రాజకీయాల్లో వేగులు, ఉప్పందించే వారికి ఎప్పుడూ కొదవ ఉండదు! ఇప్పుడు ఇదే టాక్‌పై తీవ్ర వర్రీ అయిపోతున్నారు తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ నేతలు. తెలంగాణలోని కేసీఆర్ సర్కారులో ఉన్న మంత్రులే ఏకంగా వేగులు మారిపోయారని ఆరోపిస్తున్నారు. ఈ మంత్రులు ప్రభుత్వం చేయదల్చుకున్న, చేస్తున్న పనులకు సంబంధించిన సీక్రెట్ సమాచారాన్నంతా పోగేసి.. పక్కారాష్ట్ర సీఎం చంద్రబాబుకి చేరవేస్తున్నారట. దీంతో సదరు సమాచారాన్ని ముందే గ్రహిస్తున్న చంద్రబాబు.. తెలంగాణ కన్నా రెండడుగులు ముందుండేందుకు ప్రయత్నిస్తున్నారట! ఇలా మంత్రులే […]
Tag: TDP
స్నేహితుడితో జగన్‌కు షాక్ రెడీ చేస్తోన్న లోకేష్
తెలుగుదేశం పార్టీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కొంతకాలంగా క్రియాశీలక పాత్రను పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే… లోకేష్‌కు మంత్రి పదవినిచ్చి పాలనలో మరింత ముఖ్య పాత్ర వహించే అవకాశం ఇవ్వాలని ఇటీవల పార్టీ నుంచి గట్టి డిమాండే వచ్చినా… ప్రత్యర్థుల విమర్శలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వడం ఇష్టం లేని ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రస్తుతానికి పార్టీ నేతలకు సర్ది చెప్పి ఆ అంశాన్ని పక్కన పెట్టారు. ఇదిలా ఉండగా 2019 ఎన్నికలనాటికి అధికారం […]
ఏపీ రాజధానిలో టీడీపీతో బీజేపీ కటిఫ్
2014 నుంచి మిత్రపక్షంగా ఉన్న ఏపీ అధికార పార్టీ టీడీపీ, బీజేపీ ల మధ్య రానురాను కొన్ని విషయాల్లో వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇక, ఇటీవల కాలంలో నామినేటెడ్ పదవుల వ్యవహారం మరింతగా ఇరు పార్టీల నేతల మధ్య అంతరాన్ని మరింతగా పెంచింది. ఈ క్రమంలోనే విజయవాడ బీజేపీలో చిచ్చు రేగింది. ఇక, ఇప్పుడు ఇదే నామినేటెడ్ పదవుల పందేరం విషయంలో గుంటూరు బీజేపీ నేతలు మరింతగా కారాలు మిరియాలు నూరడంతోపాటు అసలు టీడీపీతోనే కటీఫ్ చెప్పేందుకు […]
బాబు ప్రభుత్వంపై పోరాటానికి పవన్ రెడీ
ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న జనసేనాని పవన్ కళ్యాణ్‌కి ఇప్పుడు ప్రశ్నించే టైం వచ్చిందా? అది కూడా మిత్రపక్షం, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపైనే పవన్ రెచ్చిపోతాడా? బాబు ప్రభుత్వ నిర్ణయాలపై రంకెలు వేస్తాడా? అంటే నిన్నటికి నిన్న జరిగిన పరిణామాలను బట్టి చూస్తే.. ఔననే సమాధానమే వస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేయనున్న గోదావరి మెగా ఫుడ్ పార్క్‌ని అక్కడి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మెగా ఫుడ్ ఫార్క్ ఏర్పాటుతో విడుదలయ్యే వ్యర్థాలను పొలాలకు పారే […]
టీడీపీ నేతల బహు భార్యల లెక్కలు చెప్పిన వైకాపా
