అమ‌రావ‌తిలో స్పీడ్ యాక్సెస్ క‌థేంటో తెలుసా

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత న‌గ‌రాల్లో ఒక‌టిగా చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు భావిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న రాజ‌ధాని నిర్మాణం విష‌యంలో ప‌క్కాగా ముందుకు పోతున్నారు. ముఖ్యంగా ప్ర‌భుత్వం లోటు బ‌డ్జెట్‌లో ఉన్న నేప‌థ్యంలో రాజ‌ధాని అభివృద్ధి చెందాలంటే.. పెట్టుబ‌డులు అవ‌స‌ర‌మ‌వుతాయి. అయితే, ఈ పెట్టుబ‌డులు రావాలంటే రాజ‌ధాని ప్రాంతంలో మౌలిక స‌దుపాయాలు బాగుండాలి. వాటిలో ముఖ్యంగా రోడ్ల వ్య‌వ‌స్థ బాగుంటేనే విదేశాల నుంచి పెట్టుబ‌డుల వ‌ర్షం కురుస్తుంది. దీనిని గ‌తంలోనే గుర్తించిన […]

సొంత కులాన్ని ప‌క్క‌న పెట్టిన చంద్ర‌బాబు

ప్ర‌స్తుతం పాలిటిక్స్‌లో సామాజిక వ‌ర్గాల జోరు భారీ ఎత్తున సాగుతోంది. వాస్త‌వానికి సామాజిక వ‌ర్గాలకు ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోతే పాలిటిక్స్ నిల‌బ‌డే ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో ఆపార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా ఏ పార్టీ అయినా.. సామాజిక వ‌ర్గాల‌కు అగ్ర‌తాంబూలం ఇస్తున్నాయి. అయితే, దీనికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించారు ఏపీసీఎం చంద్ర‌బాబు. రెండో తెలుగు రాష్ట్ర‌మైన తెలంగాణ‌లో ఆయ‌న త‌న పార్టీలో త‌న సామాజిక వ‌ర్గ‌మైన క‌మ్మ‌ల‌కు ప్రాతినిధ్యం ఇవ్వ‌డం లేద‌నే టాక్ ఇప్పుడు […]

చిరు కోసం రంగంలోకి ఆ ఇద్ద‌రు మంత్రులు..!

అవును. కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కోసం.. టీడీపీ మంత్రులు ఇద్ద‌రు రంగంలోకి దిగారు! ఈ ప‌రిణామం ఎందుకంటారా? ఏపీలో ఇప్పుడు రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల వేడి రాజుకుంటోంది! 2019 ఎన్నిక‌లకు సంబంధించి నేత‌లు ఇప్పుడు త‌మ త‌మ ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ఈ క్ర‌మంలో అధికార టీడీపీ దృష్టి ఇప్పుడు చిరంజీవిపై ప‌డింది. ఆయ‌న‌ను త‌మ పార్టీలోకి చేర్చుకునే దిశ‌గా నేత‌లు పావులు క‌దుపుతున్నారు. ఆయ‌న‌ను రంగంలొకి దింప‌డం వ‌ల్ల 2019లోనూ ఎలాంటి ప్ర‌యాస […]

పవన్ ఎంట్రీతో అక్కడ టీడీపీకి చుక్కలే

రాష్ట్ర విభ‌జ‌న తరువాత ఇటు ఏపీలోను, అటు తెలంగాణ‌లోను విభిన్న‌మైన రాజ‌కీయ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. తెలంగాణ‌కు సంబంధించినంత‌వ‌ర‌కూ సినీ గ్లామ‌ర్ అంత‌గా ప‌నిచేయ‌ద‌నే చెప్పాలి. అక్క‌డ స్థానిక స‌మ‌స్య‌లు, నాయ‌కులే పార్టీల గెలుపు ఓట‌మిల‌ను ప్ర‌భావితం చేసే ప‌రిస్థితి గ‌తంలో ఉండ‌గా.. ఇక ఇప్పుడు తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ ప్రాంతీయ‌వాదం భుజాన వేసుకుని.. అదే విధ‌నాన్ని కొన‌సాగిస్తూ… అక్క‌డి రాజ‌కీయాల‌ను శాసించే స్థాయికి చేరింది. ఇక ఏపీలో సినీ గ్లామ‌ర్‌తో పాటుగా కుల రాజ‌కీయాల‌దే మొద‌టినుంచీ […]

అక్క‌డ బాబుకు రోజుకో త‌ల‌నొప్పి

విప‌క్షాధినేత జ‌గ‌న్ గ‌తంలో.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్ట‌డం త‌న‌కు నిమిషాల‌మీద ప‌ని అంటూ… అహంకారంతోనో.. లేక రాజ‌కీయ అప‌రిక్వ‌త‌తోనో చేసి వ్యాఖ్య‌లు అంద‌రికీ గుర్తుండే ఉంటాయి. అదే స‌మ‌యంలో ఇటు  మిత్ర ప‌క్షంగా ఉన్న బీజేపీ సైతం ఏపీలో సొంతంగా బ‌ల‌ప‌డేందుకు మొద‌లుపెట్టిన ప్ర‌య‌త్నాలు చూశాక.. వారి ప్ర‌య‌త్నాల‌కు ఆదిలోనే గండి కొట్ట‌డ‌మే ల‌క్ష్యంగా … రాజ‌కీయ చాణ‌క్యుడుగా పేరున్న‌ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కార్య‌క్ర‌మానికి తెర లేపారు. ఫ‌లితంగా.. కొద్దిరోజుల్లోనే వైసీపీనుంచి మూడో వంతు […]

మాజీ మంత్రికి కొత్త పార్టీలే గ‌తా..!

