నిడదవోలులో టీడీపీకి ఊపు..కానీ నేతలే డౌట్..!

తెలుగుదేశం పార్టీకి ఉన్న కంచుకోటల్లో నిడదవోలు నియోజకవర్గం కూడా ఒకటి…ఇక్కడ టీడీపీకి మంచి బలం ఉంది..కానీ ఆ బలాన్ని టీడీపీ నేతలే తగ్గిస్తున్నారు అని చెప్పవచ్చు. ఇక్కడ వరుసగా మంచి విజయాలు సాధించిన పార్టీ..2019 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలైంది. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచిన బూరుగుపల్లి శేషారావు..2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక ఈయన మళ్ళీ పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేయలేదు. పైగా ఇంకా తాను పోటీ చేయలేనని మధ్యలో స్టేట్‌మెంట్ ఇచ్చారు.

దీంతో మధ్యలో నిడదవోలు సీటులో కొత్త నాయకులు వచ్చారు. ఈ సీటు దక్కించుకోవాలని చెప్పి పార్టీలో యాక్టివ్ గా పనిచేయడం మొదలుపెట్టారు. ఇది చూసిన శేషారావు మళ్ళీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. ముందు నుంచి ఈయన సరిగ్గా పనిచేసి ఉంటే..ఇంకో నాయకుడుకు అవకాశం దక్కేది కాదు..మధ్యలో గ్యాప్ ఇవ్వడంతో వేరే నాయకులు వచ్చేశారు. దీంతో చంద్రబాబు సైతం ఇంచార్జ్ పదవి ఎవరికి ఇవ్వాలో తేల్చలేదు.

అయితే తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు..మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించారు. చివరిరోజున నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనకు జనం నుంచి భారీ స్పందన వచ్చింది. అలాగే రోడ్ షోలో భాగంగా జరిగిన సభకు ఊహించని విధంగా టీడీపీ శ్రేణులు, జనం వచ్చారు. అసలు రోడ్డు మొత్తం జనంతో నిండిపోయింది..ఒక సముద్రపు వేవ్ మాదిరిగా రోడ్ మీద జనం కనిపించారు.

ఇంత భారీ స్పందన రావడంతో నిడదవోలులో మళ్ళీ పార్టీకి ఊపు వచ్చినట్లు అయింది. కానీ ఇక్కడే కొత్త ట్విస్ట్ ఉంది…ఇక్కడ టీడీపీకి బలం పెరిగింది గాని..నాయకుల మధ్య సమన్వయం పెరగలేదు. ఇంకా సెపరేట్ గా కార్యక్రమాలు నడుస్తున్నాయి. తాజాగా బాబుకు స్వాగతం చెప్పే విషయంలో శేషారావు, కుందల సత్యనారాయణ వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. సీనియర్లు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. కాబట్టి త్వరగా నిడదవోలు సీటు ఎవరికో తెలిస్తే..ఇక్కడ టీడీపీకి అడ్వాంటేజ్..లేదంటే ఈ గ్రూపు తగాదాల వల్ల పార్టీకి డ్యామేజ్.