యాపిల్ బ్యూటీ హన్సిక పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న జైపూర్‌లోని ముందోతా ఫోర్ట్ ప్యాలెస్ లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్ కథూరియాతో హన్సిక ఏడడుగులు నడవబోతోంది.
కుటుంబ సభ్యులు, సన్నిహితులు మరియు పలువురు సినీ ప్రముఖుల నడుమ వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇప్పటికే హన్సిక కుటుంబ సభ్యులతో జైపూర్ కు చేరుకుంది.
అలాగే ముండోటా కోటలో గురువారం రాత్రి మెహందీ వేడుకను నిర్వహించారు ఈ వేడుకలో హన్సిక కాబోయే భర్త సోహైల్ తో అందంగా మెరిసిపోతూ కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడులు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, కొన్ని రోజుల కిందట మాతా కీ చౌకీ కార్యక్రమంతో హన్సిక పెళ్లి పనులు ప్రారంభమైన విషయం తెలిసిందే. గ్రీస్‌లో ఈ అమ్మడు బ్యాచిలర్ పార్టీ కూడా ఇచ్చింది.
గ్రీస్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇక హన్సిక పెళ్లి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ స్ట్రీమింగ్కు సంబంధించిన వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.
A glimpse of @ihansika at her mehendi ceremony ✨💖#Hansika #HansikaMotwani #Tollywood #TollywoodActress #SohaelKhaturiya pic.twitter.com/Fxbe3WM0p2
— Hyderabad Times (@HydTimes) December 2, 2022
#WATCH: #HansikaMotwani decks up in red and yellow #ethnic wear, grooves with fiancé #SohaelKhaturiya during their #mehendi ceremony in #Jaipur@ihansika #HansikaSohaelWedding #hansikafans pic.twitter.com/Gd40H4TtYA
— HT City (@htcity) December 2, 2022