రజనీకాంత్ లో అదే ఎనర్జీ చూస్తున్నాను.. కుష్బూ?

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం అన్నాత్త. ఇందులో రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథతో తెరకెక్కిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించింది. ఈ సినిమాలో సీనియర్ నటి కుష్బూ కూడా ఒక కీలక పాత్రలో నటించారు. ఈ సందర్భంగా ఈ సినిమా షూటింగ్ అనుభవాలతో పాటుగా రజనీకాంత్ గురించి ఆమె పలు వ్యాఖ్యలు చేశారు. గతంలో రజనీకాంత్ అరుణాచలం, అన్నామలై, పడయప్పా లాంటి సినిమాల్లో నటించినప్పుడు ఉన్న ఎనర్జీ,టెంపర్.. ఇప్పటికీ అలాగే ఉన్నాయి.

గత సినిమాలలో చూసిన ఎనర్జీని అన్నాత్తే సినిమా షూటింగ్లో కూడా నేను గమనించాను. ఇప్పటికీ అదే ఎనర్జీ తో ఉన్నాడు అని ఆమె తెలిపింది. నేను రజనీకాంత్ తో కలిసి ధర్మత్తిన్ తలైవన్, అన్నామలై,మన్నన్ సినిమాలలో నటించాను అని తెలిపింది. అప్పుడు షూటింగ్లకు కాస్త ఆలస్యంగా వస్తే ప్రతి ఒక్కరికి రజినీకాంత్ సారి చెప్పేవారు, ఇప్పుడు కూడా అదే విధంగానే నడుచుకుంటున్నారు అంటూ కుష్బూ తెలిపింది. అప్పటికీ ఇప్పటికీ అతనిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడం నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక అన్నదే సినిమాలో ఆమె పాత్ర వివరాలను మాత్రం వెల్లడించలేను. అందుకోసం నవంబర్ 4వ తేదీ వరకు ఈ సస్పెన్స్ కొనసాగాలి అంటూ ఆమె తెలిపింది.