రామోజీకి – చంద్ర‌బాబుకు దూరం ఎందుకు

తెలుగుదేశం-ఈనాడు బంధం బీట‌లు వారుతోందా? టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఈనాడు సంస్థ‌ల అధిప‌తి రామోజీరావుకు మ‌ధ్య దూరం పెరుగుతోందా? అంటే అవున‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈనాడు, టీడీపీది ద‌శాబ్దాల అనుబంధం! ప్ర‌స్తుతం ఇది క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతోంద‌నే ప్ర‌చారం జోరందుకుంది. ముఖ్యంగా ప్రింట్ మీడియాలో ఈనాడు త‌ర్వాత టీడీపీని ఎక్కువ మోస్తున్న సంస్థ ఆంధ్ర‌జ్యోతికి సీఎం చంద్ర‌బాబు అధిక ప్రాధాన్యం ఇస్తుండ‌టం కూడా ఇందుకు బ‌లం చేకూరుస్తోంది. త‌న రాజ‌కీయ గురువు రామోజీరావును చంద్ర‌బాబు ప‌క్క‌న‌పెట్ట‌డం వెనుక కార‌ణాలేంట‌నే […]

టీడీపీకి ఓట్లు వేయం…ఇది వారి మాట!

ఏపీలోని నంద్యాల ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేష‌న్ రాకుండానే అక్క‌డ పొలిటిక‌ల్ హీట్ పెరిగిపోయింది. టీడీపీ త‌ర‌పున భూమా నాగిరెడ్డి అన్న కొడుకు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి, వైసీపీ నుంచి మాజీ మంత్రి శిల్పా మోహ‌న్‌రెడ్డి పోటీ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి బ్ర‌హ్మానంద‌రెడ్డి నోటిఫికేష‌న్ రాకుండానే ఎన్నికల ప్ర‌చారం స్టార్ట్ చేసేశాడు. మంత్రి అఖిల‌ప్రియ‌కు సైతం త‌న సోద‌రుడు బ్ర‌హ్మానంద‌రెడ్డిని గెలిపించుకోవ‌డం క‌ఠిన‌ప‌రీక్ష‌గా మారింది. దీంతో ఆమె సోద‌రుడిని వెంట‌పెట్టుకుని ఆశీర్వాద […]

ఆయన విషయంలో మాత్రం కాస్త సస్పెన్స్..మరి అఖిలప్రియ ఏం చేస్తదో!

ఉప ఎన్నిక‌ల వేళ నంద్యాల టీడీపీలో ర‌గ‌డ ర‌గ‌డ జ‌రుగుతోంది. నిన్న‌టి వ‌ర‌కు టీడీపీలో ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహ‌న్‌రెడ్డి పార్టీ వీడ‌డంతో జ‌గ‌న్ ఆయ‌న‌కు వైసీపీ టిక్కెట్ ఇచ్చారు. శిల్పా వైసీపీలోకి వెళ్లిపోవ‌డంతో ఆయ‌న సోద‌రుడు ఎమ్మెల్సీ, జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు అయిన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి సైతం వైసీపీలోకి వెళ్లిపోతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారం ఎలా ఉన్నా చ‌క్ర‌పాణిరెడ్డి మాత్రం తాను టీడీపీని వీడేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. చ‌క్ర‌పాణిరెడ్డి తాను టీడీపీని […]

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లొస్తే ఏపీ, తెలంగాణ‌లో గెలుపెవ‌రిది…

ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉండ‌గానే.. ఇప్ప‌టినుంచే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంది. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ఇటు టీడీపీ, అటు టీఆర్ఎస్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టేశాయి. కొత్త‌గా రాజ‌కీయ తెర‌పై భ‌విత‌వ్యాన్ని ప‌రీక్షించుకోవాల‌ని నిర్ణ‌యించిన జ‌న‌సేన.. ఈసారి ఎన్నిక‌ల్లో ఎలాంటి ప్ర‌భావం చూపుతుంది? సీఎం కావాల‌నుకునే ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఆశ‌లు ఈసారి నెర‌వేర‌తాయా? అటు టీఆర్ఎస్‌లో మ‌ళ్లీ బ‌లం పుంజుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న కాంగ్రెస్ ఆశ‌లు ఎంత‌వ‌ర‌కూ ఫ‌లిస్తాయి? అనే ప్ర‌శ్న‌లు అందరిలోనూ ఉన్నాయి. అయితే ఇప్ప‌టికిప్పుడు […]

