ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి పేరు ఇప్పటి వరకు వ్యాపార వ్యవహారాల్లో మాత్రమే వినపడేది. చంద్రబాబు ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ గ్రూప్‌ను లాభాల భాట పట్టించడంలో ఆమె ప్లే చేసిన కీ రోల్ ఎవ్వరూ మర్చిపోలేరు. ఇక ఫ్యూచర్‌లో బ్రాహ్మణి టీడీపీలో సమర్థవంతమైన నాయకురాలు అవుతారన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. ఆమెను లోక్‌సభకు పోటీ చేయించాలని కూడా చంద్రబాబు చూస్తున్నట్టు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.
బ్రాహ్మణి వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారన్న టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే పొలిటికల్ ఎంట్రీ ఇస్తే అన్ని వర్గాలు, రంగాల వారితో సన్నిహితంగా ఉండాలి. ఈ క్రమంలోనే నిన్నటి వరకు వ్యాపార వ్యవహారాలతో కొన్నిసార్లు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో కొన్ని కార్యకలాపాలు పర్యవేక్షించిన ఆమె ఇప్పుడు సినిమా రంగంతో టచ్చింగ్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే బ్రాహ్మణి తాజాగా జరిగిన సైమా సౌతిండియన్ సినీ అవార్డ్స్ లో బ్రహ్మణి మెరిసింది. సినిమా వాళ్ల మధ్యలో బ్రాహ్మణి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె బాలయ్య కుమార్తే అయినా సినిమా రంగంతో ఆమెకు పరిచయాలు, సంబంధాలు లేవు. అయినా ఆమె సైమాలో సినిమా వాళ్ల మధ్యలో తళుక్కున ప్రత్యేకంగా మెరిసింది.
ఈ కార్యక్రమంలో బాలయ్య కానీ.. నారా, నందమూరి ఇళ్ల వారెవరూ కనిపించలేదు. అబూదాబీలో జరిగిన అవార్డ్స్ ఫంక్షన్ కు బ్రహ్మణి హాజరైంది. ఫ్యూచర్‌లో పొలిటికల్ ఎంట్రీ ఇస్తుండడంతో పాటు చంద్రబాబు తనయుడు లోకేష్ కన్నా ఆమె మంచి నాయకురాలు అవుతుందని అంచనాలు ఉన్న నేపథ్యంలో అన్ని వర్గాల వారితో పరిచయాలు పెంచుకునే క్రమంలోనే ఆమె సినీ రంగంతో టచ్చింగ్‌లోకి వచ్చినట్టు టాక్.