2019లో అధికారం చేపట్టాలని గట్టిగా నిర్ణయించుకున్న వైసీపీ అధినేత జగన్‌కు మరికొద్ది రోజుల్లోనే భారీ షాక్ తగలనుందని సమాచారం. రాజధాని ప్రాంతంలోని ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్‌బై చెప్పి బాబు పంచన చేరిపోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రిక కథనం వెలువరించింది. ఇదే నిజమైతే.. వైసీపీకి రాజధాని ప్రాంతంలో తీవ్రమైన షాక్ తప్పదని అంటున్నారు. వియంలో కివెళ్తే.. కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తాఫాలు ఇద్దరూ […]
Tag: Politics
రోజా నోటీ దూల మానుకోదా..!
వైసీపీ లేడీ ఫైర్ బ్రాండ్ రోజా మరో సారి నోరు పారేసుకున్నారు. ఏకంగా అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు లక్ష్యంగా ఆమె కామెంట్లు కుమ్మరించారు. స్పీకర్ పదవిని భ్రష్టు పట్టిస్తున్నారని విరుచుకుపడ్డారు. దీంతో సీరియస్ అయిన కోడెల మరోసారి రోజాకు నోటీసులు పంపించాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఏడాది పాటు సభల నుంచి సస్పెండ్ అయిన రోజాకి.. ఇప్పుడు మళ్లీ నోటీసులు అంటే.. మరో సారి మరింత గట్టి షాక్ తగలడమే అంటున్నారు విశ్లేషకులు. విషయంలోకి వెళ్తే.. […]
టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి, దందాల భాగోతం ఆగదా..!
అవినీతి సహించేది లేదు. భరించేది లేదు అని పదే పదే చెప్పుకొచ్చే టీడీపీలో నే ఇప్పుడు అవినీతి కంపు భారీ ఎత్తున కమ్మేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు అవినీతిని తుదముట్టిస్తానని ప్రకటిస్తూ ఉంటే.. ఆ పార్టీ కి చెందిన నేతలు . మాత్రం అవినీతికి ఒంటబట్టించుకోవడంలో ముందంజలో ఉన్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రావు, దీపక్ రెడ్డిలపై పోలీసులు కేసులు నమోదు చేయడం వారిని ప్రశ్నించడం తెలిసిందే. దీంతో టీడీపీ పరువు అప్పట్లోనే భారీగా […]
టీడీపీలో ఈ నలుగురికి ఎమ్మెల్యే సీటు
నియోజకవర్గాల పునర్విభజన చకచకా జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి ఈ ప్రక్రియ వేగం కానుందని కేంద్రం నుంచి వస్తోన్న వార్తలతో తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల్లో ఎక్కడా లేని ఉత్సాహం నెలకొంది. ఇదిలా ఉంటే ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన మీద అధికార టీడీపీ నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీ బలంగా ఉన్న జిల్లాల్లో పశ్చిమగోదావరి జిల్లా ఒకటి. ఈ జిల్లా నుంచి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు […]
నంద్యాలలో టీడీపీ ప్లస్‌లు – వైసీపీ ప్లస్‌లు ఇవే
ఏపీలో వచ్చే ఎన్నికలకు రెండేళ్లు టైం ఉండగా అప్పుడే ఎన్నికల ఫీవర్ స్టార్ట్ అయ్యింది. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక అధికార టీడీపీ, విపక్ష వైసీపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ గత ఎన్నికల్లో గెలిచిన భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి జంప్ అయ్యారు. దీంతో ఈ సీటు తమ సిట్టింగ్ అని వైసీపీ చెపుతుంటే, టీడీపీ లెక్క మాత్రం భూమా తమ పార్టీలోకి రావడంతో ఇది తమ సిట్టింగ్ సీటు అని […]
ఏపీ పాలిటిక్స్‌లో సినీ యుద్ధం
సౌత్ ఇండియా పాలిటిక్స్‌కు సినిమా వాళ్లకు చాలా అవినాభావ సంబంధం ఉంది. సినిమా పరిశ్రమలో స్టార్లుగా ఉన్నవారు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా సీఎంలు అయ్యారు. తమిళనాడులో ఎమ్జీఆర్, ఏపీలో ఎన్టీఆర్ అగ్రహీరోలుగా ఎదిగి తర్వాత రాజకీయ పార్టీలు పెట్టి ఏకంగా సీఎంలు అయ్యారు. తర్వాత ఎమ్జీఆర్ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన జయలలిత సీఎం అయ్యి తమిళనాడును శాసించారు. ఎమ్జీఆర్, ఎన్టీఆర్ తర్వాత హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చినా వీరి రేంజ్‌లో […]
పార్టీనే నమ్ముకున్న టీడీపీ సీనియర్లకు బాబు షాక్!
టీడీపీని నమ్ముకుని ఎన్నో త్యాగాలు చేసిన సీనియర్లకు చంద్రబాబు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. పార్టీలో ఎప్పటి నుంచో ఉండడంతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ల కోసం తమ సీట్లు వదులుకుని త్యాగాలు చేసిన వాళ్లకు చంద్రబాబు సింపుల్‌గా కార్పొరేషన్ పదవులతో సరిపెట్టేశారు. తాజాగా రాష్ట్రంలో ఎనిమిది కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆహార భద్రత కమిషన్‌కు చైర్మన్‌గా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జె.ఆర్.పుష్పరాజ్‌ను నియమించాలని […]
జనసేన టాపిక్‌లో పవన్ కళ్యాణ్ సీరియస్
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అందరితోను చాలా కలుపుగోలుగా ఉండడంతో పాటు అందరిని ఆదరిస్తారన్న సదభిప్రాయం ఆయనపై అందరికి ఉంది. పవన్ ఏ విషయంలోను ఎవ్వరిని నొప్పించకుండా ఉంటారు. అయితే అలాంటి పవన్‌కు ఓ వ్యక్తి చాలా కోపం తెప్పించడంతో పాటు పవన్ ఆగ్రహానికి గురయ్యాడని తెలుస్తోంది. పవన్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ గ్యాప్‌లో ఓ […]
ఆ పంచాయితీలతో బాబు ఉక్కిరిబిక్కిరి
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కంచుకోట కడప గడపలో పసుపు జెండా రెపరెపలాడాలని సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చేసుకున్నారు. అంతేగాక మంత్రి పదవి కూడా కట్టబెట్టేశారు. ప్రస్తుతం ఈ మంత్రికి, ఆ ప్రాంతానికి చెందిన ఎంపీకి మధ్య విభేదాలు రగులుతున్నాయి. ఆది చేరికను వ్యతిరేకిస్తున్న రామసుబ్బారెడ్డి వర్గంతో ప్రస్తుతం అధిష్ఠానానికి ముచ్చెమటలు పడుతుంటే.. ఇప్పుడు మంత్రి-ఎంపీ వార్ గోరుచుట్టు మీద రోకలి […]