కాంగ్రెస్ లో కన్ఫ్యూజన్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పార్టీ బాధ్యతలు స్వీకరించిన తరువాత పార్టీలో ఊహించని మార్పులు వస్తాయని.. జనాల్లో పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని అంచనా వేసిన అధిష్టానానికి నిరాశే ఎదురైంది. దుబ్బాక, నాగార్జునసాగర్, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోల్తా పడింది. ఇక హుజూరాబాద్ లో అయితే దారుణం.. కేవలం 3వేల ఓట్లతో సరిపెట్టుకుంది. పార్టీ హైకమాండ్ హుజూరాబాద్ విషయంలో తలంటింది కూడా. ఈ నేపథ్యంలో […]

పోటీచేద్దామా? వద్దా? ఏం చేద్దామంటారు?

కాంగ్రెస్ పార్టీ.. వందేళ్ల ఘన చరిత్రగల అతి పెద్ద రాజకీయ పార్టీ.. స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖంగా పాల్గొన్న పార్టీ..అనేక సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన పార్టీ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ.. ఇవీ కాంగ్రెస్ పార్టీ గురించి క్లుప్తంగా చెప్పదగ్గవి.. ఈ విషయాలన్నీ ఇపుడు ఎందుకంటే.. ఇంత ఘన చరిత్రగల పార్టీ ఇపుడు తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలా, వద్దా అని మల్లగుల్లాలు పడుతోంది. ఎందుకంటే మొన్ననే జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో […]

రేవంత్ కామెంట్స్ పై ఇద్దరూ మౌనం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముందునుంచీ అంటే పార్టీ పగ్గాలు చేపట్టినప్పటినుంచీ అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరుగుతూనే.. కేంద్రం పెద్దలను కూడా టార్గెట్ చేస్తున్నారు. అయితే.. రేవంత్ మాటలకు, సవాళ్లకు ఇటు కేసీఆర్ సర్కారు కానీ, అటు బీజేపీ కానీ సమాధానం ఇవ్వడం లేదు. హైదరాబాదు శివారులోని కొంపెల్లిలో జరిగిన పార్టీ శిక్షణ కార్యక్రమంలో రేవంత్ ఇరు పార్టీల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో అనేక […]

మల్లన్నను రామన్న సమర్థిస్తున్నట్లుందే..!

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి వాడిన పదజాలాన్ని మం‍త్రి, టీ కేటీఆర్‌ సమర్థిస్తున్నారా అని ప్రశ్నిస్తే అవుననే చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. మంత్రి కేటీఆర్‌ గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డిని నేరుగా సమర్థించకుండా దాదాపు సమర్థిస్తున్నట్లే మాట్లాడారు. రెండు రోజుల క్రితం మంత్రి మల్లారెడ్డి తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌ రెడ్డిని పరుష పదజాలంతో దూషించారు. దీంతో కాం‍గ్రెస్‌ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన […]

’ఓటుకు నోటు‘ కేసు.. రేవంత్ కు కోర్టు సమన్లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ కేసీఆర్ కు నిద్రలేకుండా చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి శనివారం నాంపల్లి కోర్టు సమన్లు పంపింది. అక్టోబర్ 4న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. రేవంత్ తోపాటు ఎమ్మెల్యే సండ్ర వెంటక వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహ, మత్తయ్య జెరూసలేం, వేంక్రిష్ణ కీర్తన్ లకు సమన్లు పంపింది. రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలోఉన్నపుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేశారని కేసు నమోదైంది. ఈడీ నమోదు చేసిన ఈకేసు […]

ఓటుకు నోటు కేసులో అసలైన ట్విస్ట్..

ఓటుకు నోటు కేసు గుర్తందా.. 2015 నాటి ఈ కేసులో రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటినుంచీ ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అప్పటి టీడీపీ నేత, ఇప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులో తన పేరు తొలగించాలని, అసలు ఇది అవనీతి కేసు కాదని ఆయన వాదన. దీంతో సుప్రీం కోర్టు ఈ కేసుకు సంబంధించి […]

సభకు నేను రాలేను బాస్.. గోవా వెళుతున్నా..

ఇటీవల ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభ సక్సస్ కావడంతో ఇబ్రహీంపట్నంలో కూడా నిర్వహించాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. రేవంత్ రెడ్డి రూపంలో కేసీఆర్ ను విమర్శిస్తూ దూకుడు పెంచింది. అయితే రేవంత్ లీడర్షిప్ లో సభలకు హాజరయ్యేందుకు కాంగ్రెస్ పెద్దలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. హాజరుకాకుండా తమ అసంత్రుప్తిని వెళ్లగక్కుతూ ఉన్నారు. ఇపుడు ఆ పార్టీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకంగా రేవంత్ రెడ్డికే ఫోన్ […]

తెలంగాణ‌లో బ‌ద్ధ‌శ‌త్రువుతో టీటీడీపీ దోస్తీ ..!

కొత్త మిత్రుడి కోసం టీటీడీపీ వెదుకులాట ప్రారంభించింది. ప్ర‌స్తుతం బీజేపీతో మైత్రి కొన‌సాగుతున్నా.. ఎప్పుడు క‌మ‌ల‌నాథులు క‌టీఫ్ చెప్పేస్తారో తెలియ‌ని ప‌రిస్థితి. దీంతో త‌మ మ‌నుగ‌డ కాపాడుకునేందుకు స‌రికొత్త పొత్తుల కోసం చ‌ర్చ‌లు ప్రారంభించింది. ఇందులో భాగంగా.. శ‌త్రువుల‌తోనూ చేతులు క‌లిపేందుకు సిద్ధ‌మ‌ని సంకేతాలు ఇస్తోంది. అంతేగాక మ‌రో అడుగు ముందుకేసి చ‌ర్చ‌లు కూడా ప్రారంభించింద‌ని స‌మాచారం! శ‌త్రువుకు శ‌త్రువు మిత్రుడు అనే సూత్రాన్ని పాటించాల‌ని డిసైడ్ అయిపోయింది. అందుకే బ‌ద్ధ‌శ‌త్రువైన కాంగ్రెస్‌తో కూడా దోస్త్ మేరా […]

టీఆర్ఎస్ – టీడీపీ పొత్తు…తెరవెనక ఏం జరిగింది..!

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో చాలా మందికి టీడీపీనే రాజ‌కీయంగా లైఫ్ ఇచ్చింది. ఆ మాట‌కు వ‌స్తే సీఎం కేసీఆర్ రాజ‌కీయ ప్ర‌స్థానం సైతం టీడీపీతోనే స్టార్ట్ అయ్యింది. త‌ర్వాత కేసీఆర్ ప్ర‌త్యేక తెలంగాణ కోసం టీఆర్ఎస్‌ను స్థాపించి తెలంగాణ సాధించారు. ప్ర‌స్తుతం తెలంగాణ తొలి సీఎంగా కూడా కేసీఆర్ రికార్డుల‌కు ఎక్కారు. ఇదిలా ఉంటే రాష్ట్రం విడిపోయాక తెలంగాణ‌లో తెలుగుదేశం రోజు రోజుకు అవ‌సాన ద‌శ‌కు చేరుకుంటోంది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి […]