కర్నూలులో తమ హవా మళ్లీ కొనసాగించేందుకు కేఈ సోదరులు తహతహలాడుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా పూర్వ వైభవం సంపాదించాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. అందుకు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదపడం ప్రారంభించారు. తమ బలాన్ని, బలగాన్ని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడానికి సన్మాన కార్యక్రమాన్ని వేదికగా మలుచుకున్నారు. ఈ సందర్భంగా తమ కుటుంబం ఎప్పుడూ టీడీపీకి విధేయతను ప్రకటించిందని, వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. ఇప్పుడు దీని వెను […]
Tag: Politics
ఎమ్మెల్యే బరిలో సీఎం.రమేశ్….ఆ నియోజకవర్గంపై కన్ను..!
రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారా ? ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన మరోసారి రాజ్యసభకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదా ? ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రమేశ్ ఇప్పటికే ఓ సేఫ్ నియోజకవర్గం కూడా చూసేసుకున్నారా ? అంటే కడప జిల్లా రాజకీయాల్లో అవుననే ఆన్సరే వినిపిస్తోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ముద్ర ఉన్న సీఎం.రమేశ్‌కు ఇటీవల ఆయన వద్ద ప్రయారిటీ తగ్గుతూ వస్తోంది. ఆయన రాజ్యసభ […]
రజనీ పొలిటికల్ ఎంట్రీకి వాళ్ల బ్రేకులు..!
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం ముందుకు మూడు అడుగులు, వెనక్కు రెండడుగులుగా సాగుతోంది. నిన్నటి వరకు రజనీ కొత్త పార్టీ పెడతారా ? లేదా ఏదైనా పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా ? అన్న మీమాంస ఉండగానే ఆయన కొత్త పార్టీయే పెడతారంటూ వార్తలు వచ్చాయి. రజనీ పదే పదే అభిమాన సంఘాలతో మీట్ కావడం, వారు రజనీపై కొత్త పార్టీ పెట్టాలని ప్రెజర్ చేయడంతో రజనీ కొత్త పార్టీయే పెడతారని అందరూ అనుకున్నారు. […]
పవన్ దానినుంచి అయితే తప్పించుకున్నాడు…మరి రేపు
ఏపీలో వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పోటీకి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు కులాల లెక్కనే ఎక్కువుగా నడుస్తున్నాయి. ఈ ట్రెండ్ తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువుగా ఉంటుంది. ఏపీలో 2009లో ప్రజారాజ్యం పార్టీ ఎంట్రీ ఇవ్వడంతో కులాల ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. టీడీపీకి కమ్మ, బీసీ వర్గాలు, కాంగ్రెస్‌కు రెడ్డి, ఎస్సీ వర్గాలు, ప్రజారాజ్యానికి కాపు వర్గం ఎక్కువుగా మద్దతు ఇచ్చాయి. ఇక వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ […]
చంద్రబాబుకు, ఆ సీనియర్ ఎమ్మెల్సీకి పడట్లేదా..!
టీడీపీలో ఓ సీనియర్ ఎమ్మెల్సీకి, సీఎం చంద్రబాబుకు అస్సలు పడట్లేదా ? చంద్రబాబు తీరుపై విసిగిపోయిన సదరు సీనియర్ నేత రాజకీయాలను గుడ్ బై చెప్పేయాలన్న నిర్ణయానికి వచ్చారా ? అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. ఏపీ రాజకీయాల్లో గాలి ముద్దుకృష్ణమ నాయుడు అందరికి సుపరిచితుడే. గత ఎన్నికల్లో గాలి నగరి నుంచి పోటీ చేసి రోజా చేతిలో కేవలం 926 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత బాబు ఆయన సీనియారిటీని గుర్తించి ఎమ్మెల్సీ […]
దేవినేని ఉమా వదిన మృతిపై వైసీపీ సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమాపై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఉమా తన వదిన (మాజీ మంత్రి దేవినేని వెంకటరమణ భార్య)ను చంపేశాడని కృష్ణా జిల్లా జనాలు ఇప్పటకీ అనుకుంటారని వైసీపీ నేత జోగి రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఉమాను రమేశ్ ఉత్త మాటలు చెప్పే పిట్టల దొరగా కూడా అభివర్ణించారు. జోగి రమేశ్ గత ఎన్నికల్లో మైలవరం నుంచి ఉమా మీద పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఉమా గురించి మాట్లాడిన రమేశ్ […]
మూడు పార్టీల్లోను సెగలు రేపుతోన్న ఆ సీటు
ఏపీలో ఓ ఎంపీ సీటుకు జరుగుతోన్న రాజకీయం ఇప్పుడు యమా హాటుగా మారింది. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ, కొత్తగా పోటీ చేస్తోన్న జనసేన ఈ మూడు పార్టీల నుంచి ఆ ఎంపీ సీటుకు కీలకమైన అభ్యర్థులు రంగంలో ఉంటారన్న ప్రచారం ఇప్పుడు అక్కడ పొలిటికల్ వాతావారణాన్ని ఎన్నికలకు రెండేళ్ల ముందే హీటెక్కించేస్తోంది. ప్రస్తుతం అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్‌కు బదులుగా వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి టీడీపీ తరపున చంద్రబాబు కోడలు […]
నంద్యాలలో కాంగ్రెస్ టార్గెట్ ఎవరు?
విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ అస్తిత్వం కోసం పోరాడుతోంది. సరైన సమయంలో ఉనికి చాటాలని ప్రయత్నిస్తోంది. వీలైనంత వరకూ పోటీలో నిలిచి అధికార, ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీయాలని చూస్తోంది! ఇప్పుడు ఆ సమయం వచ్చిందని భావిస్తోంది. నంద్యాల ఎన్నికలను సరైన వేదికగా చేసుకోవాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం నంద్యాలలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ బరిలోనే నిలుస్తుండగా.. ఇప్పుడు పోటీలో మేము కూడా ఉన్నామని ప్రకటించింది. ఇదే ఇప్పుడు వైసీపీ, టీడీపీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. కాంగ్రెస్ గెలవకపోయినా.. […]
పాలకొల్లు మరో గరగపర్రు అవుతోందా..!
పశ్చిమగోదావరి జిల్లాలోని గరగపర్రు ప్రస్తుతం అట్టుడుకుతోంది. అక్కడ దళితవర్గాలకు చెందిన వారిని వెలివేశారన్న వార్తలతో ఆ గ్రామం పేరు ఇప్పుడు మీడియాలో మార్మోగుతోంది. గరగపర్రులో దళితులంతా ఉద్యమిస్తుంటే ఇప్పుడు అదే జిల్లాలోని పాలకొల్లు కేంద్రంగా బీసీలంతా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు యాంటీగా ఒక్కటవుతున్నారు. నియోజకవర్గంలో కొద్ది రోజులుగా జరుగుతోన్న పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని బీసీలతో పాటు కోనసీమలో బలహీనవర్గాల్లో బలమైన ఓ ప్రధాన సామాజికవర్గం మొత్తం నిమ్మలకు వ్యతిరేకంగా గళమెత్తుతోంది. నిమ్మల పాలకొల్లు నియోజకవర్గంలో […]