తెలుగుదేశం పార్టీకి ఉన్న కంచుకోటల్లో నిడదవోలు నియోజకవర్గం కూడా ఒకటి…ఇక్కడ టీడీపీకి మంచి బలం ఉంది..కానీ ఆ బలాన్ని టీడీపీ నేతలే తగ్గిస్తున్నారు అని చెప్పవచ్చు. ఇక్కడ వరుసగా మంచి విజయాలు సాధించిన పార్టీ..2019 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలైంది. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచిన బూరుగుపల్లి శేషారావు..2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక ఈయన మళ్ళీ పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేయలేదు. పైగా ఇంకా తాను పోటీ చేయలేనని మధ్యలో స్టేట్‌మెంట్ ఇచ్చారు. […]
Tag: TDP
వెస్ట్‌లో బాబు సత్తా..టీడీపీకి కలిసోచ్చేనా!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే టీడీపీ కంచుకోట అనే సంగతి తెలిసిందే..ఇక్కడ పార్టీకి గట్టి బలం ఉంది. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు ఉన్నారు..అయితే గత ఎన్నికల్లో నాయకులు వ్యతిరేకత తెచ్చుకోవడం వల్ల టీడీపీకి దెబ్బ పడింది. కానీ నిదానంగా వెస్ట్ లో సీన్ మారుతూ వస్తుంది. వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంటే..టీడీపీ బలపడుతుంది. ఇక టీడీపీ బలం పెరుగుతుందనే దానికి ఉదాహరణ..తాజాగా చంద్రబాబు పర్యటనకు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టడమే. ఈ మధ్య కాలంలో బాబుకు జనం […]
మదనపల్లెలో టీడీపీకి ఛాన్స్ ఇవ్వని వైసీపీ..!
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీకి ఆధిక్యం వచ్చేలా కనిపించడం లేదు. ఇంకా నాయకులు సరిగ్గా కష్టపడకపోవడం…వైసీపీ ఎత్తులతో టీడీపీ వెనుకబడిపోతుంది. గత ఎన్నికల్లోనే జిల్లాలో 14 సీట్లకు వైసీపీ 13 గెలిచేసుకుంది..కేవలం కుప్పం సీటు టీడీపీ గెలిచింది. అయితే ఈ సారి కుప్పం సీటుని కూడా గెలుచుకుంటామని వైసీపీ చెబుతోంది. వైసీపీ చెప్పినట్లుగా అదే జరిగే పని కాదు. ఈ సారి వైసీపీకి సీన్ రివర్స్ అయ్యే చాన్స్ ఉంది. అలా అని వైసీపీ ఆధిక్యం […]
గోపాలపురం మద్దిపాటికే..ముప్పిడికి వేరే ఛాన్స్.!
మొత్తానికి గోపాలపురం నియోజకవర్గం టీడీపీలో ఉన్న కన్ఫ్యూజన్‌ని చంద్రబాబు క్లియర్ చేసేశారు. ఇక్కడ అసలు అభ్యర్ధి ఎవరు అనే అంశంపై క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా వెస్ట్ గోదావరి టూర్‌లో ఉన్న బాబు..గోపాలపురం నియోజకవర్గంలోని దొండపూడి గ్రామానికి వచ్చారు. ఇక నియోజకవర్గం రాక సందర్భంగా భారీగా టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. బాబుకు ఘనస్వాగతం పలికారు. అలాగే బాబుతో పాటు ఓ వైపు మద్దిపాటి వెంకటరాజు, మరోవైపు మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఇక ఇప్పటికే ముప్పిడిని తప్పించి […]
బాబు రాకతో..ఆ నియోజకవర్గాల్లో దశ మారేనా!
మొత్తానికి చంద్రబాబుకు ఆదరణ పెరిగినట్లు కనిపిస్తోంది…కొంతకాలం నుంచి బాబు పర్యటనలకు జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆయన 40 ఏళ్ల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నారు..ఆయన గురించి అందరికీ తెలుసు. కానీ ఆయన జిల్లాలకు వస్తుంటే మళ్ళీ ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో బాబు పర్యటనలకు జనం నుంచి మంచి స్పందన వస్తుంది. సాధారణంగానే అధినేత వస్తున్నారంటే నేతలు తమ పార్టీ శ్రేణులని తరలిస్తారు. అయితే పార్టీ శ్రేణులే కాదు..అక్కడ ఉన్న […]
కందుకూరులో ‘కమ్మ’ని పోరు..సైకిల్‌కు డ్యామేజ్ తగ్గదా..!
తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ పార్టీ అని, ఆ పార్టీలో కమ్మ వర్గమే ఉంటుందని, కమ్మలంతా టీడీపీ వారే అని విమర్శలు వైసీపీ ఎక్కువ చేస్తూ ఉంటుంది. అయితే వైసీపీలో రెడ్డి వర్గం గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ విషయం పక్కన పెడితే..కమ్మలంతా టీడీపీనే అనేది కరెక్ట్ కాదనే వాదన వస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో సగం కమ్మ వర్గం జగన్‌కే మద్ధతు ఇచ్చింది. కమ్మ వర్గం ప్రభావం ఉన్న స్థానాల్లో వైసీపీనే గెలిచింది. దీని […]
రావి మరో త్యాగానికి రెడీగా లేరా?
చంద్రబాబు, లోకేష్‌లని పచ్చి బూతులు తిట్టే కొడాలి నానికి చెక్ పెట్టాలని చెప్పి టీడీపీ శ్రేణులు కసిగా ఉన్నాయి. కానీ గుడివాడ నియోజకవర్గంలో మాత్రం టీడీపీలో కన్ఫ్యూజన్ ఉంది. అసలు ఆ సీటు చివరికి ఎవరికి దక్కుతుంది..ఎవరు పోటీ చేస్తే కొడాలికి చెక్ పెట్టగలరు అనే అంశాలపై క్లారిటీ లేదు. ప్రస్తుతానికి అక్కడ ఇంచార్జ్ గా ఉన్న రావి వెంకటేశ్వరావు కష్టపడుతున్నారు. మొదట్లో అంత యాక్టివ్ గా లేరు గాని ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్నారు..వైసీపీపై పోరాటాలు చేస్తున్నారు. […]
లైన్‌లోకి వచ్చిన బాబు..వెస్ట్‌లో టీడీపీ సత్తా..!
ఈ మధ్య చంద్రబాబు పర్యటనలకు జనం మద్ధతు బాగా వస్తుంది..మరి ఎవరైనా పార్టీ అధినేతలు వస్తే.. నేతలు జనాలని తరలించే పనిలో ఉంటారు. అటు జగన్‌కైనా, ఇటు బాబుకైనా..అయితే ఎంత జనాలని తరలించిన వారు ఎక్కువ గంటలు వెయిట్ చేయడం..స్పీచ్ అయ్యేవరకు ఉండటం కష్టమైన పని. ఈ మధ్య జగన్ సభల్లో జనం మధ్యలోనే వెళ్లిపోవడం చూస్తున్నారు. కానీ చంద్రబాబు రోడ్ షోల్లో పరిస్తితి భిన్నంగా ఉంది. పర్యటన ఆలస్యంగా నడిచిన సరే..బాబు కోసం టీడీపీ శ్రేణులు […]
బాబు వెస్ట్ టూర్..వైసీపీ ఫెయిల్ చేస్తుందా?
మరో సరికొత్త కార్యక్రమంతో చంద్రబాబు ప్రజల్లోకి వెళుతున్నారు. మొన్నటివరకు బాదుడేబాదుడు కార్యక్రమం పేరుతో ప్రజల్లో తిరిగిన టీడీపీ శ్రేణులు..ఇప్పుడు ‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ అనే పేరుతో ముందుకెళ్లనున్నారు. ప్రజా సమస్యలు, వైసీపీ ప్రభుత్వం వల్ల పడుతున్న ఇబ్బందులని..టీడీపీ నేతలు ఇంటింటికి వెళ్ళి వివరించనున్నారు. 50 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లాలోని కలపర్రు టోల్‌గేట్ మీదుగా పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో ప్రారంభం కానుంది. చంద్రబాబు ఈ […]