ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లొస్తే ఏపీ, తెలంగాణ‌లో గెలుపెవ‌రిది…

ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉండ‌గానే.. ఇప్ప‌టినుంచే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంది. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ఇటు టీడీపీ, అటు టీఆర్ఎస్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టేశాయి. కొత్త‌గా రాజ‌కీయ తెర‌పై భ‌విత‌వ్యాన్ని ప‌రీక్షించుకోవాల‌ని నిర్ణ‌యించిన జ‌న‌సేన.. ఈసారి ఎన్నిక‌ల్లో ఎలాంటి ప్ర‌భావం చూపుతుంది? సీఎం కావాల‌నుకునే ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఆశ‌లు ఈసారి నెర‌వేర‌తాయా? అటు టీఆర్ఎస్‌లో మ‌ళ్లీ బ‌లం పుంజుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న కాంగ్రెస్ ఆశ‌లు ఎంత‌వ‌ర‌కూ ఫ‌లిస్తాయి? అనే ప్ర‌శ్న‌లు అందరిలోనూ ఉన్నాయి. అయితే ఇప్ప‌టికిప్పుడు […]

టీఆర్ఎస్ మంత్రిలో అస‌మ్మ‌తి మొద‌లైందా?

ఎవ‌రిని ఎలా ఉప‌యోగించుకోవాలో.. ఎవ‌రిని ఎప్పుడు ఎలా చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసు! ఉప‌యోగించుకున్నంత సేపు వారిని త‌ల‌మీద పెట్టుకుంటారు! త‌ర్వాత వారి వైపు కన్నెత్తి చూడ‌రు! అస‌లు ప‌ట్టించుకోరు! ప్రస్తుతం ఒక మంత్రిని కూడా ఇలా ప‌క్క‌న‌పెట్టేశారు. కీల‌క మంత్రిత్వ‌ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నా.. ఆయ‌న శాఖ‌లోని వ్య‌వ‌హారాల‌న్నీ కేసీఆర్ స్వ‌యంగా ప‌రిశీలిస్తుండ‌టంతో మంత్రి ఇబ్బందులు ప‌డుతున్నార‌ట‌. తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్న ఆ మంత్రి.. కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్రారంభించిన డ‌బుల్ బెడ్‌రూమ్ […]

కేసీఆర్ కంచుకోట‌లో రాహుల్ పోటీ..!

తెలంగాణ‌లో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాలు చూస్తుంటే అధికార టీఆర్ఎస్‌ను ఢీకొట్ట‌డం అక్క‌డి రాజ‌కీయ ప‌క్షాల వ‌ల్ల అయ్యేలా లేదు. బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, వైసీపీ చేతులెత్తేయ‌గా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ ముగ్గురు నాయ‌కులు, ఆరు గ్రూపుల‌తో విల‌విల్లాడుతోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితి కంటిన్యూ అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు క‌నీసం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా అయినా ద‌క్కుతుందా ? అన్న సందేహాలే అంద‌రికి క‌లుగుతున్నాయి. ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు సూప‌ర్ బూస్ట‌ప్ ఇచ్చే […]

మీడియాకి కేటీఆర్ పాఠాలు.. నిజాలు చెప్పినందుకే!

తెలంగాణ మంత్రి కేటీఆర్ కొన్నిమీడియా సంస్థ‌ల‌పై నిప్పులు చెరుగుతున్నారు. పెయిడ్ ఆర్టిక‌ల్స్ రాస్తున్నాయ‌ని తెగ ఫీలైపోతున్నారు. అంతేకాదు, ప‌త్రికా స్వేచ్ఛ అంటే ఏమిటో ఇప్పుడు గంట‌ల త‌ర‌బ‌డి క్లాస్ పీకుతున్నారు. గ‌తంలో టీఆర్ ఎస్‌కు అనుకూలంగా రాయ‌ని ప‌త్రిక‌లు ప‌త్రిక‌లే కావ‌ని, ప్ర‌సారం చేయ‌ని మీడియా మీడియానే కాద‌ని గులాబీ ద‌ళం తీర్మానించేసింది. అప్ప‌ట్లో టీఆర్ ఎస్‌ని, కేసీఆర్‌ని పొడుగుతూ ప‌త్రిక‌లు రాసిన క‌థ‌నాలు, వెలువ‌రించిన వార్త‌లు పెయిడ్ న్యూస్‌గా క‌నిపించ‌ని కేటీఆర్‌కి.. ఇప్పుడు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా […]

రేవంత్ స్టాండ్ మార్చుకున్నాడా?

