రేవంత్ పాదయాత్ర..సీనియర్లు బ్రేక్ వేస్తారా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి రోజురోజుకూ దిగజారిపోతున్న విషయం తెలిసిందే. బలంగా ఉన్న పార్టీ కాస్త అంతర్గత విభేదాలు వల్ల దెబ్బతింది. ఇటీవల పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. రేవంత్ వర్సెస్ సీనియర్లు అన్నట్లు పోరు నడిచింది. పార్టీ పదవుల పంపకాల విషయంలో రచ్చ నడిచింది. దీంతో దిగ్విజయ్ సింగ్ వచ్చి పార్టీలోని విభేదాలని తగ్గించడానికి చూశారు. దిగ్విజయ్ వచ్చాక..కాస్త పార్టీలో పరిస్తితులు సద్దుమణిగాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడమే […]

టీపీసీసీ మార్పు..రేవంత్‌కు ఎసరు..దిగ్విజయ్ తేల్చేశారు.!

ఎప్పుడైతే రేవంత్ రెడ్డి టి‌పి‌సి‌సి అధ్యక్షుడు అయ్యారో అప్పటినుంచి…కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రత్యర్ధులపై ఫైట్ చేయాల్సిన నేతలు..సొంత పార్టీలోని నేతలపై ఫైట్ చేయడం, విమర్శలు చేయడం చేస్తున్నారు. కాంగ్రెస్ లో రేవంత్ వర్గం వర్సెస్ సీనియర్లు అన్నట్లు రాజకీయం మారిపోయింది. పైగా ఇటీవల పి‌సి‌సి పదవుల పంపకాల విషయంలో పెద్ద రచ్చ నడిచింది. సీనియర్లని పట్టించుకోకుండా పదవులని భర్తీ చేశారని, టీడీపీ నుంచి వచ్చిన వారికే పదవులు ఎక్కువ ఇచ్చారని, […]

బాబు ఎఫెక్ట్: రేవంత్‌కు రిస్క్?

తెలంగాణ రాజకీయాల నుంచి చంద్రబాబు ఎప్పుడో వైదొలగిన విషయం తెలిసిందే..2018లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని చిత్తుగా ఓడిపోయిన తర్వాత చంద్రబాబు తెలంగాణలో రాజకీయం చేయడం మానేశారు. అలాగే ఏపీలో కూడా ఓటమి పాలై..ప్రతిపక్షానికి పరిమితం కావడంతో..పూర్తిగా ఏపీపైనే దృష్టి పెట్టి…బాబు పనిచేస్తున్నారు. అసలు తెలంగాణ జోలికి వెళ్ళడం లేదు. అయితే బాబు తెలంగాణ జోలికి వెళ్లకపోయినా సరే…ఏదొక సమయంలో తెలంగాణ రాజకీయాల్లో బాబు పేరు మాత్రం వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వెనుక చంద్రబాబు […]

రేవంత్ రూటే సెపరేట్…!

తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉపఎన్నిక అంశం…ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు…రేపో మాపో స్పీకర్ కు రాజీనామా అందించి…ఆమోదింపజేసుకుని, బీజేపీలో చేరనున్నారు..దీంతో మునుగోడు స్థానానికి ఉపఎన్నిక రానుంది. ఇక ఈ ఉపఎన్నికలో బీజేపీ తరుపున కోమటిరెడ్డి బరిలో దిగడం ఖాయం…అయితే మునుగోడులో బీజేపీకి ఏ మాత్రం బలం లేదు…కేవలం కోమటిరెడ్డి […]

లగడపాటి ఎంట్రీ ఇచ్చేస్తారా?

