అలాంటి భార్య వస్తే.. చేతకాని వాడని అంటారు: నాగ శౌర్య

టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో నాగ శౌర్య తాజా చిత్రం `వరుడు కావలెను`. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో రీతువర్మ హీరోయిన్‌గా న‌టించ‌గా.. ముర‌ళీ శ‌ర్మ‌, న‌దియా, వెన్నెల కిశోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రం అక్టోబర్ 29న విడుదల కాబోతోంది.

Varudu Kaavalenu: Here's when the next song from the Naga Shaurya and Ritu Varma starrer will drop

ఈ నేప‌థ్యంలోనే నిన్న హైద‌రాబాద్‌లో ట్రైల‌ర్ ఈవెంట్ నిర్వ‌హించిన మేక‌ర్స్‌.. రానా ద‌గ్గుబాటి చేతుల మీదుగా వరుడు కావలెను ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేయించింది. అనంత‌రం ఈ ఈవెంట్‌లో నాగ శౌర్య తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో కూల్‌గా త‌న‌దైన శైలిలో సమాధానం ఇచ్చాడు.

Naga Shaurya: 5 upcoming projects of the actor to be excited for | The Times of India

ఈ నేప‌థ్యంలోనే ఓ అమ్మాయి.. వరుడు కావలెను ట్రైలర్ వీక్షించిన తరువాత హీరోయిన్ కారెక్టర్ చాలా టిపికల్‌గా అనిపించింది. అంద‌రినీ తెగ డామినేట్ చేస్తుంది. మ‌రి నిజంగానే మీ జీవితంలో మిమల్ని డామినేట్ చేసే భార్య వస్తే ఏం చేస్తారు? అని ప్ర‌శ్నించింది. అందుకు శౌర్య స్పందిస్తూ.. సర్దుకు పోతాను అని బదులిస్తాడు. `అంటే ప్రతీసారి మీరే తగ్గుతారా?` అని మళ్లీ ప్ర‌శ్నించ‌గా.. ప్రతీసారి తగ్గను అలా తగ్గితే చేతకాని వాడని అనుకుంటారు. సమయం వచ్చినప్పుడు తగ్గాలి అని నాగ శౌర్య బదులిచ్చాడు. దాంతో శౌర్య కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.