చంద్రబాబు, లోకేష్‌లని పచ్చి బూతులు తిట్టే కొడాలి నానికి చెక్ పెట్టాలని చెప్పి టీడీపీ శ్రేణులు కసిగా ఉన్నాయి. కానీ గుడివాడ నియోజకవర్గంలో మాత్రం టీడీపీలో కన్ఫ్యూజన్ ఉంది. అసలు ఆ సీటు చివరికి ఎవరికి దక్కుతుంది..ఎవరు పోటీ చేస్తే కొడాలికి చెక్ పెట్టగలరు అనే అంశాలపై క్లారిటీ లేదు. ప్రస్తుతానికి అక్కడ ఇంచార్జ్ గా ఉన్న రావి వెంకటేశ్వరావు కష్టపడుతున్నారు.
మొదట్లో అంత యాక్టివ్ గా లేరు గాని ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్నారు..వైసీపీపై పోరాటాలు చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. సరే అంతా బాగానే ఉంది కదా రావికి సీటు ఫిక్స్ చేసేయవచ్చు అనుకునేలోపు గుడివాడ సీటుపై క్లారిటీ లేకుండా పోతుంది. ఇప్పటికే అక్కడ కొందరు నేతలు సీటు కోసం ట్రై చేస్తున్నారు.
ఇదే క్రమంలో ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాము సైతం గుడివాడ సీటు కోసం ట్రై చేస్తున్నారని తెలిసింది. ఇప్పటికే ఆయన..బాబుని కలిసి సీటు అడిగినట్లు సమాచారం. ఇక ఆర్ధికంగా బలంగా ఉన్న రాము..ఎన్నికల్లో కొడాలిని ఓడించడానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీగా ఉన్నారట. ఇలా రాము పేరు తెరపైకి రావడంతో రావి మరోసారి సీటు త్యాగం చేయాలనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే రావి రెండుసార్లు సీటు త్యాగం చేశారు.
అసలు గుడివాడలో మొదట నుంచి టీడీపీ సీటు రావి ఫ్యామిలీదే. కానీ 2004లో కొడాలి నాని రావడం, ఆయనకు హరికృష్ణ సపోర్ట్ చేయడంతో చంద్రబాబు..రావిని పక్కన పెట్టి కొడాలికి సీటు ఇచ్చారు. ఇక కొడాలి ఏం చేస్తున్నారో అందరికీ తెలిసిందే. కొడాలి వైసీపీకి వెళ్ళడంతో బాబు మళ్ళీ రావిని తీసుకొచ్చి 2014లో సీటు ఇచ్చారు. అప్పుడు రావి ఓడిపోయారు. సరే అని ఐదేళ్లు ఆయన కష్టపడితే 2019లో రావిని సైడ్ చేసి దేవినేని అవినాష్‌కు సీటు ఇచ్చారు. ఓడిన అవినాష్ వైసీపీలోకి జంప్ చేశారు.
దీంతో మళ్ళీ రావి దిక్కు అయ్యారు. సరే అని పార్టీ కోసం మళ్ళీ కష్టపడుతున్నారు. ఈ తరుణంలో ఎన్‌ఆర్‌ఐకి సీటు అంటున్నారు. కానీ ఈ సారి మాత్రం సీటు తనదే అని…ఎవరు వచ్చిన గుడివాడని వదులుకునేది లేదని అంటున్నారు. చూడాలి మరి ఈ సారి గుడివాడ ఎవరికి దక్కుతుందో.