ఎందుకు తలుచుకున్నారో…ఏంటో గాని తెలంగాణ మంత్రి కేటీఆర్ సడన్ గా లగడపాటి రాజగోపాల్ పేరు తలుచుకున్నారు. తెలంగాణలో వస్తున్న సర్వేలపై కేటీఆర్ స్పందిస్తూ..ప్రతి సర్వేలోనూ తమ పార్టీదే విజయం అని రుజువైందని, ఇప్పుడు వచ్చినవన్నీ బీజేపీ, కాంగ్రెస్ అనుకూల సర్వేలు అని, వాటిల్లో కూడా టీఆర్ఎస్ గెలుస్తుందని చెబుతున్నారని అన్నారు. ఇదే క్రమంలో నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, 90 లక్షల ఓట్లు తగ్గవని, తగ్గితే రాజకీయాల్లో ఉండనని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఇక రేవంత్ […]

కాంగ్రెస్సోళ్లు.. అంతన్నారు.. ఇంతన్నారు.. మరి..

వందేళ్ల చరిత్రగల పార్టీ.. ఇదే ఆ పార్టీ నాయకులు ఎప్పుడూ చెప్పుకునే మాటలు.. అంతే.. కేవలం మాటలే.. వారి మాటలు మాత్రమే గొప్ప.. చేతలు అంతంతే.. ఈ పాటికే అర్థమై ఉంటుంది ఇదేం పార్టీనే.. అదే కాంగ్రెస్ పార్టీ.. పార్టీలో కార్యకర్తలు తక్కువ.. నాయకులు ఎక్కువ.. ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడతారో వారికే తెలియదు.. ఏమైనా అంటే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు. ఇక టీపీసీసీ చీఫ్ గా రేవంత్ వచ్చిన తరువాత పార్టీలో అంతర్గతంగా […]

ఢిల్లీకి వచ్చి సమాధానం చెప్పండి..

హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరిగాయి.. బీజేపీ గెలిచింది.. టీఆర్ఎస్ ఓడింది.. కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయిది. ఇది అందరి తెలిసిన విషయమే. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఈ ఫలితాలను సీరియస్ గా తీసుకొంది. టీ.కాంగ్రెస్ నాయకులపై ఫైరవుతోంది. ఎన్నికల్లో ఓడిపోవడం గురించి కాదు ఈ బాధ.. పార్టీకి వచ్చిన ఓట్ల గురించే అధిష్టానం తట్టుకోలేకపోతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెబుతున్న నాయకులను ఉప ఎన్నికల్లో ఇంత దారుణంగా ఎలా ఓడిపోయామని […]

బండి స్పీడ్ కు గండి పడిందా.. గండి కొట్టారా..

జేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్  స్పీడ్ కు పార్టీలో కళ్లెమేశారా? కిషన్ వర్సెస్ సంజయ్ పోరులో కిషన్  రెడ్డే పైచేయి సాధించారా? బండి సంజయ్ ప్రారంభించే యాత్ర అందుకే వాయిదా పడిందా? అనే ప్రశ్నలు ఇపుడు రాజకీయ వర్గాల్లో జోరందుకున్నాయి. కేసీఆర్ ను తిడుతూ మీడియాలో నానే రాష్ట్ర బీజేపీ చీఫ్ ఇపుడు సైలెంట్ కావడంతోపాటు ఈనెల 9న చేపట్టనున్న పాదయాత్ర 24కు వాయిదా వేసినట్లు పార్టీ తెలిపింది. పార్లమెంటు సమావేశాల కారణంగా యాత్ర వాయిదా […]

కాకపెంచిన ‘కోకాపేట’..రేవంత్ లాజికల్ పాలిటిక్స్

కోకాపేట భూముల వేలంలో టీఆర్‌ఎస్‌, బీజేపీలను  రేవంత్‌ రెడ్డి టార్గెట్ చేసి పొలిటికల్ హీట్ పెంచారు. గులాబి,కమలదళ అగ్రనేతలు వేచి చూద్దాం అనే భావనలో ఉన్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్‌ బాధ్యతలు స్వీకరించగానే చేస్తున్న లాజికల్‌ పాలిటిక్స్‌ ఇపుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ డవలప్‌మెంట్‌ అథారిటి (హెచ్‌ఎండీఏ) ఇటీవల నిర్వహించిన కోకాపేట భూముల వేలం వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో వేడిపుట్టించింది. 2 వేలకోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని హెచ్‌ఎండీఏ […]