా ? అన్న సందేహాలు […]
Tag: tollywood
రాంచరణ్‌కు షాక్ ఇచ్చిన నిఖిల్
మెగా ఫ్యామిలీ హీరో మెగాపవర్‌స్టార్ రాంచరణ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో ఒకడు. టాలీవుడ్‌లో తొలి రూ.50 కోట్ల హీరోగా రికార్డులకు ఎక్కిన చెర్రీ నటించిన 9 సినిమాలలో ఏకంగా 6 సినిమాలు రూ.40 కోట్ల క్లబ్‌లో చేరాయి. అయినా ఏం లాభం… ఇంట్లో ఎంత గెలిచినా.. వీధిలో మాత్రం చరణ్ పిల్లి. ఓవర్సీస్‌లో నాని లాంటి హీరోలు సైతం సలువుగానే మిలియన్ మార్క్ టచ్ చేస్తున్నారు. చెర్రీ మిలియన్ మార్క్ కాదు కదా…ఇప్పటి వరకు మనోడికి అక్కడ […]
ప్లాప్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ – బన్నీ మల్టీస్టారర్
మల్టిస్టారర్ సినిమాలకు టాలీవుడ్‌లో ఇప్పుడు క్రేజ్ చాలా పెరిగిపోయింది. టాలీవుడ్‌లో గతంలో ఈ సినిమాలకు ఎంతో క్రేజ్ ఉండేది. సీనియర్ హీరోలు ఎన్టీఆర్ – ఏఎన్నార్ – కృష్ణ – శోభన్‌బాబు – కృష్ణంరాజు వీరందరూ మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు. అయితే ప్రస్తుతం జనరేషన్‌లో మల్టీస్టారర్ సినిమాల్లో నటించేందుకు స్టార్ హీరోలు అంగీకరించడం లేదు. అయితే ప్రస్తుత జనరేషన్‌లో ఉన్న హీరోలు ఇలాంటి సినిమాలు తీస్తే వాటికి ఉండే క్రేజే వేరు. అందుకే అలాంటి సినిమాలు తీసేందుకు […]
మాజీ సీఎం కొడుకు సినిమా అప్పుల కుప్పలు
మాజీ ప్రధానమంత్రి దేవగౌడ మనవడు, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమార్ గౌడ డెబ్యూ మూవీ జాగ్వార్ విడుదలకు ముందు ఎక్కడ చూసినా ఆ సినిమా ముచ్చట్లే. కుమరస్వామి అయితే మాజీ సీఎం కావడంతో తన కొడుకును టాలీవుడ్‌లో కూడా గ్రాండ్‌గా ప్రమోట్ చేసుకునేందుకు తెలుగులో సైతం భారీగానే ఈవెంట్లు నిర్వహించి, ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు. జాగ్వార్ ఆడియో కూడా తెలుగులో అతిరధ మహారథుల సమక్షంలో నిర్వహించారు. అందుకోసం హైదరాబాద్‌లోనే ఆయన ప్రత్యేకంగా కొన్ని […]
టాలీవుడ్‌లో నల్లధనం వైట్ అవుతోంది ఇలా
ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం బడాబాబుల గుండెళ్లో రైళ్లు పరిగెట్టిస్తోన్నా చాలా మంది సామాన్యులు మాత్రం ఈ నిర్ణయంతో అష్టకష్టాలు పడుతున్నాడు. గత వారం పది రోజులుగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనాలు కిలోమీటర్ల కొద్ది క్యూలో నుంచోవాల్సిన పరిస్థితి వచ్చింది. సామాన్యుల పరిస్థితి ఇలా ఉంటే కోట్లకు పడగలెత్తిన బడాబాబులు మాత్రం తమ వద్ద ఉన్న నల్లధనాన్ని ఎలా మార్చుకోవాలా అని నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే […]
తలసాని టాలీవుడ్‌పై ” పవర్ ” చూపించాడా..!
అధికారంలో ఉన్న వారు.. ముఖ్యంగా మంత్రులుగా ఉన్న వారు ఎప్పుడు అవకాశం వచ్చినా తమ పవర్ చూపించేందుకు ముందే ఉంటారు! ఇక, వారి ఇళ్లల్లో ఏదైనా వేడుకలు జరిగితే.. ఆ టైంలో చూపించే పవరే వేరు! ఇప్పుడు తాజాగా తెలంగాణ సినిమా టోగ్రఫీ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస యాదవ్ తన పవర్ ఏంటో చూపించారనే టాక్ వినిపిస్తోంది. ఆ పవర్ ఏ రేంజ్‌లో ఉందంటే.. కనీసం పిట్టకు కూడా చిక్కని టాలీవుడ్ స్టార్లంతా.. క్యూ కట్టుకుని […]
ఆ మంత్రికి ప్రజల కంటే కొడుకు హీరో అవ్వడమే ముఖ్యమా..!
ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై పెద్ద ఎత్తున విమర్శలు ఊపందుకున్నాయి. ఆ మంత్రిగారు తన సొంత లాభం కొంత కూడా మానుకోవడం లేదని, ప్రజల ప్రయోజనాల కన్నా.. తన సొంత ప్రయోజనాలకే ఆయన పెద్ద పీట వేస్తున్నారట! ప్రస్తుతం దీనిపై అందరూ చర్చించు కుంటున్నారు. మరి అదేంటో చూద్దాం.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అనేక పరిశ్రమలు వెలిశాయి. ఇదే క్రమంలో ఉమ్మడిగా ఉన్న టాలీవుడ్ కూడా ఏపీలో విస్తరిస్తుందని అందరూ భావించారు. ఇదే క్రమంలో చంద్రబాబు […]
వైకాపాలో సినీ గ్లామర్ పెరుగుతోందా..
ఏపీ ఏకైక విపక్షం వైకాపాలో సినీ గ్లామర్ పెరుగుతోంది. మాజీ హీరోయిన్ రాశి త్వరలోనే జగన్ గూటికి చేరేందుకు అన్ని ప్రయత్నాలూ పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇక, ముహూర్తమే తరువాయి అన్నట్టు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి చంద్రబాబు పార్టీ టీడీపీతో పోల్చుకుంటే వైకాపాకి సినీ గ్లామర్ చాలా తక్కువ. ఒక్క రోజా తప్ప ఆపార్టీలో సినీ గ్లామర్ ఉన్న వాళ్లు లేరు. గతంలో ఎప్పుడో జీవిత, రాజశేఖర్ జగన్ పంచన ఉన్నా. అది ముగిసిన ముచ్చట. ఇప్పటికైతే.. రోజా […]
అమలాపాల్ అటు నుంచి ఇటు.
అమలాపాల్ విడాకుల విషయమై ఈ మధ్య చాలా రకాల వార్తలు మీడియాలో హల్ చల్ చేశాయి. మొత్తానికి ఈ గొడవంతా ఎలాగో సర్దుమణిగిందిలే. ఇకపై అమలాపాల్ తమిళంలో వరుస అవకాశాలతో బిజీ అయిపోతుంది అనుకుంటే ఇంతలో ఆమెకు అక్కడ చుక్కెదురైంది. తమిళంలో కొత్త అవకాశాల సంగతి ఏమో గానీ, వచ్చిన అవకాశాలే దూరం అయిపోతున్నాయని సమాచారమ్. దాంతో ఆమె దృష్టి తెలుగు ఇండస్ట్రీ మీద పడింది. అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితురాలే. గతంలో అల్లు అర్జున్‌తో […]