ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గ రాజకీయం ఏ రోజు ఎలా మలుపులు తిరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో గత పదేళ్లలో చాలా మంది నాయకులు పార్టీలు ఫిరాయించారు. ఇక్కడ గత ఎన్నికల్లో గెలిచిన భూమానే తీసుకుంటే ఆయన టీడీపీ – ప్రజారాజ్యం – వైసీపీ తిరిగి టీడీపీ ఇలా చాలా పార్టీలు మారారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి మంత్రి పదవి హామీతో టీడీపీలోకి జంప్ చేశారు. రెండు […]
Tag: TDP
టీడీపీకి సైకిల్ కష్టాలు
తెలుగు రాజకీయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది. దివంగత మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకసభ్యుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం తెలుగు గడ్డపై దశాబ్దాల పాటు అప్రతిహతంగా జైత్రయాత్ర కొనసాగిస్తోన్న జాతీయ కాంగ్రెస్‌ను మట్టికరిపించి తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ సైకిల్ గుర్తును తన పార్టీ ఎన్నికల చిహ్నంగా ఎంచుకున్నారు. నాడు ఎన్టీఆర్ సీఎంగా సైకిల్‌పైనే అసెంబ్లీకి వెళతానని చెప్పి అలాగే చేసి రికార్డు సృష్టించారు. ఆ […]
లగడపాటి స్కెచ్ టీడీపీ ఎంపీకా..వైసీపీ ఎమ్మెల్యేకా..!
దశాబ్దం పాటు ఏపీలో కీలకమైన కృష్ణా జిల్లా రాజకీయాలను శాసించిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్ గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేయడంతో రాజకీయాలపై విరక్తితో ఆయన వాటికి దూరమయ్యారు. పదేళ్లపాటు విజయవాడ ఎంపీగా ఉన్న లగడపాటి ఇటు స్టేట్ పాలిటిక్స్‌లో కింగ్. అటు జాతీయస్థాయిలోను సత్తా చాటారు. మీడియాలో ఎక్కడ చూసినా లగడపాటి హంగామా చాలా ఎక్కువగానే ఉండేది. అలాంటి లగడపాటి వాయిస్ ఇప్పుడు చాలా తక్కువుగా మాత్రమే వినిపిస్తోంది. […]
టీడీపీలో కోటి రూపాయల చిచ్చు…అసలు కథ ఇదే
ఏపీలో అధికార టీడీపీ బలంగా ఉన్న జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లా ఒకటి. ఇప్పుడు ఈ జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎంపిక పెద్ద సస్పెన్స్‌లో పడింది. ఈ సస్పెన్స్ వెనక ఓ కోటి రూపాయల ఆసక్తికర కథ ఉన్నట్టు జిల్లా టీడీపీలోని విశ్వసనీయవర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్‌గా నామన రాంబాబు ఉన్నారు. ఈయన హోం, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అనుంగు అనుచరుడు. రాంబాబును జడ్పీచైర్మన్ చేయడంలో రాజప్పదే కీలకపాత్ర. ఇదిలా ఉంటే […]
సఫలమైతే.. సొంతడబ్బా.. విఫలమైతే విపక్షాల కుట్రా!
ఏపీ, తెలంగాణ సహా కేంద్ర ప్రభుత్వాల వ్యవహార శైలి.. వింతగా ఉంది! అధికారంలోకి వచ్చేసి మూడేళ్లు గడిచిపోయినా.. ఇంకా విపక్షాలు తమపై కుట్రలు పన్నుతున్నాయని పెద్ద పెద్ద విమర్శలతో విరుచుకుపడుతున్నారు అధికార పార్టీల అధినేతలు! తాము చేపట్టిన పనులు విజయవంతం అయితే అంతా తమదే ఘనకార్యంగాను, విఫలమైతే.. విపక్షాల కుట్ర అనడం ఇప్పుడు అందరికీ అలవాటుగా మారిపోయింది. తాజాగా ఏపీ, తెలంగాణ, అటు కేంద్రంలో జరిగిన పరిణామాలు అత్యంత ఆసక్తిగా మారాయి. ఏపీలో కురిసిన భారీ వర్షానికి […]
చంద్రబాబు పాలనలో మెరుపులెన్ని..? మరకలెన్ని?
ఆయనొస్తారు.. అన్ని సమస్యలూ తీరుస్తారు..! 2014 ఎన్నికల సమయంలో భారీ ఎత్తున ప్రసార మాధ్యమాల్లో మోగిపోయిన ప్రచారం ఇది! ఆయనొచ్చారు.. కానీ.. అన్ని సమస్యలూ తీరాయా? ఇప్పుడు వెయ్యి డాలర్ల ప్రశ్న రాష్ట్రంలో హల్ చల్ చేస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి మొత్తంగా.. ముచ్చటగా.. మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ మూడేళ్ల కాలంలో బాబు పాలన తీరుతెన్నులు.. ఆయన పాలనకు మార్కులు వంటి విషయాలపై ఓ లుక్కేద్దాం.. రంగాలా వారీగా ఏపీ సాధించిన ప్రగతిని పరిశీలిద్దాం.. సంక్షేమం.. ఏ […]
జేసీ మాటలు అర్థమయ్యాయా.. బాబూ..!
అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మరోసారి పూనకం వచ్చింది! నిన్న సీఎం చంద్రబాబు సమక్షంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సభలో జేసీ.. తనదైన శైలిలో మైకులో విరుచుకుపడ్డాడు. సీఎంగా చంద్రబాబు తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరూ బాగుచేయలేరని అంటూ..నే రైతులను బాబు హయాంలోనే పోలీసులు వేధిస్తున్నారంటూ చురకలంటించారు. దీనికి వాళ్లు సూట్ అని పేరు పెట్టినట్టు చెప్పారు. కొద్దిసేపు.. మా వాడు అంటూ జగన్ ఊసెత్తిన జేసీ.. ఆ తర్వాత తన […]
దీనికి కూడా సీఐడీని వాడేసుకుంటారా?!
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం.. అధికార సంస్థలను ఎంతగా నిర్వీర్యం చేస్తోందో చెప్పడానికి తాజా అసెంబ్లీ ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. ముఖ్యంగా క్షణం కూడా తీరికలేని సీఐడీ వంటి సంస్థలను అర్థం పర్థం లేని విషయాలపై విచారణకు నియమిస్తుండడం ప్రస్తుతం వివాదానికి దారితీస్తోంది. అధికార పక్షం ఈగోకు పోతుండడం వల్ల విలువైన ప్రజాధనం కూడా దుర్వినియోగం అవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇటీవల కురిసిన భారీ వర్షానికి అసెంబ్లీలో విపక్షనేతకు కేటాయించిన చాంబర్ లోకి నీళ్లు వచ్చాయి. ఇది […]
చంద్రబాబుకు తెలంగాణ మంత్రి మంచి మార్కులు
సమైక్యాంధ్ర ఏపీ, తెలంగాణగా విడిపోయినప్పటి నుంచి రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య వ్యవహారం ఉప్పునిప్పుగా నడుస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో విపక్షాల సంగతి ఎలా ఉన్నా సీఎంలు చంద్రబాబు, కేసీఆర్, అధికార పార్టీలు అయిన టీడీపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య కూల్‌వాటర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతోందన్నది వాస్తవం. కేసీఆర్, చంద్రబాబు ఒకరిపై మరొకరు ఎన్నోసార్లు విమర్శలు చేసుకున్నారు. వీరు ముఖాముఖీ ఎదరు పడేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. ఇదిలా ఉంటే ఓ తెలంగాణ మంత్రి ఏపీ […]