ఏపీ సీఎం చంద్రబాబు అవాక్కయ్యే విషయాన్ని వైకాపా నేతలు వెల్లడించారు. అక్కడెక్కడో ఉన్న అమెరికా పౌరులు ఎంజాయ్ మెంట్ కోసం పెళ్లిళ్లు చేసుకుంటారని, వాళ్లకి కుటుంబ సంతోషం ఏమిటో తెలీదని నిన్న వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో తన ఛాంబర్ ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కామెంట్లు కుమ్మరించారు. ఈ సందర్భంగానే ప్రస్తుతం అమెరికా అధ్యక్ష రేసులో పోరాడుతున్న ట్రంప్ గురించి మాట్లాడుతూ.. ఆయనకు ప్రస్తుతం ఉన్న భార్య నాలుగో వ్యక్తి అని అనుకుంటున్నట్టు చెప్పారు. ఇలాంటి […]
టీడీపీ ఎంపీపై బాబుకు ఎంత ప్రేమ
టీడీపీకి చెందిన ఓ ఎంపీపై సీఎం చంద్రబాబు ప్రేమ కురిపిస్తున్నారా? నిబంధనలను సైతం పక్కకు పెట్టి మరీ ఆ ఎంపీని ఆదరిస్తున్నారా? అంటే ఔననే ఆన్సరే చెబుతున్నారు తాజా పరిణామాలను గమనిస్తున్నవారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని, ఎంతకైనా వెనుకాడేది లేదని పదే పదే చెప్పే చంద్రబాబు.. ఓ విషయంలో మాత్రం పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కాంట్రాక్టుల విషయంలో ఆయా పనులను నిర్దేశిత గడువు లోగా పూర్తి చేయని కాంట్రాక్టర్లను, […]
ఏపి లో మంత్రి గారి అల్లుడు గిల్లుడు..!
ఏపీలోని రోడ్లు భవనాల శాఖ ఇప్పుడు అవినీతికి కేరాఫ్‌గా మారిందనే విమర్శలు జోరందుకున్నాయి. సాక్షాత్తూ ఓ మంత్రిగారి అల్లుడు రంగంలోకి దిగిపోయి.. నాకది.. నీకిది తరహాలో అధికారులను లోబరుచుకుని పక్కాగా ప్రజల సొమ్మును బొక్కేస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఏపీలోని అన్ని రహదారులను అద్దంలా తయారు చేయాలని సీఎం చంద్రబాబు ప్లాన్ వేశారు. ఫలితంగా దేశ, విదేశీ పెట్టుబడి దారులను ఆకర్షించాలని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్ల […]
బాబు గ్రేడింగుల లెక్క ఇదే
ఏపీ సీఎం చంద్రబాబు సర్వేల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే ఎప్పటికప్పుడు తన మంత్రులు, ఎమ్మెల్యేల మీద సర్వేలు చేస్తూ వారిని అనుక్షణం అప్రమత్తం చేస్తున్నారు. బాబు గారి సర్వే లెక్కలతో మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఎప్పుడు ఏం కొంప ముంచుకొస్తుందోరా బాబు అని టెన్షన్ టెన్షన్‌గానే ఉంటున్నారు. ఇక తాజాగా విజయవాడకు సమీపంలోని వడ్డేశ్వరంలోని కేఎల్ వర్సిటీలో ఏపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్‌చార్జ్‌లకు మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు […]
ఆ డైరెక్టర్‌పై చంద్రబాబు నిఘా పెట్టారా..!
తెలుగు తెర వేల్పులుగా జనం కొలిచిన ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు ఇద్దరితోనూ సూపర్ డూపర్ హిట్ సినిమాలు రూపొందించిన మేటి దర్శకుడు దాసరి నారాయణరావు. ఆ మహానటులు ఇద్దరి తరువాత సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా నిలిచింది కూడా దాసరేనని చెప్పాలి. దాదాపు కొన్నిదశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా దాని పరిష్కారంలో దాసరి నారాయణరావుదే ప్రధాన పాత్ర. సినిమాల్లో ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉన్నదాసరి రాజకీయాల్లో మాత్రం మొదటినుంచీ కాంగ్రెస్ పార్టీనే అనుసరించారు. ఆ […]