నాగశౌర్య వరుడు కావలెను ట్రైలర్ అదుర్స్..?

నాగ శౌర్య హీరోగా, రీతు వర్మ హీరోహీరోయిన్లుగా.. వస్తున్న తాజా చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాకి డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు విడుదల కానుంది. హీరో నాగ శౌర్య చలో సినిమా కథ మంచి సక్సెస్ అందుకున్ననప్పటికి. ఆ తర్వాత అంతటి స్థాయి హిట్ సినిమాలు ఏవి నాగశౌర్య అందుకోలేదు.

తాజాగా వరుడు కావలెను సినిమా పోయినా భారీ ఆశలు పెట్టుకున్నట్లు గా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను బాగానే అలరించాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాగా.. ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. పెళ్లి చూపులు అంటే నచ్చని అమ్మాయి పాత్రలో రీతూవర్మ అద్భుతంగా నటించింది. ఇక ఈమె తల్లి పాత్రలో నదియా కూడా నటించింది.

ట్రైలర్ లో ఎంటర్టైన్మెంట్ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు యువతను మెచ్చేలా ట్రైలర్ ఉండడంతో ఈ సినిమాపై భారీ నమ్మకాన్ని పెట్టుకున్నారు ఈ సినిమా చిత్ర యూనిట్ సభ్యులు. ఇక ఈ సినిమాలో స్టైలిష్ లుక్ తో కనిపించబోతున్నాడు నాగశౌర్య. ఇక ఈ సినిమా ట్రైలర్ ను మీరు కూడా ఒక సారి చూడండి.