హోం మంత్రి రాజ‌ప్ప‌కు టీడీపీ క‌న్నా కుల‌మే ఎక్కువా..!

ఏపీలో నంద్యాల ఉప ఎన్నిక‌, కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ను అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ రెండు ఎన్నిక‌లు త‌మ‌కు చావో రేవోగా రెండూ పార్టీలు పోరాడాయి. రెండు చోట్ల టీడీపీ తిరుగులేని విజ‌యం సాధించింది. కాపు ఉద్య‌మం ఎఫెక్ట్ ఎక్కువుగా ఉండ‌డంతో కాకినాడ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందా ? అన్న టెన్ష‌న్ సీఎంగా చంద్ర‌బాబుకు ఎక్క‌వుగానే క‌నిపించింది. ఇక్క‌డ కాపులంద‌రూ కూడా వార్ వ‌న్‌సైడ్ చేసేసి టీడీపీని గెలిపించారు. […]

బాల‌య్యా ఏంద‌య్యా ఈ కంగాళీ రాజ‌కీయం

నంద‌మూరి బాల‌య్య సీఎం చంద్ర‌బాబు వియ్యంకుడుగానే కాకుండా హిందూపురం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అయితే, ఇటీవ‌ల కాలంలో ఆయ‌న వ్య‌వ‌హార శైలి పూర్తిగా గాడిత‌ప్పింద‌ని, త‌మ‌ను అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని హిందూపురం జ‌నాలు భారీ ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. 2014లో ప‌ట్టుబ‌ట్టి హిందూపురం నుంచి గెలిచిన బాల‌య్య త‌ర్వాత ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని గాలికొదిలి.. మ‌ళ్లీ సినిమాల్లో మునిగితేలుతున్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌లు ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా మారాయి. అంతేకాదు, ఎప్పుడైనా అడ‌పా ద‌డ‌పా నియోజ‌క‌వ‌ర్గానికి […]

2019పై బాబు ప‌ట్టు.. మూడు `పీ`ల‌తో ముందుకు!

ల‌క్ష్యం ఉండ‌డం ఒక ఎత్తు.. ఆ లక్ష్యాన్ని సాధించే మార్గం అనుస‌రించ‌డం మ‌రో ఎత్తు! ఈ రెండూ జ‌త‌కలిస్తేనే విజ‌యం చేరువ‌య్యేది. ఈ సూత్రాన్ని గ‌ట్టిగా తెలిసిన, మ‌రింత గ‌ట్టిగా న‌మ్మిన నాయ‌కుడు చంద్ర‌బాబు. ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఆయ‌న మ‌రింత సీరియ‌స్‌గా ఫాలో అవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. 2019 ఎన్నిక‌ల్లో గెలుపొంద‌డ‌మే కాదు.. మ‌రో 50 ఏళ్ల పాటు అధికారంలోనే ఉండాల‌ని స్ప‌ష్ట‌మైన ల‌క్ష్యాల‌ను నిర్ణ‌యించుకున్న బాబు.. నాలుగు గోడ‌ల మ‌ధ్య కూర్చుని క‌ల‌లు క‌న‌డం లేదు. […]

నంద్యాల టీడీపీలో అప్పుడే ముస‌లం… ఆదినారాయ‌ణ‌రెడ్డి వ‌ర్సెస్ అఖిల‌ప్రియ‌

నంద్యాల ఉప ఎన్నిక దేశ రాజ‌కీయాల‌ను ఎలా త‌న వైపున‌కు తిప్పుకుందో అంద‌రం చూశాం. ఈ ఉప ఎన్నిక‌ల్లో గెలుపు కోసం టీడీపీ ఏకంగా ఏపీ స‌చివాల‌యంలో ఉన్న మంత్రుల‌తో పాటు త‌మ పార్టీ ఎమ్మెల్యేలు స‌రిపోక వైసీపీ నుంచి త‌మ పార్టీలోకి లాక్కున్న ఎమ్మెల్యేల‌ను కూడా అక్క‌డ దింపేసింది. నంద్యాల‌లో టీడీపీ భారీ మెజార్టీతో గెలిచి స‌త్తా చాటింది. టీడీపీ ఇక్క‌డ గెలిచి వారం రోజులు కూడా కాక‌ముందే అప్పుడే నంద్యాల‌లో ముస‌లం మొద‌లైపోయింది. అస‌లు […]

వైసీపీ మైన‌స్‌లే బాబును హీరోను చేస్తున్నాయా..!

ఏపీలో సైకిల్ జోరుగా హుషారుగా దూసుకుపోతోంది. ప్ర‌తిష్టాత్మ‌కంగాను, హోరాహోరీగాను జ‌రుగుతాయ‌ని టీడీపీ వాళ్లు అంచ‌నాలు వేసుకున్న ఎన్నిక‌ల్లో సైతం వైసీపీ బొక్క‌బోర్లాప‌డిపోతోంది. సైకిల్ స్పీడ్‌కు ఫ్యాన్ రెక్క‌లు తెగికింద ప‌డిపోతున్నాయి. నంద్యాల‌, కాకినాడ, క‌డ‌ప ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు అంచ‌నాల‌కే అంద‌ని విధంగా టీడీపీ గెలుస్తుండ‌డంతో ఆయ‌న కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో హీరో ఎవ‌రంటే నిస్సందేహంగా చంద్ర‌బాబే అని చెప్పాలి. నంద్యాల‌లాంటి చోట్ల జ‌గ‌న్ ఏకంగా 15 రోజులు మ‌కాం వేసి […]

బాబు కోడ‌లికి సినీ గ్లామ‌ర్ ట‌చ్‌

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి పేరు ఇప్ప‌టి వ‌ర‌కు వ్యాపార వ్య‌వ‌హారాల్లో మాత్ర‌మే విన‌ప‌డేది. చంద్ర‌బాబు ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ గ్రూప్‌ను లాభాల భాట ప‌ట్టించ‌డంలో ఆమె ప్లే చేసిన కీ రోల్ ఎవ్వ‌రూ మ‌ర్చిపోలేరు. ఇక ఫ్యూచ‌ర్‌లో బ్రాహ్మ‌ణి టీడీపీలో స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కురాలు అవుతార‌న్న అంచ‌నాలు ఇప్ప‌టికే ఉన్నాయి. ఆమెను లోక్‌స‌భ‌కు పోటీ చేయించాల‌ని కూడా చంద్ర‌బాబు చూస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. బ్రాహ్మ‌ణి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుంటూరు […]

నిన్న బాబు ద‌గ్గ‌ర హీరో… నేడు జీరో

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు మంత్రి లోకేష్ ముందు నిన్న‌టి వ‌ర‌కు హీరోగా ఉన్న ఓ మంత్రి నేడు జీరో అయిపోయాడా ? ఆయ‌నకు అప్ప‌గించిన కీల‌క బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణలో ఫెయిల్ అవ్వ‌డంతో పాటు స‌ద‌రు మంత్రి చేసిన వ్యాఖ్య‌లే ఇప్పుడు ఆయ‌న్ను బాబు, లోకేష్ ద‌గ్గర జీరో చేశాయా ? అంటే ఏపీ పాలిటిక్స్ ఇన్న‌ర్ స‌ర్కిల్‌లో వినిపిస్తోన్న విశ్వ‌సనీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అవున‌నే ఆన్స‌రే వినిపిస్తోంది. నిన్న‌టి వ‌ర‌కు చంద్ర‌బాబుకు, లోకేష్‌కు డిప్యూటీ […]

జ‌గ‌న్‌పై టీడీపీ అంచ‌నాలు తారుమారు!

ఇప్పుడు ఈ కామెంట్లు వైసీపీ సోష‌ల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. జ‌గ‌న్‌ను టైగ‌ర్‌తో పోలుస్తూ.. ప‌లువురు పోస్టింగులు దంచికొడుతున్నారు. దీనికి కార‌ణం.. నంద్యాల‌, కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో అతి పెద్ద దెబ్బ త‌గిలిన వైసీపీ ఇక నామ‌రూపాలు లేకుండా పోతుంద‌ని, ఆ పార్టీ ఇక కోలుకోవ‌డం క‌ష్ట‌మ‌ని భావించిన టీడీపీ పెద్ద‌ల‌కు జ‌గ‌న్ షాకివ్వ‌డ‌మే. నిజానికి నంద్యాల ఉప ఎన్నిక‌ను జ‌గ‌న్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాడు. గెలుపు త‌థ్యం అనుకున్నాడు. శ‌క్తికి మించి ప్ర‌చారం చేశాడు. ఓ రాష్ట్ర […]

ఆ మీడియా రైజింగ్ వెన‌క లోకేష్ హ్యాండ్‌..!

ఏపీ, తెలంగాణ‌ల్లో ప్ర‌ముఖ స్థానంలో ఉన్న ఓ మీడియా సంస్థ‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేష్ పెట్టుబ‌డుల వ‌ర‌ద పారించార‌ని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆ మీడియా సంస్థ ఇంతితై అన్న‌ట్టుగా ఇరు రాష్ట్రాల్లోనూ ఎదిగిపోతోంద‌ని స‌మాచారం. వివ‌రాల్లోకి వెళ్తే.. 2014 ఎన్నిక‌ల‌కు ముందు అంత‌గా స‌ర్క్యులేష‌న్‌, అంత‌గా పాఠ‌కులు లేని ప‌త్రిక ఇప్పుడు ఏపీలో పాఠ‌కుల వేట‌లో ప‌డ‌డంతో పాటు అత్యాధునిక హంగుల‌తో దూసుకుపోయేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. దీంతో ఇప్పుడు దీని వెనుక […]