ఎంతీ సీనియ‌ర్ పొలిటీషియ‌న్ల‌కైనా ఒక్కొక్క సారి ప‌రిస్థితులు అనుకూలించే అవ‌కాశం ఉండ‌దు. ఈ విష‌యంలో కొంత వారి స్వ‌యంకృతం కావొచ్చు. లేదా కొంత టైంబ్యాడ్ కావొచ్చు. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు సీనియ‌ర్ పొలిటీషియ‌న్ కొణ‌తాల రామ‌కృష్ణ‌. వైఎస్ హ‌యాంలో కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు త‌న స్టైల్లో చ‌క్రం తిప్పిన కొణ‌తాల వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత అనూహ్య రాజ‌కీయ ప‌రిస్థితులు ఎదుర్కొన్నారు. అన‌కాప‌ల్లి నుంచి క్రియా శీల రాజ‌కీయాల్లో అడుగు పెట్టిన కొణ‌తాల త‌ర్వాత త‌న ప్ర‌భావం చూపించేందుకుఎంతో […]

ఆ మంత్రికి – లోకేష్‌కు భారీ గ్యాప్‌

ఏపీ మంత్రుల్లో కొంద‌రి అవినీతి, బంధుప్రీతి వంటివి తార స్థాయికి చేరాయ‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే విద్యాశాఖ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస‌రావుపైనా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మొన్న‌టికి మొన్న విశాఖ అవ‌స‌రాల‌కు స్థ‌లాలు కేటాయించేందుకు స‌సేమిరా అన్న అధికారులు మంత్రి గంటా ఒత్తిడితో ఫిలింన‌గ‌ర్ సొసైటీకి విశాఖ‌లో స్థ‌లాలు కేటాయించారు. ఇది పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది. కేవ‌లం త‌న కుమారుడి టాలీవుడ్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా గంటా ఇలా చేశార‌ని టాక్ వ‌చ్చింది. […]

టీడీపీలో ఒక్క‌టైన బ‌ద్ధ శ‌త్రువులు

క‌డ‌ప జిల్లాలో ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు పుట్టినిల్లుగా  జమ్మలమడుగు నియోజ‌క‌వ‌ర్గాన్నిచెప్పుకోవాలి. ఇక్క‌డ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి… ఇటీవ‌ల టీడీపీ తీర్థం పుచ్చుకున్న‌..ఆదినారాయణరెడ్డి,  మొద‌టినుంచి టీడీపీనే న‌మ్ముకున్న మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి కుటుంబాల మ‌ధ్య ద‌శాబ్దాల వైర‌ముంది. అందుకే ఆదినారాయ‌ణ‌రెడ్డి టీడీపీ లోకి రావ‌డాన్ని… రామ‌సుబ్బారెడ్డి వ‌ర్గం తీవ్రంగా వ్య‌తిరేకించింది. చంద్ర‌బాబు రాజ‌కీయ చాణ‌క్య‌మో… లేక ఈ  జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస‌రావు వ్యూహ చ‌తుర‌తో తెలియ‌దుగానీ విప‌క్ష అధినేత జగ‌న్ సొంత‌ జిల్లాలో ప‌రిణామాలు […]

త‌మ్ముళ్ల‌కు చంద్ర‌బాబు ఆఫ‌ర్ – వార్నింగ్‌

క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన కార్య‌క‌ర్త‌లున్న పార్టీగా  తెలుగుదేశం పార్టీకి దేశంలోనే ప్ర‌త్యేక స్థాన‌ముంది. పార్టీ కోసం అహ‌ర్నిశ‌లు సైనికుల్లా శ్ర‌మించే వీరి అండదండ‌ల‌తోనే ఆ పార్టీ గ‌త ముప్పై మూడేళ్లుగా ఎన్నో ఒడిదుడుకులెదురైనా వాటిని స‌మ‌ర్థంగా ఎదుర్కొంటూ ముందుకు రాగ‌లిగింది.  తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ధాన రాజ‌కీయ‌ప‌క్షంగా సుస్థిర స్థానం సంపాదించుకోగ‌లిగింది. ఈ నేప‌థ్యంలో పార్టీనే నమ్ముకుని సొంత ఆస్తుల‌ను కూడా క‌రిగించుకుంటూ పనిచేసిన కార్యకర్తలను, నాయ‌కుల‌ను ఆదుకునేందుకు  ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్న‌ట్టు.. ఆ పార్టీ అధినేత – ఏపీ […]