తెలంగాణ టీడీపీ నేత‌ల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి రూటు మారుతోందా? పొలిటిక‌ల్‌గా ఆయ‌న స్టాండ్ ఏమిటి? వంటి ప‌లు అనుమానాలు ఇప్పుడు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనికి కార‌ణం ఇటీవ‌ల ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరే! టీఆర్ ఎస్‌పై రేవంత్ ఎలా రెచ్చిపోతాడో అంద‌రికీ తెలిసిందే. అంతేకాదు, ఆట మొద‌లైంది అంటూ.. అప్ప‌ట్లో ఓటుకు నోటు కేసులో జైలు నుంచి వ‌చ్చాక చేసిన స‌వాలు కూడా అంద‌రికీ గుర్తింది. అయితే, అనూహ్యంగా ఆయ‌న తీరు మారిపోయింది. ఒక్క‌సారిగా […]

దిక్కుతోచని పరిస్థిలో టీఆరెస్ ఎమ్మెల్యే

తెలంగాణ సీఎం కేసీఆర్ దెబ్బ‌తో అధికార టీఆర్ఎస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యేకు జ్వ‌రం ప‌ట్టుకుంద‌ట‌. వచ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ త‌న‌కు టిక్కెట్ ఇవ్వన‌న్న ఫ్రీల‌ర్లు వ‌ద‌ల‌డంతో ఇప్పుడు స‌ద‌రు ఎమ్మెల్యే త‌న బాధ ఎవ‌రికి చెప్పుకోవాలో అర్థంకాక మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నార‌ట‌. ఇక తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌కు చెందిన చాలా మంది ఎంపీలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాల‌ని అనుకుంటున్నారు. ఈ జాబితా చాలానే ఉంది. ఈ జాబితాలోకి కొత్త‌గా వ‌చ్చి చేరారు మెద‌క్ ఎంపీ కొత్త […]

టీఆర్ఎస్ కీల‌క నేత‌ల మౌనం.. అస‌లేం ఏం జ‌రిగింది? 

తెల్లారింది మొద‌లు పొద్దు గూకే వ‌ర‌కు మీడియా మైకుల ముందు మాట‌ల ప్ర‌వాహంతో విప‌క్షాల‌ను దంచికొట్టే.. టీఆర్ ఎస్ నేత‌లు ఇప్పుడు ఒక్క‌సారిగా మౌనం పాటించేస్తున్నారు! ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ క‌విత‌, మంత్రి హ‌రీష్‌రావు, నాయిని త‌దిత‌ర ప్ర‌ధాన పోస్టుల్లో ఉన్న నేత‌లు సైతం ఇప్పుడు మీడియాకు ముఖం చాటేస్తున్నారు. మ‌రో రెండేళ్ల‌లో కీల‌క‌మైన ఎన్నిక‌లు రాబోతున్న త‌రుణంలో నేత‌లు ఇలా గ‌ప్‌చుప్ అయిపోవ‌డం.. ఇప్పుడు రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. విష‌యంలోకి వెళ్తే.. ఇటీవ‌ల కాలంలో విప‌క్షాల […]

టీ-టీడీపీకి టైమ్ ఇవ్వని లోకేశ్

వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ తెలంగాణ‌లో మ‌న పార్టీ అధికారంలోకి వ‌చ్చి తీరుతుంది.. త‌మ్ముళ్లూ.. ! అంటూ భ‌రోసా నింపిన టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఇటీవ‌ల కాలంలో తెలంగాణ టీడీపీ నేత‌ల ముఖం చూడ‌లేదు. ఒక ర‌కంగా టీడీపీ అధినేత ఏపీ అభివృద్ధి, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు వంటి వాటిలో తీరుబ‌డి లేకుండా ఉన్న నేప‌థ్యంలో తెలంగాణ‌లో టీడీపీని న‌డిపించే బాధ్య‌త‌ను లోకేశ్ భుజాన వేసుకున్నారు. తెలంగాణ నేత‌ల‌తో వారాల త‌ర‌బ‌డి చ‌ర్చించి.. […]

తెలంగాణలో కొత్త పార్టీతో ప‌వ‌న్ పొత్తు..!

ఏపీ, తెలంగాణ‌లో 2019 ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అవుతోన్న జ‌న‌సేన ఏ రాష్ట్రంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది ? అన్న‌ది ఆస‌క్తిగా ఉంది. ఏపీలో జ‌న‌సేన‌కు ఇప్ప‌టి నుంచే క్రేజ్ క‌న‌ప‌డుతోంది. ఆ పార్టీతో పొత్తుకు రెడీ అని ఇప్ప‌టికే క‌మ్యూనిస్టులు ప్ర‌క‌టించారు. ఇక వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ సైతం జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటే వ‌చ్చే లాభాల‌ను జ‌గ‌న్‌కు చెప్పిన‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఇదిలా ఉంటే తెలంగాణలోనూ జనసేన పార్టీ పోటీ చేయాలని […]