న‌య‌న్‌-విఘ్నేష్‌ల పెళ్లి తేదీ పిక్స్ చేసిన తిరుమల పండితులు..?!

సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్‌లు గ‌త కొన్నేళ్ల నుంచీ ప్రేమ‌లో మునిగి తేలుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లె నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట‌.. త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు కూడా ఎక్క‌బోతున్నారు.

Nayanthara and Vignesh Shivan engaged, confirms the lady superstar

అయితే న‌య‌న్ జాత‌కంలో కుజ దోషం ఉండ‌టం వ‌ల్ల.. ఆమె మొద‌ట చెట్టును పెళ్లాడి, ఆపై విఘ్నేష్‌ను వివాహం చేసుకోనుంద‌న్న వార్త‌ గ‌త రెండు రోజుల నుంచీ తెగ వైర‌ల్ అవుతోంది. ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందీ అన్న‌ది ప‌క్క‌న పెడితే.. న‌య‌న్‌-విఘ్నేష్‌ల పెళ్లి తేదీ ఫిక్సైంద‌ట‌.

Vignesh Shivan says 'saving money for marriage' with Nayanthara; here's 5 other things he's revealed about her

అయితే ఈ ఏడాది మాత్రం వీరి వివాహం ఉండబోదని తెలుస్తుంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఈ ప్రేమ జంట పెళ్లితో ఒక‌టి కాబోతోందని.. ఇటీవ‌లె తిరుమల తిరుపతికి సంబంధించిన పండితులు వీరి వివాహ తేదీని ఖ‌రారు చేశార‌ని తెలుస్తోంది. అయితే అది ఎప్పుడనేది మాత్రం కాస్త సస్పెన్స్ గానే ఉంది.