టీడీపీలో ఏం జ‌రుగుతోంది… చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపిస్తోందెవ‌రు…!

ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీకి ఇప్పుడు స‌రైన స‌మ‌యం. అదే స‌మ‌యంలో క‌ఠినమైన ప‌రీక్షా కాలం కూడా. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు పార్టీని స‌మాయ‌త్తం చేసుకుంటున్న స‌మ‌యంలో ఉరుములు లేని పిడుగుల్లా.. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు.. పార్టీని ఎటు తీసుకువెళ్తాయ‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. నేరుగా.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోకి వెళ్లి.. పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించుకునేందుకు కూడా చంద్ర‌బాబుకు ఇబ్బంది క‌ర ప‌రిణామాలు ఏర్ప‌డ్డాయంటే.. పార్టీపై ఎలాంటి ప్ర‌భావం ప‌డుతోందో అర్ధం చేసుకోవ‌చ్చు.   త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం […]

కంచుకోటలో సైకిల్‌కు బ్యాడ్ లక్!

తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు కూడా ఒకటి అని చెప్పొచ్చు..అసలు టీడీపీ ఓడిపోని నియోజకవర్గాల్లో ఇది ఒకటిగా ఉండేది. 1983 నుంచి ఇక్కడ టీడీపీ సత్తా చాటుతూనే ఉంది. 1999 ఎన్నికల్లోనే ఒకసారి ఓడిపోయింది. 2009లో ఎస్సీ రిజర్వడ్ స్థానంగా మారిన సరే ఇక్కడ టీడీపీ ఓడిపోలేదు. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచింది. కానీ 2019 ఎన్నికల నుంచి ఇక్కడ టీడీపీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ సీటు […]

టీడీపీ గేమ్..అప్పుడే తేలుతుందా?

మొత్తానికి పొత్తుల విషయంలో టీడీపీ ఊహించని విధంగా మైండ్ గేమ్ ప్లే చేస్తున్నట్లు కనిపిస్తోంది…అధికార వైసీపీని కన్ఫ్యూజ్ చేయడానికి పొత్తులతో సరికొత్త ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పొత్తులు ఉంటున్నాయని కథనాలు రావడం..ఆ వెంటనే ఇప్పుడే పొత్తుల గురించి మాట్లాడమని టీడీపీ అధినేత చెప్పడం వెనుక పెద్ద కథే ఉందని అర్ధమవుతుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టడానికి టీడీపీ-జనసేన పార్టీలు పొత్తుకు సిద్ధమవుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. పైగా పొత్తు విషయంలో […]

ఈ సారి ఏపీలో టాలీవుడ్ స‌పోర్ట్ ఎవ్వ‌రికి… వీళ్లంతా మారిపోయారుగా…!

గ‌త ఎన్నిక‌లు మాత్ర‌మేకాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా.. టాలీవుడ్‌పై చ‌ర్చ సాధార‌ణం. టాలీవుడ్ ప్ర‌ముఖులు.. ఎవ‌రికి మ‌ద్ద‌తిస్తారు? అనేది ఎప్పుడూ.. ఆస‌క్తిగానే ఉంది. వీరు మ‌ద్ద‌తిచ్చిన పార్టీలు.. నాయ‌కులు గెలుస్తున్నారు. గ‌త ఎఎన్నిక‌ల్లో రాష్ట్రంలో జ‌గ‌న్ సునామీ వ‌చ్చినా.. టాలీవుడ్ నుంచి మ‌ద్ద‌తున్న కొంద‌రు నాయ‌కులు గెలుపు గుర్రం ఎక్కారు. వీరిలో గుంటూరు జిల్లా రేప‌ల్లె ఎమ్మెల్యే అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌, గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ వంటి వారు తెలిసిందే. ఈ క్ర‌మంలో […]

టీడీపీ-జనసేన కాంబో..ఆ జిల్లా స్వీప్?

టీడీపీ-జనసేన పొత్తు…ఈ విషయంపై చాలా రోజుల నుంచి ఏపీ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది…రెండు పార్టీల మధ్య పొత్తు ఉండొచ్చని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది..అటు పొత్తుకు రెండు పార్టీలు రెడీగానే ఉన్నాయని హింట్ కూడా ఇచ్చాయి. అయితే పొత్తు గురించి అధికారికంగా మాత్రం ప్రకటన రాలేదు. కానీ వైసీపీని అధికారంలో నుంచి దించాలంటే రెండు పార్టీల మధ్య పొత్తు మాత్రం ఉండాలని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ రెండు పార్టీల శ్రేణులు సైతం పొత్తుకు మానసికంగా సిద్ధమవుతున్నాయి. ఏదేమైనా గాని […]

వైసీపీకి టచ్‌లో అస్మిత్…వ్యూహమే?

