దర్శక ధిరుడు రాజమౌళి ఎంత గొప్ప డైరెక్టర్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు చూస్తే రాజమౌళి స్టామినా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇక బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. RRR సినిమాతో చేసిన అద్భుతాలు కూడా అందరికీ తెలిసిందే.మెగా నందమూరి కాంబినేషన్ అంటే సినిమా చేయడం పెద్ద సాహసం అని చెప్పవచ్చు. ఈ సినిమా సమయంలో రాజమౌళికి హెల్త్ బాగా లేకపోయినా సరే అవేవీ పట్టించుకోకుండా సినిమా మీద ఫోకస్ పెట్టడం జరిగిందట. ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది హీరోయిన్ శ్రియ.
ఆర్.ఆర్ అర్ సినిమా షూటింగ్ మొదలు చేయడానికి ముందు నుంచే రాజమౌళి ఆస్తమాతో చాలా ఇబ్బంది పడ్డారట. ఒకపక్క అలా బాధపడుతూనే మరొకపక్క సినిమా షూటింగ్ అని కొనసాగించేవారట. అంతే కాకుండా షూటింగ్స్ పాటలు దుమ్ము దూళి ఉన్నా కూడా అవేవీ పట్టించుకోకుండా సినిమా అవుట్ ఫుట్ మీదనే ఎక్కువగా తన దృష్టి పెట్టారని తెలియజేసింది శ్రియ. రాజమౌళి గారికి అంత డెడికేషన్ ఉంది కాబట్టే ఆయన విక్టరీకి కేరాఫ్ అడ్రస్ గా మారారని తెలియజేసింది. RRR సినిమా విషయంలో రాజమౌళి కమిట్మెంట్ గురించి ఈ సినిమాలో నటించిన హీరోలు ఎంతోమంది ఇప్పటివరకు తెలియజేశారు.
RRR సినిమా సమయంలో ఎన్టీఆర్ ,రామ్ చరణ్ అయితే నాటు నాటు పాట కోసం ఫర్ఫెక్ట్ సింక్ కోసం తమను చాలా ఇబ్బంది పెట్టారని తెలియజేశారు. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబుతో ఒక ఇంటర్నేషనల్ లెవల్లో సినిమాని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు. ఈ సినిమా 2025లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. శ్రియ రాజమౌళి పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.