పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఇటు వరుస సినిమాలతోను, అటు పాలిటిక్స్‌లోను ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలో నటిస్తోన్న పవన్ ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఆర్టీ.నీసన్ డైరెక్షన్‌లో ఏఎం.రత్నం నిర్మించే సినిమాలోను, సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో మరో సినిమాలో పవన్ నటించనున్నాడు. ఇక సంతోష్ శ్రీనివాస్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే స్క్రిఫ్ట్ వర్క్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్‌ను […]
Tag: pawan kalyan
జగన్ పాదయాత్రకు పోటీగా పవన్ రథయాత్ర
2019 ఎన్నికలకు జనసేన అధినేత పవన్ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే జనసేన వచ్చే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో పోటీ చేస్తుందని పవన్ ప్రకటించాడు. ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన పవన్ ప్రజాక్షేత్రంలోకి దిగకపోవడంపై విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. పవన్ పార్టీ ఇంకా క్షేత్రస్థాయిలోనే బలోపేతం కాలేదని, మరి ఈ టైంలో పవన్ ఎన్నికలకు ఎలా వెళతాడు ? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక పవన్ ఎట్టకేలకు పార్ట్ టైం పొలిటిషీయన్ అన్న విమర్శలు రాకుండా ఫుల్ టైం […]
జనసేనాని అడుగు ముందుకా.. వెనక్కా?
ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం అని, ఇక ఏరాష్ట్రానికీ హోదా ఉండబోదని బీజేపీ స్పష్టంచేసింది. ఇక హోదాలో ఉన్న అన్ని అంశాలు ప్యాకేజీలో ఉన్నాయని, అదే మహా ప్రసాదమని టీడీపీ చెబుతోంది. అయినా ఒకపక్క ప్రతిపక్ష నేత జగన్, మరోపక్క జనసేనాని పవన్ కల్యాణ్.. హోదాపై ఉద్యమం చేస్తామని పదేపదేచెబుతూ వచ్చారు. అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జగన్.. హోదా అంశాన్నిపక్కనపెట్టేసినట్టేనని అంతా భావించారు. ఇప్పుడు ప్లీనరీ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే హోదాను భుజానకెత్తుకున్న […]
పవన్ కూడా రెడీ..!
ఏపీలో ప్రతిపక్ష నాయకులకు పాదయాత్రలు బాగానే కలిసొస్తున్నాయి. గతంలో దివంగత మాజీ సీఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి 2003లో పాదయాత్ర చేసి సీఎం అయ్యారు. ఇక పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు సైతం పాదయాత్ర చేసి గత ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు ఏపీ సీఎం అయ్యారు. మధ్యలో జగన్ జైలులో ఉన్నప్పుడు సోదరి షర్మిల పాదయాత్ర చేసినా ఆమె పాదయాత్రకు జనాల్లో అనుకున్నంత మైలేజ్ రాలేదు. ఇక ఇప్పుడు విపక్ష వైసీపీ అధినేత ప్లీనరీ సాక్షిగా తాను పాదయాత్రకు రెడీ […]
జనసేన టాపిక్‌లో పవన్ కళ్యాణ్ సీరియస్
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అందరితోను చాలా కలుపుగోలుగా ఉండడంతో పాటు అందరిని ఆదరిస్తారన్న సదభిప్రాయం ఆయనపై అందరికి ఉంది. పవన్ ఏ విషయంలోను ఎవ్వరిని నొప్పించకుండా ఉంటారు. అయితే అలాంటి పవన్‌కు ఓ వ్యక్తి చాలా కోపం తెప్పించడంతో పాటు పవన్ ఆగ్రహానికి గురయ్యాడని తెలుస్తోంది. పవన్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ గ్యాప్‌లో ఓ […]
జనసేన సర్వే నిజమా..? కామెడీనా…?
2019 ఎన్నికల్లో జనసేన 83 సీట్లు గెలుస్తుందంటూ జనసేన అభిమాని నిర్వహించిన సర్వేలో తేలడం ఇప్పుడు తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అటు వైసీపీ, ఇటు టీడీపీ హోరాహోరీగా పోటీ పడుతూ ఉన్న సమయంలో.. ఈ సర్వే రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. అయితే దీనిపై అటు రాజకీయ నాయకులు, ఇటు విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ సర్వే నిజమా? అబద్దమా? 83 సీట్లు ఎలా వస్తాయి? ఇంకా పార్టీ నిర్మాణమే పూర్తిగా లేని జనసేనకు […]
పవన్ మానియా ఎలా ఉందో మరోసారి స్పష్టమైంది
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ స్టామినా ఏంటో ఆయన తాజా సినిమా మరోసారి స్పష్టం చేస్తోంది. పవన్‌కు ఎన్ని ప్లాపులు వచ్చినా క్రేజ్ తగ్గలేదని నిరూపిస్తోంది. పవన్‌కు అత్తారింటికి దారేది సినిమా తర్వాత సరైన హిట్ లేదు. గోపాలా..గోపాలా యావరేజ్. సర్దార్ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు సినిమాలు రెండూ డిజాస్టర్లు అయ్యాయి. ఈ రెండు సినిమాల దెబ్బతో బయ్యర్లు భారీ నష్టాలు చూశారు. అయినా పవన్ తాజా సినిమాను భారీ రేట్లు పెట్టి అప్పుడే కొనేస్తుండడం ట్రేడ్ వర్గాలకు సైతం దిమ్మతిరిగే […]
పవన్ సర్వే ఏ పార్టీకి?
2019 ఏపీలో ఎన్నికల నామ సంవత్సరం! అయితే, రాష్ట్రంలోని వివిధ రాజకీయ పక్షాలకు మాత్రం రెండేళ్ల ముందుగానే ఎన్నికల వేడి పుట్టింది! ముఖ్యంగా ఎప్పుడెప్పుడు సీఎం సీటులో కూర్చుందామా అని ఎదురు చూస్తున్న వైసీపీ అధినేత జగన్.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనే థీమ్‌తో ఇటీవల ఆయన ఎన్నికల సలహాదారు ప్రశాంత్ కిశోర్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సర్వే చేయించారు. దీనిలో వైసీపీకి మెజారిటీ సీట్లు రాగా సెకండ్ ప్లేస్ టీడీపీ కొట్టేసింది. ఇక, ప్రశ్నిస్తానంటూ […]
జనసేనలో కన్నాకు ప్రత్యర్థి రెడీ..!
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి! విభజన తర్వాత రాజకీయాలకు అత్యంత కీలకంగా మారిన గుంటూరులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పోటీచేస్తానని ప్రకటించిన జనసేనాని పవన్ కల్యాణ్ ప్రభావం ఎన్నికల్లో ఎలా ఉంటుందో తెలియదుగానీ.. ప్రస్తుతం మాత్రం రాజకీయ పార్టీల నేతలకు మాత్రం కల్పతరువుగా మారబోతోంది. ఇప్పటికే ఆ పార్టీలో చేరేందుకు టీడీపీ, బీజేపీ, వైసీపీ నాయకులు వేచిచూస్తున్నారు. ఇదే సమయంలో గుంటూరు రాజకీయాల్లో ఊహించని పరిణామం ఎదురైంది. జిల్లాకు చెందిన పారిశ్రామిక […]