సూపర్ స్టార్ రజినీకాంత్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ చుసిన అభిమానులకి కొద్దిసేపు గుండె ఆగినంత పనయింది.’రజనీకాంత్ హిట్ టు కిల్’ అనే పోస్ట్ రజిని ట్విట్టర్ అకౌంట్ లో రావడం తో ఒక్క సారిగా అభిమానులే కాదు యావత్ దేశం అంతా ఉలిక్కి పడింది. అయితే రజిని ట్విట్టర్ అకౌంట్ ని ఎవరో హాక్ చేసి ఆ ట్వీట్ ని పెట్టినట్టు రజిని కుమార్తె ఐశ్వర్య వివరణ ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.వెంటనే రజిని ట్విట్టర్ ఖాతాని […]
Tag: rajinikanth
సూపర్ స్టార్ అల్లుడు సూపరండీ
తమిళ సినీ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ కూడా అక్కడ స్టార్ హీరోనే. విలక్షణమైన నటతో విభిన్నమైన కథాంశాలతో రూపొందే చిత్రాలు చేస్తుంటాడు ధనుష్. కమర్షియల్ సినిమాల జోలికి వెళ్ళడు. కానీ తను చేసే సినిమాలతో కమర్షియల్ విజయాలు అందుకుంటుంటాడు. కథల ఎంపికలో మొదటి నుంచీ ధనుష్‌ది విలక్షణమైన తీరు. ఈ యంగ్ హీరో బాలీవుడ్‌లో కూడా నటించాడు. తెలుగులో కూడా స్ట్రెయిట్‌గా ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. నటన మాత్రమే కాదు, సేవా కార్యక్రమాల్లోనూ ధనుష్ […]
రివ్యూ రాయుళ్ళపై రజిని డాటర్ లైవ్ యాక్షన్!
సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ ‘కబాలి’ సూపర్ బజ్ సృష్టించింది. అయితే.. అంచనాలు అందుకోలేకపోయింది. రికార్డ్ లెవల్ వసూళ్లైతే వచ్చాయి గానీ మూవీపై నెగిటివ్ టాక్ వెళ్లాల్సినంత దూరం వెళ్లిపోయింది. అయితే.. 10 రోజుల వరకూ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయ్ కాబట్టి కలెక్షన్స్ కి ఢోకా లేదని అంటున్నారు. కానీ.. రివ్యూల విషయంలో రజినీ కుమార్తె సౌందర్య రియాక్టవుతున్న తీరుకు చాలామంది విస్తుపోతున్నారు. థియేటర్ లో మొదటి ఆటపడుతున్నపుడే లైవ్ రివ్యూలు రాయడం ఇప్పుడు సాధారణం. అయితే.. […]
ఎట్టకేలకు రజినీ మాట్లాడారు :మంచిది
సూపర్ స్టార్ రజినీకాంత్ రెండు నెలలుగా ఇండియాలో లేరు. అనారోగ్యంగా ఉండడంతో చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. దీంతో ఆయన ఆరోగ్యం గురించి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. మరోవైపు ‘కబాలి’ ఆడియో వేడుక సహా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎక్కడా సూపర్‌స్టార్ జాడలేదు. ఇంత హైప్ క్రియేట్ చేసిన సినిమా గురించి ఒక స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో అభిమానులు కొందరు అసంతృప్తికి లోనయ్యారు. వీటన్నింటికీ సమాధానం అన్నట్లుగా ఆయన స్పందించారు. రెండు రోజుల కిందటే అమెరికా […]
400 కోట్లు దేవుడెరుగు లాస్ లేదంతే!
