ఓటీటీ లో తలైవి సినిమా.. రిలీజ్ ఎప్పుడో తెలుసా?

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన తలైవి సినిమా సెప్టెంబర్ 10న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అలాగే విమర్శకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో జాతీయ అవార్డ్ విజేత కంగనా నటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఈమె నటన కు ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సినిమాకు దర్శకుడు ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. […]