గంటాను వ‌దిలించుకుంటోన్న బాబు

ఏపీ విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు స్టైలే వేరు. ఆయ‌నకు ఒకే పార్టీలో ఉండి రాజ‌కీయాలు చేయాల‌న్న సూత్రం ఏదీ ఉండ‌దు. ప్ర‌తి ఎన్నిక‌కు ఒక్కో పార్టీ మారే గంటా, కొత్త చొక్కా మార్చినంత సులువుగా నియోజ‌క‌వ‌ర్గాలు కూడా మార్చేస్తుంటాడు. గంటా ప‌లు పార్టీలు మారి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు త‌న టీంతో క‌లిసి టీడీపీలోకి వ‌చ్చారు. ఇక్క‌డ ఒప్పందం ప్ర‌కారం ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కింది. మంత్రి ప‌ద‌వి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి గంటాకు జిల్లాలో […]

టీడీపీలో బ్ర‌ద‌ర్స్ బ‌ల ప్ర‌దర్శ‌న వెన‌క మ‌ర్మ‌మేంటో..?

క‌ర్నూలులో త‌మ హ‌వా మ‌ళ్లీ కొన‌సాగించేందుకు కేఈ సోద‌రులు త‌హ‌త‌హలాడుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎలాగైనా పూర్వ వైభవం సంపాదించాల‌ని ఆశగా ఎదురుచూస్తున్నారు. అందుకు ఇప్ప‌టి నుంచే వ్యూహాత్మ‌కంగా పావులు క‌దప‌డం ప్రారంభించారు. త‌మ బ‌లాన్ని, బ‌ల‌గాన్ని అధినేత చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్ల‌డానికి స‌న్మాన కార్య‌క్ర‌మాన్ని వేదిక‌గా మ‌లుచుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌మ కుటుంబం ఎప్పుడూ టీడీపీకి విధేయ‌త‌ను ప్ర‌క‌టించింద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించి చంద్ర‌బాబుకు కానుక‌గా ఇస్తామ‌ని ఆర్భాటంగా ప్ర‌క‌టించారు. ఇప్పుడు దీని వెను […]

ఎమ్మెల్యే బ‌రిలో సీఎం.ర‌మేశ్‌….ఆ నియోజ‌క‌వ‌ర్గంపై క‌న్ను..!

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌నుకుంటున్నారా ? ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న ఆయ‌న మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదా ? ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ర‌మేశ్ ఇప్ప‌టికే ఓ సేఫ్ నియోజ‌క‌వ‌ర్గం కూడా చూసేసుకున్నారా ? అంటే క‌డ‌ప జిల్లా రాజ‌కీయాల్లో అవున‌నే ఆన్స‌రే వినిపిస్తోంది. చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడిగా ముద్ర ఉన్న సీఎం.ర‌మేశ్‌కు ఇటీవ‌ల ఆయ‌న వ‌ద్ద ప్ర‌యారిటీ త‌గ్గుతూ వ‌స్తోంది. ఆయ‌న రాజ్య‌స‌భ […]

బాల‌య్య‌కు టీడీపీ ఝుల‌క్‌..!

ప్ర‌ముఖ సినీన‌టుడు, హిందూపురం ఎమ్మెల్యేకు టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు టీడీపీ మార్క్ ఝుల‌క్ ఇచ్చారు. చంద్ర‌బాబు బావ‌మ‌రిది, ఎమ్మెల్యేగా ఉన్న బాల‌య్య త‌మ జిల్లాకు వ‌స్తున్నాడ‌ని తెలిసినా ఎమ్మెల్యేలు మాత్రం ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు డుమ్మా కొట్టేశారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేలే కాదు, బాల‌య్య ఫ్యాన్స్ సైతం ఆయ‌న‌కు షాక్ ఇచ్చారు. దశాబ్దాల పాటుగా బాలకృష్ణ అభిమాన నేతలుగా కొనసాగుతన్న వారు సైతం ఈ కార్య‌క్ర‌మానికి రాక‌పోవ‌డం ఇప్పుడు నెల్లూరు జిల్లా టీడీపీ వర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నుడా (నెల్లూరు […]

ఆ టీడీపీ ఎమ్మెల్యే ధ్యాసంతా జనసేనేనా!

ఏపీ రాజ‌కీయాల్లో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు పేరుకు కాస్త క్రేజ్ ఉంది. టీడీపీ త‌ర‌పున ఉద‌యం మీడియా ఛానెళ్ల‌లో ఆయ‌న బాగానే హంగామా చేస్తారు. బొండా టీవీ చ‌ర్చ‌లు చూసే వాళ్ల‌లో చాలా మంది ఆయ‌న‌కు మ్యాట‌ర్ తక్కువ‌…మాటలు ఎక్కువ అని కూడా చ‌మ‌త్క‌రిస్తుంటారు. ఇక బొండా గెల‌వ‌డానికి ఫ‌స్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినా నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినంత హ‌డావిడి చేస్తుంటారు. గ‌త మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌కు ముందు వ‌ర‌కు బొండా […]