ఇరు రాష్ట్రాల చంద్రుల‌కు హ్యాప్పీ న్యూస్

జంప్ జిలానీల‌కు సీట్లు ఎలా స‌ర్దుబాటు చేయాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్న తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు కేంద్రం బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను పెంచితే ఎమ్మెల్యే సీటు గ్యారెంటీ హామీతో ఇప్ప‌టికే ఇరు రాష్ట్రాల్లోని అధికార పార్టీల్లో ప్ర‌తిప‌క్ష పార్టీల్లోని ఎమ్మెల్యేలు చేరిపోయారు. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు పెర‌గ‌క‌పోతే ఇక రెండు రాష్ట్రాల్లో క‌ల‌క‌లం రేగ‌డం ఖాయం! అయితే ఇప్పుడ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పెంపున‌కు కేంద్రం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందుకు సంబంధించి మొత్తం స‌మాచారాన్ని పంపాల‌ని ఇరు రాష్ట్రాల‌కు […]

తెలంగాణ కాంగ్రెస్‌ని బ‌తికించిన తాండూర్!

తెలంగాణ‌లో తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి రంగారెడ్డి జిల్లా తాండూర్ జీవం పోసింది! కాంగ్రెస్ నేత‌ల్లో వాడిపోయిన ఆశ‌ల‌ను చిగురించేలా చేసింది. మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో తాండూరులో కాంగ్రెస్ జైత్ర‌యాత్ర కొన‌సాగించింది. ఇది ఒక ర‌కంగా కాంగ్రెస్‌కి ఊపురులూదితే.. అధికార టీఆర్ ఎస్‌లో మాత్రం నైరాశ్యం నింపింది. తాజా ప‌రిణామాల‌తో కాంగ్రెస్ నేత‌లు మాంచి జోష్ మీదున్నారు. 2014 ఎన్నిక‌ల్లో.. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ఘోరంగా సీట్లు కోల్పోయింది. చివ‌ర‌కి బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన కార్తీక్ […]

కోదండరాం దెబ్బకి తెలంగాణ కాంగ్రెస్ లో చీలిక

తెలంగాణ‌లో ప‌రిచ‌యం అక్క‌ర‌లేని నేత ప్రోఫెస‌ర్ కోదండ‌రాం. తెలంగాణ ఉద్య‌మం నేప‌థ్యంలో మేధావులను క‌ద‌లించిన కంఠం ఆయ‌న‌ది. అయితే, రాష్ట్ర సాధ‌న అనంతరం ఆయ‌న రాజ‌కీయాల్లోకి వెళ్ల‌కుండా ప్ర‌జ‌ల ప‌క్షానే ప‌రిమితం అయ్యారు. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, ఉదాశీన‌త‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. కేసీఆర్‌ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి నేత అవ‌స‌రం కాంగ్రెస్‌కి వ‌చ్చింద‌ట‌. ప్ర‌స్తుతం నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ కాంగ్రెస్‌కి ఓ బ‌ల‌మైన నేత అవ‌స‌రం అన్న‌ది ముమ్మాటికీ నిజం. ఈ […]

అందరి లెక్క స‌రిజేస్తున్న కేసీఆర్‌

త‌న వ్యూహాల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తుచేస్తూ బ‌ల‌మైన నాయ‌కుడిగా ఎదుగుతున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇప్పుడు అంద‌రి లెక్క‌లు స‌రిచేస్తున్నారు. ముఖ్యంగా రెండేళ్ల‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో… టీఆర్ఎస్‌ను తిరుగులేని శ‌క్తిగా.. మార్చ‌డంతోపాటు.. అన్ని వ‌ర్గాల‌ను పార్టీ వైపే ఉండేలా చేసేలా వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ దిశ‌గా చ‌ర్య‌లు ప్రారంభించారు. కేసీఆర్ క్యాస్ట్ ఈక్వెష‌న్స్ గురించి తెలిసిన వారు `ఔరా` అన‌క మాన‌రంటే అతిశ‌యోక్తి కాదేమో!! క‌మ్మ‌, రెడ్డి, బీసీ, బ్రాహ్మ‌ణ‌, ఎస్సీ ఎస్టీ, మైనారిటీ ఇలా […]

ఒక్క ఎత్తుతో ప్ర‌జల‌ను మార్చేసిన కేసీఆర్‌…అవాక్క‌య్యే ప్లాన్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తెలిసినంత‌గా రాజ‌కీయ ఎత్తులు, జిమ్మిక్క‌లు ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దంటే.. పెద్దగా ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌నిలేదు. తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన శైలే దీనికి నిద‌ర్శ‌నం. అప్ప‌ట్లో రాష్ట్ర సాధ‌నే ల‌క్ష్యంగా అనేక హామీలు గుప్పించారు. తెలంగాణ సాధిస్తే.. ఎస్పీల‌నే సీఎంని చేస్తాన‌ని, అవ‌స‌ర‌మైతే కాంగ్రెస్ తో చెలిమి చేస్తానని, పార్టీని కూడా విలీనం చేస్తాన‌ని చెప్పుకొచ్చారు. ఎలాగోలా ఏరు దాటేశారు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో చెప్పాల్సిన ప‌నిలేదు. సీన్ క‌ట్ […]

