ఆ స్థానాల్లో ‘ఫ్యాన్’ బలం తగ్గట్లేదుగా!

రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి…ఇప్పటివరకు వైసీపీకి వన్ సైడ్ గా ఉండే పరిస్తితి ఉంది..కానీ నిదానంగా ఆ పరిస్తితి మారుతూ వస్తుంది…అనూహ్యంగా ప్రతిపక్ష టీడీపీ సైతం బలపడుతూ వస్తుంది…అటు కొన్ని ప్రాంతాల్లో జనసేన కూడా పుంజుకుంటుంది. ఇలాంటి పరిస్తితుల ఉన్న నేపథ్యంలో కొన్ని చోట్ల వైసీపీ బలం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంకా వైసీపీ స్ట్రాంగ్ గానే కనిపిస్తోంది…అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిన…కాస్త ప్రజా వ్యతిరేకత పెరిగిన సరే వైసీపీ బలం కొన్ని ప్రాంతాల్లో […]

కర్నూలు: టీజీకి బాబు హ్యాండ్?

కర్నూలు జిల్లా రాజకీయాల్లో టీజీ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు…ఎన్నో ఏళ్ల నుండి టీజీ వెంకటేష్ కర్నూలు జిల్లాలో రాజకీయాలు చేస్తూ వస్తున్నారు…మొదట్లో టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్ లో పనిచేసిన టీజీ…రాష్ట్ర విభజనతో టీడీపీలోకి వచ్చేశారు. ఇదే క్రమంలో 2014లో కర్నూలు సిటీలో పోటీ చేసి ఓడిపోయారు….ఇక ఆ తర్వాత చంద్రబాబు…టీజీని రాజ్యసభకు పంపించారు. అలాగే 2019 ఎన్నికల్లో టీజీ తనయుడు టీజీ భరత్ కు కర్నూలు సిటీ సీటు ఇచ్చారు. […]

కర్నూలు కోట మళ్ళీ వైసీపీదే!

ఉమ్మడి కర్నూలు  జిల్లా అంటే వైసీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…రెడ్డి సామాజికవర్గం హవా ఎక్కువగా ఉన్న ఈ జిల్లాల్లో వైసీపీ ఆధిక్యం కొనసాగుతుంది…గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీ సత్తా చాటుతూ వస్తుంది…అయితే ఈ సారి ఎన్నికల్లో కూడా కర్నూలులో వైసీపీ హవా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మళ్ళీ ఇక్కడ వైసీపీనే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని తాజా విశ్లేషణల్లో తెలుస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14 సీట్లు ఉన్న విషయం తెలిసిందే. […]

తమ్ముళ్ళ కుమ్ములాట..కంచుకోటలో కష్టాలు!

కర్నూలు జిల్లా అంటే వైసీపీకి కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…గత రెండు ఎన్నికల్లో కర్నూలులో వైసీపీ హవా నడిచింది…అయితే ఇలా వైసీపీ హవా ఉన్న కర్నూలు జిల్లాలో టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి…వైసీపీ రాకముందు.. ఆ నియోజకవర్గాల్లో టీడీపీ సత్తా చాటింది. వైసీపీ ఎంటర్ అయ్యాక జరిగిన 2014 ఎన్నికల్లో కూడా కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. అయితే 2019 ఎన్నికల్లో కంచుకోటల్లో కూడా టీడీపీ ఓడిపోయింది. ఇక ఇప్పటికీ ఆ […]

మూడు రాజధానులు బిల్లు ఉపసంహరణ.. వెనకడుగు కాదా.. మరో ముందడుగు కోసమేనా..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకున్నట్లు కోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది వెల్లడించారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ప్రభుత్వం నిజంగా మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకున్నది.. ఒకే ఒక్క రాజధాని కోసం కాదని.. బిల్లులో ఉన్న అడ్డంకులను తొలగించుకుని.. 3 రాజధానులు పై మరొక బిల్లు పెట్టే అవకాశం ఉందని […]

ఏ.పీ.సర్కార్ కి షాక్ ఇచ్చిన హైకోర్ట్ ..?

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చే తీర్పును వెల్లడించింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం మూడు రాజధానులు పెట్టాలా వద్దా అని నేపథ్యంలో కేసు నడుస్తుండగానే, దీని విచారణ పూర్తయ్యేవరకు ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేయడంతో ఈ వ్యాఖ్యలు కాస్త ఆసక్తికరంగా మారాయి. అంతేకాదు రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ […]

ఆస్ట్రేలియాలో వధూవరులు.. క‌ర్నూల్‌లో పెళ్లి.. ట్విస్ట్ ఏంటంటే?

మాయ‌దారి క‌రోనా వైర‌స్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ చిత్ర విచిత్రాల‌న్నీ చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా ఒక విచిత్రమైన పెళ్లి తంతు బ‌య‌ట‌కు వ‌చ్చింది. క‌ర్నూలు జిల్లాల్లో ఇటీవ‌ల అంగ‌రంగ వైభ‌వంగా ఓ వివాహం జ‌రిగింది. అయితే ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.. కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రులు, పెళ్లి జ‌రిపించే పురోహితుడు, బాజాభజంత్రీలు మోగించేందుకు మేళగాళ్లు ఇలా అంద‌రూ ఉన్నారు. కానీ, వ‌ధూవ‌రులు మాత్రం లేరు. అయిన‌ప్ప‌టికీ.. వివాహం మాత్రం గ్రాండ్‌గా జ‌రిగింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాకు […]

విషాదం: భ‌ర్త‌ను భ‌య‌పెట్టాల‌నుకుంది..చివ‌ర‌కు లోకాన్నే విడిచింది..?

క‌ర్నూలు జిల్లాలో ఓ విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. భ‌ర్త‌ను భ‌య‌పెట్టాల‌నుకున్న భార్య‌.. చివ‌ర‌కు ఈ లోకాన్నే విడిచిపెట్టి కుటుంబ స‌భ్యుల‌కు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..కొలిమిగుండ్ల మండలంలోని టెలుం బెలుం శింగవరానికి చెందిన రఘుకు, నేలంపాడుకు చెందిన శివమ్మకు ప‌దేళ్ల కింద‌ట వివాహం జ‌రిగింది. ఈ దంప‌తుల‌కు ఏడు నెల‌ల క్రితం ఓ అమ్మాయి జ‌న్మించింది. అయితే గ‌త కొద్ది రోజుల నుంచి ర‌ఘుకు, శివ‌మ్మ‌కు మ‌ధ్య గొడ‌వులు జ‌రుగుతున్నాయి. గురువారం కూడా […]

నంద్యాల ఉప ఎన్నిక వేళ వైసీపీకి దిమ్మ‌తిరిగే షాక్

నంద్యాల ఉప ఎన్నిక వేళ వైసీపీకి దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింది. నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి టీడీపీలో చేరారు. బుధ‌వారం ఆయ‌న త‌న కుమారులు, సోద‌రుల‌తో పాటు స‌చివాల‌యానికి వ‌చ్చి సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. క‌ర్నూలు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ఏరాసు ప్ర‌తాప‌రెడ్డి ఆయ‌న్ను చంద్ర‌బాబు వ‌ద్ద‌కు తీసుకువ‌చ్చారు. ఆ వెంట‌నే వాళ్లు చంద్ర‌బాబు స‌మ‌క్షంలోనే టీడీపీలో చేరారు. నంద్యాల ఉప ఎన్నిక మ‌రో వారం రోజుల్లో జ‌రుగుతోంది. రెండు […]