సరిగ్గా తింటున్నావా అంటూ కొడుకును పరామర్శించిన షారుక్ ఖాన్?

బాలీవుడ్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో అరెస్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కొడుకును విడిపించేందుకు షారుక్ ఖాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏవి ఫలించినట్టుగా కనిపించడం లేదు. దీంతో షారుక్ ఖాన్ కుటుంబం తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ముంబై ఆర్థర్ రోడ్డు జైలుకి వెళ్లిన షారుక్ ఖాన్ ఆర్యన్ ఖాన్ ను కలిశాడు.

అక్కడ హర్యానా కాంతు 18 నిమిషాల వరకు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్యన్ ఖాన్ బాగోగుల గురించి అడిగినట్లు సమాచారం. సరిగ్గా తింటున్నావా.. అని షారుఖ్ ఖాన్ అడగ్గా జైలు లో భోజనం బాగా లేదని ఆర్యన్ ఖాన్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. కొడుకు కోసం ఇంటి నుంచి భోజనం పంపించ వచ్చా అని షారుక్ ఖాన్ జైలు అధికారులను అడగగా.. ఇందుకోసం కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వారు తెలిపినట్లు సమాచారం. ఆర్యన్ ఖాన్ ఆరోగ్యపరిస్థితిపై షారుక్ ఆందోళన చెందుతున్నారని సన్నిహితులు తెలిపారు.