మిత్ర‌పక్షాన్ని దూరం చేసుకుంటున్న టీఆర్ఎస్‌

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌, మ‌జ్లిస్‌ల బంధం లోపాయికారీగానే కొన‌సాగుతూనే ఉంది. టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసినా.. అవి వారి మిత్ర బంధాన్ని చెడగొట్టే స్థాయిలో ఉండ‌వు! అయితే ప్ర‌స్తుతం ఈ రెండు పార్టీల మ‌ధ్య విబేధాలు భగ్గుమ‌న్నాయి. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఎన్నిక రెండు పక్షాల మధ్య విబేధాలకు దారితీసిందట‌. అధికార టీఆర్ఎస్‌ నిర్వ‌హించిన స‌మావేశానికి ఎంఐఎం త‌ర‌ఫున ఏ ఒక్క‌రూ హాజ‌రు కాక‌పోవ‌డం దీనికి బ‌లాన్ని చేకూరుస్తోంది. దీంతో ఇన్నేళ్ల మిత్రబంధానికి శుభం కార్డు ప‌డ‌వ‌చ్చనే […]

ఎమ్మెల్యే ఎంపీ మధ్య పవర్ పోరు

జిల్లాల పున‌ర్విభ‌జ‌న ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు స‌రికొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఒక‌రికి ప‌ట్టున్న ప్రాంతం మ‌రో జిల్లాలోకి వెళిపోవ‌డంతో ఇప్పుడు నేత‌లు `ప‌వ‌ర్‌` లేక విల‌విల్లాడుతున్నారు. ఆ ప్రాంతం వేరొక‌రి చేతుల్లోకి వెళ్లిపోయినా.. ఆ ప్రాంతంలో ప‌ట్టుకోసం త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి టీఆర్ఎస్ ఎంపీ విశ్వేశ్వ‌ర్ రెడ్డి, మంత్రి మ‌హేందర్ రెడ్డికి మ‌ధ్య గ్యాప్ సృష్టిస్తోంది. ప్రస్తుతం వీరిద్ద‌రి మ‌ధ్య రంగారెడ్డి జిల్లాలో ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. దీంతో ఎవ‌రిని అదుపు చేయాలో తెలియ‌క టీఆర్ఎస్ అధినేత […]

మాస్టారి విష‌యంలో కేసీఆర్ అట్ట‌ర్‌ ప్లాప్

తెలంగాణ‌లో త‌న‌కు ఎదురు నిలిచే నాయ‌కుడే లేకుండా చేసుకున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను.. ఒక ప్రొఫెస‌ర్‌ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు! త‌న వ్యూహాల‌తో ప్ర‌తిప‌క్షాల‌కు చిత్తు చేసిన గులాబీ ద‌ళ‌ప‌తి పాచిక‌లు.. ఆయ‌న ముందు మాత్రం క‌ద‌లడం లేదు!! ఎంతో ఉద్ధండుల‌ను సామ‌దాన బేధ దండోపాయాల‌తో త‌న అక్కున చేర్చుకున్న తెలంగాణ చంద్రుడి వ్యూహాలు.. కోదండాస్త్రం ముందు బెడిసికొడుత‌న్నాయి. కేసీఆర్‌ను ఇప్పుడు ఇంతలా ఇబ్బంది పెడుతున్న వ్య‌క్తి మ‌రెవ‌రో కాదు.. టీజేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం!! ఎంతో మంది నాయ‌కుల‌ను […]

ఆదుకొని బీజేపీ అప్పో రామ‌చంద్రా.. అంటున్న ఏపీ

అప్పు.. పొద్దున్న లేచింది మొద‌లు.. నిద్ర‌పోయే వ‌రకూ ఏపీ యంత్రాంగం అంతా ప‌టిస్తున్న మంత్రం!! అప్పో రామ‌చంద్రా అంటూ.. మొక్కులు మొక్కేస్తున్నారు! ఈ అప్పుల క‌ష్టాల నుంచి త‌ర్వ‌గా గ‌ట్టెక్కించు దేవుడా అంటూ ప్రార్థిస్తున్నారు! అవును.. విభ‌జ‌న నుంచి కోలుకోలేని ఏపీ.. ఇప్పుడు అప్పుల ఊబిలో క్ర‌మ‌క్ర‌మంగా కూరుకుపోతోంది. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు బీజేపీ ముందుకు రాక‌పోవ‌డం.. అటు ప‌రిశ్ర‌మ‌లు కూడా హామీల‌కే ప‌రిమితమ‌వ‌డంతో ఆర్బీఐ ముందు రుణాల కోసం చేతులు చాచాల్సి వ‌స్తోంది. ఆదాయం కంటే వ్యయం […]