అవున్రాజా! డైలాగులు పేల్చడంలో దిట్ట.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాటల రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి.. త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని వార్త హల్ చేస్తోంది. ఆయనకు రాజకీయాలు కొత్తకాదు. రాజకీయ డైలాగులూ కొత్తకాదు. గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆపార్టీ తరఫున గుంటూరు జిల్లా చిలకలూరి పేట నుంచి పోటీ చేశాడు. అయితే, అనూహ్యంగా అప్పటి ప్రతిపాటి పుల్లారావు గాలికి ఈయన కొట్టుకుపోయాడు. దీంతో ఆయన ఇప్పటి వరకు […]
Tag: TDP
పశ్చిమలో పంచాయితీలు చేయలేక చేతులెత్తేసిన బాబు
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా టీడీపీకి ఎంత కంచుకోటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత ఎన్నికల్లో జిల్లాలోని 2 ఎంపీ సీట్లతో పాటు 15 ఎమ్మెల్యే సీట్లను టీడీపీ గెలుచుకుంది. గత ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఈ జిల్లాలో అధికార పార్టీ నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలతో చంద్రబాబుకు రోజూ ఏదో ఒక తలనొప్పిగా మారుతోంది. ఇక్కడ చాలా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. గతంలో మంత్రిగా ఉన్న పీతల సుజాతకు, ఏలూరు ఎంపీ మాగంటి బాబుకు పడదు. బాబుకు […]
పీకే సర్వేలో ఈ టీడీపీ ఎమ్మెల్యేలపై యాంటీ రిపోర్ట్
`ప్రజలకు నిరంతరం చేరువకావాలి. వారికి అందుబాటులో ఉండాలి. ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించాలి` ఇదీ పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నమాట. పలు సర్వేల్లో ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి సెగలు రగులుతున్నాయన్న విషయం గ్రహించిన ఆయన ఇలా చెబుతున్నా.. వారు మాత్రం తీరు మార్చుకోవడం లేదట. ఇప్పుడు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ ఏరికోరి తెచ్చుకన్న వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వేలోనూ ఇదే ఫలితాలు రావడంతో వైసీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి. కేవలం వైసీపీ నేతల […]
రాజధాని రేసులో మురళీమోహన్, నారా బ్రాహ్మణి
మురళీమోహన్ ఏపీ సీఎం చంద్రబాబును బాగా ఇబ్బంది పెట్టేస్తున్నట్టు ఏపీ టీడీపీ ఇన్నర్ కారిడార్‌లో ఒక్కటే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్న మాగంటి మురళీమోహన్ తన నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. 2009 ఎన్నికల్లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆయన గత ఎన్నికల్లో 1.50 వేల పైచిలుకు ఓట్లతో ఘనవిజయం సాధించారు. గత ఎన్నికల్లో గెలిచాక మురళీమోహన్ నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా దూరమైపోయారు. ఆయనకు వీలున్నప్పుడు […]
మంత్రి పితాని గ్రాఫ్ ఎలావుంది…2019లో గెలుస్తాడా?
పశ్చిమగోదావరి జిల్లాలో డెల్టాలో ఉన్న ఆచంట నియోజకవర్గంలో కుల ఈక్వేషన్లే ఎప్పుడూ కీలకపాత్ర పోషిస్తుంటాయి. ఇక్కడ కులాల లెక్కలే ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేస్తుంటాయి. పశ్చిమ డెల్టాలో కాపులు వర్సెస్ శెట్టిబలిజ వార్ ఎప్పుడూ ఉంటుంది. శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన పితానికి ముందునుంచి కుల బలం మెండు. పెనుగొండ నుంచి ఒకసారి, ఆచంట నుంచి రెండుసార్లు గెలిచిన పితాని ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పితాని గత ఎన్నికలకు ముందు […]
టీడీపీలో మళ్లీ పాత రోజులు.. నేతలకు బాబు దూరం!
టీడీపీలో కథ మళ్లీ మొదటికి వస్తోందా? చంద్రబాబు నేతలకు దూరం అవుతున్నారా? కేడర్‌ను అస్సలు పట్టించుకోవడం లేదా? 1990ల నాటి పరిస్థితులే పునరావృతం అవుతున్నాయా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఉమ్మడి ఏపీలో 23 జిల్లాలకు సీఎంగా ఉన్న సమయంలోనూ ఇప్పుడు కేవలం 13 జిల్లాలకు సీఎం గా ఉన్నారు. అయినా కూడా చంద్రబాబు అప్పట్లో ఎంత బిజీగా ఉన్నారో.. ఇప్పుడు కూడా అంతే బిజీగా ఉండడం గమనార్హం. అయితే, ఇక్కడ విషయంలోకి వచ్చేసరికి ఆయన అప్పట్లో […]
ఏపీ ప్రభుత్వంలో నెంబర్ 2గా లోకేష్..!
చంద్రబాబు ప్రభుత్వంలో కాసింత లేటుగా అరంగేట్రం చేసినప్పటికీ.. ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రేంజ్ మాత్రం ప్రస్తుతం పీక్ స్టేజ్‌కి చేరిపోయిందట! ప్రస్తుతం ఆయన ఐటీ, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖలను చూస్తున్నారు. అయినా కూడా ప్రజలు అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన సమస్యలను లోకేష్‌కే విన్నవిస్తున్నారట. అంతేకాదు, సచివాలయానికి వెళ్తున్న ప్రజలు పనున్నా లేకపోయినా.. లోకేష్‌ను చూడందే బయటకు రావడం లేదట. దీంతో ఇప్పుడు ప్రభుత్వంలో లోకేష్ సెంటరాఫ్‌ది మేటర్‌గా మారిపోయాడని అంటున్నారు […]
మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది..2019లో గెలుస్తాడా?
జిల్లా కేంద్రమైన కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్న ఎస్వీ.మోహన్‌రెడ్డి ఫస్ట్ టైం వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి గత ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మాజీ మంత్రి ఎస్వీ.సుబ్బారెడ్డి కుమారుడు అయిన మోహన్‌రెడ్డి దివంగత భూమా దంపతుల్లో శోభకు స్వయానా సోదరుడు కాగా, నాగిరెడ్డికి బావమరిది. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన మోహన్‌రెడ్డి ఇప్పటకీ రాజకీయంగాను పూర్తిగా గ్రిప్ సాధించకపోవడం ఓ మైనస్ అయితే, వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి మారడం మరో మైనస్. ఇక అధికార పార్టీలోకి వచ్చినా […]
టీజర్‌లోనే టీడీపీ కథ క్లోజ్…ఇక మిగిలింది సినిమాయే
ఎస్ ఈ హెడ్డింగ్ నిజమే అనిపిస్తోంది ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ పరిస్థితి చూస్తుంటే… తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధమని ఇప్పటికే ప్రకటనలు చేసేసింది. దీంతో టీడీపీ నేతలు తమ దారి తాము చూసుకోక తప్పడం లేదు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ దూకుడును తట్టుకుని నిలబడే సత్తా తమకు లేదని తేలిపోయింది. గత ఎన్నికల్లో అక్కడ కాస్తో కూస్తో మంచి ఫలితాలే సాధించిన టీడీపీ గ్రేటర్ ఎన్నికల్లో పూర్తిగా తేలిపోయింది. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ కేవలం ఒక్క […]