భారీ ఫ్లాప్ తప్పదని ‘కబాలి’ గురించి ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ వేసిన అంచనాలు తల్లకిందులయ్యేలా ఉన్నాయి. ఈ సినిమాపై నెలకొన్న అంచనాల నేపథ్యంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ముందస్తుగా చేసుకున్న ఏర్పాట్లు, వారు అమలు పర్చిన వ్యూహాలతో సినిమా టాక్‌కి భిన్నంగా వసూళ్ళు వస్తున్నాయని సమాచారమ్. మామూలుగా తొలి మూడు రోజులకు అడ్వాన్స్ బుకింగ్ అయిపోతూ ఉంటుంది. ‘కబాలి’ దగ్గరకొచ్చేసరికి వారం రోజుల పైనే చాలా చోట్ల అడ్వాన్స్ బుకింగ్‌లు అయిపోయాయట. తద్వారా అందరూ రికవరీ అయిపోవచ్చని సమాచారమ్. […]
కబాలి కలెక్షన్స్:ఇదీ అసలు లెక్క
కబాలి రిలీజ్ అయింది.డివైడ్ టాక్ తో ఓ పక్క, డిజాస్టర్ టాక్ తో మరో పక్క సినిమా నడుస్తోంది.అయితే బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది కబాలి అని చెప్పుకొస్తున్న తమిళ తంబీలు కలెక్షన్స్ విషయంలో తలా ఓ నెంబర్ చేప్తూ గందరగోళం క్రియేట్ చేస్తున్నారు.సినిమా కి ఇంత డిజాస్టర్ టాక్ వచ్చినా ఈ లెక్కలేంటా అని సగటు ప్రేక్షకుడు ముక్కున వేలేసుకుంటున్నారు. మొదటి రోజు 100 కోట్లని నిర్మాత కలైపులి థాను మొదట ప్రకటించాడు.ఆయనే ఆ […]
1st డే తమిళ్ 100 కోట్లు మొత్తం 250 కోట్లా?
రజినీకాంత్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే బ్రహ్మాండంగా జరిగిన మాట వాస్తవమే.రిలీజ్ కి ముందు ఇంతక ముందెన్నడూ ఏ సినిమాకి రాని హైప్ సూపర్ స్టార్ సినిమాకి వచ్చింది.ఇంకేముంది కలెక్షన్స్ పంట పండుతుందని అందరు ముందుగానే ఊహించారు. అయితే మొదిటి షో అయ్యే సరికే టాక్ బయటొచ్చేసింది.కొందరు డిజాస్టర్ అంటుంటే ఇంకొందరు పర్లేదని సరిపెడుతున్నారు తప్ప సినిమా సూపర్ అని అన్న నాధుడే లేదన్నది నిర్వివాదాంశం.ఇలాంటి తరుణం లో నిర్మాత చెప్తున్న కలెక్షన్ లెక్కలు కళ్ళు […]
ఒక్క రోజులో 100 కోట్లు కబాలి
వందకోట్ల కలెక్షన్ రావాలంటే కనీసం మూడు నుంచి ఐదు రోజులు పడుతుంది. కానీ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా ఆ ఫీట్ను ఒక్కటంటే ఒక్కరోజులోనే సాధించింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమా నిర్మాత కలైపులి ఎస్.థాను వెల్లడించారు. రాధికా ఆప్టే, ధన్సిక తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా సినిమా కలెక్షన్లు ఎంతో అధికారికంగా ఇంకా రావాల్సి ఉందని, కానీ మొదటిరోజు ఎంతలేదన్నా కనీసం రూ. 100 కోట్లు వస్తాయని ఆయన ధీమా […]
ఆ వెబ్ సైట్ కి కబాలి కూతురి వార్నింగ్
ప్రపంచమంతా కబాలి నామస్మరణతో గత 2-3 రోజులుగా మార్మోగిపోయింది.ఇక తమిళనాడు..చెన్నై నగరం లో అయితే ఇది పీక్స్.అభిమానులు రాత్రంతా వేచి..తమ ఆరాధ్య నటుడి సినిమాకోసం బారులు తీరారు.రజినీకి ఇది కొత్తేమి కాదు కానీ కబాలి కి వచ్చిన క్రేజ్ ఒక్క తమిళ్ లోనే కాదు మొత్తం ఇండియా లోనే వేరే ఏ సినిమాకు రాలేదనే చెప్పాలి.అది సూపర్ స్టార్ రజిని అంటే. అయితే సినిమా రిలీజ్ అవ్వడం డివైడ్ టాక్ రావడం చూస్తూనే వున్నాం మనందరం.అయితే సినిమా […]