మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కెమెరా ముందుకొచ్చి చాలా కాలమే అయ్యింది. గత ఏడాది రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్.. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ మునుపటి జోరును చూపించలేకపోతున్నాడు. అయితే ఎట్టకేలకు మళ్లీ ఈయన షూటింగ్స్ లో బిజీ అయ్యేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగానే తన 15వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నాడు.
`SDT 15` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మితం అవుతున్న ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అంజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో సంయుక్త హీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.
అలాగే డిసెంబర్ 7న ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయాలని మేకర్స్ డేట్ ఫిక్స్ అయింది. అయితే ఇందుకోసం సాయి ధరమ్ తేజ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సాయం కోరాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ చేతుల మీదగా `SDT 15` ఫస్ట్ లుక్ టీజర్ బయటకు వస్తే.. ఈ సినిమా నందమూరి ఫ్యాన్స్‌కు సైతం బాగా రీచ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే సాయి ధరమ్ తేజ్ ఎన్టీఆర్‌ను సంప్రదించగా.. ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో సాయి ధరమ్ తేజ్‌పై మెగా ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. మెగా ఫ్యామిలీలో అంతమంది హీరోలు ఉండగా.. ఎన్టీఆర్ సాయం కోరడం అవసరమా అంటూ మండిపడుతున్నారు.