రాజకీయాల్లో పార్టీల వ్యూహాలు మామూలుగా ఉండటం లేదు..ప్రత్యర్ధులని దెబ్బతీయడానికి తమదైన శైలిలో ఎత్తులు వేసి…ప్రత్యర్ధులని చిత్తు చేయాలని చూస్తున్నారు. అసలు ఏమి లేని విషయాన్ని ఏదో ఉందన్నట్లు క్రియేట్ చేసి ప్రత్యర్ధులతో మైండ్ గేమ్ ఆడేస్తున్నారు. ఇలా మైండ్ గేమ్ ఆడటంలో అటు వైసీపీ గాని, ఇటు టీడీపీ గాని ఆరితేరిపోయాయి. ముఖ్యంగా కొందరు నేతలు పార్టీలు మారిపోతారంటూ…సరికొత్త కథనాలు సృష్టిస్తున్నారు. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఎవరికి క్లారిటీ లేకుండా పోతుంది. ఇటీవల కొందరు వైసీపీ […]

పొత్తుల ఎత్తులు…క్రియేట్ చేశారా?

గత కొంతకాలం నుంచి మళ్ళీ బీజేపీకి చంద్రబాబుకు దగ్గరవుతున్నారని, అదిగో ఎన్డీయేలోకి టీడీపీ వెళ్లిపోతుందని..టీడీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆ మధ్య ఆజాదీ అమృత్ ఉత్సవాల్లో భాగంగా మోదీ- చంద్రబాబు కలిశారు…అదంతా ఫార్మాలిటీకే తప్ప, రాజకీయం లేదు. కానీ దాన్ని టీడీపీ పెద్దగా చేసి చూసుకుంటుంది. ఇంకా బీజేపీతో పొత్తు ఖాయమని, అటు ఎలాగో జనసేన పొత్తు ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో జగన్‌కు చెక్ పెట్టేస్తామని అంటున్నారు. అయితే ఏపీలో ఒక శాతం […]

ఏపీలో మ‌రో టీడీపీ కంచుకోట కూలిపోతోందా…!

ఔను.. ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. టీడీపీకి కంచుకోట వంటి జిల్లాలు చాలానే ఉన్నాయి. వీటిలో అనంత‌పురం కూడా ఒక‌టి. ఒక‌ప్పుడు.. జిల్లా వ్యాప్తంగా మెజారిటీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టి విజ‌యం ద‌క్కించుకున్న ప‌రిస్థితి ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ సునామీ కార‌ణంగా.. కేవ‌లం రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది. హిందూపురం, ఉర‌వ‌కొండ‌. ఈ రెండు మినహా.. ఇక్క‌డ పార్టీకి ఎమ్మెల్యేలు లేరు. అయితే.. బ‌ల‌మైన కేడ‌ర్ మాత్రం ఉంది. అదేస‌మ‌యంలో మాజీ మంత్రులు.. కాలువ […]

జ‌గ‌న్ టార్గెట్‌లో ఉన్న టీడీపీ నేత‌లు వీళ్లే… ప‌క్కా ఓడించేస్తారా…!

రాజ‌కీయాల్లో వ్యూహాలు కామ‌న్‌. ఎత్తులు వేసేవారికి పై ఎత్తులు వేయ‌డ‌మే ఇప్పుడున్న‌రాజ‌కీయం. ఎదుటి పార్టీని ఎంత‌గా కుంగ‌దీస్తే.,. తాము అంత‌గా పైకి ఎదుగుతామ‌ని.. నాయ‌కులు.. పార్టీలు కూడా భావిస్తున్నా యి. ఈ క్ర‌మంలోనే రాజ‌కీయంగా ఏపీ ఎప్ప‌టిక‌ప్పుడు అట్టుడుకుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో అధికార పార్టీ టీడీపీని గ‌ద్దె దింపే క్ర‌మంలో వైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి.. విజ‌యం దక్కించుకుంది. ఇప్పుడు టీడీపీ కూడా అదే ప‌నిచేస్తోంది. అయితే.. ఈ క్ర‌మంలో వైసీపీ అనుస‌రిస్తున్న తాజా వ్యూహం.. ఆ పార్టీకి […]