తన వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ.. ఎప్పటికప్పుడు సరికొత్త వ్యక్తిని చూపిస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్! భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలకు అడ్డంకులు కలగకుండా ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. అంత అడ్వాన్స్‌గా పరిణామాలను ఊహిస్తారు కనుక ప్రత్యర్థులకు అందకుండా ఎదిగిపోయారు. ఇప్పుడు ఆయన పరిపూర్ణానంద స్వామిని అకస్మాత్తుగా కలవడం అందరినీ విస్తుగొలుపుతోంది! సాధారణంగానే ఆధ్యాత్మిక భావం ఎక్కువగా ఉన్న కేసీఆర్ స్వయంగా పరిపూర్ణానందను కలవడం వెనుక రాజకీయ కోణం కూడా ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం! ఇటీవలే.. దూకుడు పెంచిన […]
Tag: Telangana
సమంత ఎమ్మెల్యే టిక్కెట్టుకు…. ఆ నియోజకవర్గం కన్‌ఫార్మ్..!
చెన్నై చిన్నది, అక్కినేని ఫ్యామిలీ కాబోయే కోడలు టీఆర్ఎస్‌లో చేరుతుందన్న వార్తలు గత కొద్ది రోజులుగా అడపా దడపా వస్తూనే ఉన్నాయి. సమంత ఎప్పుడైతే తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైందో అప్పటి నుంచి ఈ వార్తలు జోరుగానే వస్తున్నాయి. అయితే ఇప్పుడు దీనికి కొనసాగింపుగా మరో వార్త బయటకు వచ్చింది. 2019 ఎన్నికల బరిలో సమంత టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందట. 2019 ఎన్నికల్లో సమంతను తమ పార్టీ తరపున ఎమ్మెల్యే రేసులో ఉంచడానికి […]
టీఆర్ఎస్ ఓటమి ఇంటి దొంగల పనేనా?
వరుస విజయాలతో దూసుకుపోతున్న టీఆర్ఎస్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. అది కూడా పార్టీకి బాగా పట్టున్న ఉత్తర తెలంగాణలో ఓటమి చవిచూసింది. ఇక తమకు ఎదురు లేదనుకున్న గులాబీ దండుకు షాక్ తగిలింది. ఇప్పటివరకూ గెలుపు గర్వంతో పైకెగిరిసిన టీఆర్ఎస్ నేతలు.. ఒక్కసారిగా పాతాళానికి పడిపోయారు. ఊహించని ఈ పరిణామంతో ఒక్కసారిగా టీఆర్ఎస్‌లో గుబులు మొదలైంది. వెంటనే పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది. పోస్టుమార్టం చర్యలు ప్రారంభించింది. ఉత్తర తెలంగాణలో అంతా టీఆర్ఎస్ మయం! వరంగల్ నుంచి […]
టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ” మంత్రి ” చిచ్చు
టీఆర్ఎస్ పార్టీలోని విభేదాలు సీఎం కేసీఆర్‌కు తలనొప్పిగా మారుతున్నాయి. మంత్రి పదవి విషయంలో తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వివాదం రాజుకుంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకునే వరకూ వెళ్లింది. సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకునే స్థాయికి చేరుకుంది. చాలెంజ్‌లు చేసుకున్నారు కూడా! మీడియా ముఖంగా ఉదయం.. తీవ్రంగా విమర్శలు చేసుకున్న వారే.. సాయంత్రం ఇద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకున్నారు. తమ మధ్య విభేదాలు లేవంటూనే మరోసారి విమర్శించుకున్నారు. దీంతో ఆశ్చర్య పోవడం టీఆర్ఎస్ నాయకులు, […]
టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం..!
యూపీ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆపరషన్ తెలంగాణ మీదే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వచ్చే 2019 ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడం లేదా ప్రధాన ప్రతిపక్షంగా టీఆర్ఎస్‌కు ధీటుగా ఉండేలా అమిత్ ప్లాన్లు వేస్తున్నారట. తెలంగాణలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. 2019 ఎన్నికల నాటికి బీజేపీ ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణలో అధికారంలోకి రావడంతో పాటు అక్కడ నుంచి వీలున్నన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవడం. […]
రుణ`మాఫీ`తో ఇద్దరు చంద్రులకు చెక్
తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడానికి బీజేపీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో భారీ విజయం సాధించిన తర్వాత.. ఆ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం రైతులకు `రుణమాఫీ` చేస్తుందని, ఆభారం కేంద్రమే భరిస్తుందని చేసిన కేంద్రమంత్రి పకటనతో.. ఇప్పుడు ఇద్దరు చంద్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 2014 ఎన్నికల్లో రుణమాఫీ నే ప్రచారంగా చేసుకుని అటు చంద్రబాబు, ఇటు కేసీఆర్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పుడు అదే అస్త్రాన్ని 2019 ఎన్నికల్లో ఉపయోగించే దిశగా కేంద్రం అడుగులేస్తోంది. […]
2019 వార్: ఏపీ-తెలంగాణలో రాజకీయాలను శాసిస్తున్న కులాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడి అప్పుడే మూడేళ్లు గడిచిపోయింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి మధ్యలో జరిగే చిన్నా చితకా ఎలక్షన్లతో పాటు 2019 ఎన్నికలపైనే ఉంది. 2019లో ఏపీ, తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది ? ఏ పార్టీల మధ్య ప్రధానంగా పోరు ఉంటుంది ? అసలు ఎవరి బలం ఎంత? ఎవరి బలగం ఎంత? ఒంటరిగా బరిలో నిలిచి ఒకే పార్టీ అధికారం దక్కించుకునే అవకాశం ఉందా ? ఇలా ఎన్నో ప్రశ్నలు […]
తెలంగాణలో జనసేన టైం స్టార్ట్ అయ్యిందా!
సినీనటుడు పవన్‌కళ్యాణ్ జనసేన పార్టీ ఇటీవలే మూడో వార్షికోత్సవం జరుపుకుంది. ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ గత ఎన్నికల్లో టీడీపీ+బీజేపీ కూటమికి తన మద్దతు ప్రకటించాడు. ఆ తర్వాత పవన్ ఈ రెండు పార్టీలను ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు వివిధ అంశాలపై నిలదీస్తూ జనసేన స్వతంత్య్రతను చాటుతున్నాడు. ఈ క్రమంలోనే పార్టీ పెట్టి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా పవన్ పలు కీలక అంశాలపై క్లారిటీ ఇచ్చేశాడు. 2019 ఎన్నికల్లో జనసేన రెండు రాష్ట్రాల్లో […]
కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ ఝలక్
తనపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు బడ్జెట్ రూపంలో సమాధానమిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్! తన వ్యూహాలకు తిరుగులేదని, తనతో పెట్టుకుంటే ఎవరైనా చిత్తు కావాల్సిందేనని మరోసారి రుజువుచేశారు. అంతేగాక కాంగ్రెస్‌ను మళ్లీ మాట్లాడకుండా చేశారు. దీంతో ఆ పార్టీ నేతలు సందిగ్ధ స్థితిలో పడిపోయారు! ఇప్పటికే అన్ని వర్గాలపై పట్టు సాధించిన కేసీఆర్.. ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీలకే పెద్ద పీటే వేశారు. దీంతో ఇప్పటివరకూ బీసీలకు అన్యాయం జరుగుతోందని విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలకు.. చెక్ చెప్పారు. […]