100 సంవ‌త్స‌రాలైనా హైద‌రాబాద్ గతి అంతేనా

తెలంగాణ ప్ర‌భుత్వం పేర్కొంటున్న విశ్వ‌న‌గ‌రం.. దృశ్యం.. చిన్న చినుకు ప‌డితే అప‌హాస్యం పాల‌వుతోంది. నిన్న మొన్న కురిసిన కుంభ వృష్టితో హైద‌రాబాద్ రూపు రేఖ‌లే మారిపోయాయి. ఎక్క‌డ చూసినా నీటి ప్ర‌వాహాలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇక‌, లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ నిండిపోయాయి. ఇళ్ల‌లోకి నీరు చేరింది. కొన్ని చోట్ల అపార్ట్‌మెంట్ల‌లోకి కూడా నీరు చేరింది. దీంతో అన్ని వ‌ర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయితే, అధికార టీఆర్ ఎస్ మాత్రం ఈ పాపం మాది కాద‌ని, గ‌త […]

టీఆర్ఎస్‌కు కొత్త శ‌త్రువు అదేనా!

తెలంగాణ బీజేపీ నేత‌ల్లో జోష్ కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోందా? అధికార టీఆర్ ఎస్ స‌హా సీఎం కేసీఆర్‌పై క‌మ‌ల దళం రెచ్చిపోతోందా? అమిత్ షా ప‌ర్య‌ట‌న వీరిలో కొత్త ర‌క్తం నింపిందా? ఇక‌, భ‌విష్య‌త్తులో తెలంగాణ‌లో క‌మ‌లం భారీ ఎత్తున గుబాళిస్తుందా? అంటే ఇప్ప‌టిక‌ప్పుడున్న ప‌రిణామాలు ఔన‌నే అనిపిస్తున్నాయి. రెండు రోజుల కింద‌ట వ‌రంగ‌ల్‌లో భారీ ఎత్తున నిర్వ‌హించిన బీజేపీ స‌భ‌లో క‌మ‌ల ద‌ళాధిప‌తి అమిత్ షా.. అటు కేసీఆర్ ఇటు టీఆర్ ఎస్‌ల‌పై ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. […]

కేసీఆర్ రియ‌ల్ మాయ‌లో ప‌డ్డారా

రియ‌ల్ ఎస్టేట్ మాయ అంతా ఇంతా కాదు. ఒక్క‌సారి హిట్ట‌య్యామా.. వెన‌క్కి తిరిగి చూసుకోన‌క్క‌ర్లేదు. అంతేకాదు, ఎక్క‌డైనా రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్ ప‌డిందంటే అక్క‌డ డెవ‌ల‌ప్‌మెంట్ జ‌రుగుతున్న‌ట్టుగా ప‌బ్లిక్ టాక్‌! ఇప్పుడు ఈ విష‌యంపై దృష్టి పెట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ఆశ్చ‌ర్యంగా అనిపించినా ఇది వాస్త‌వం. అధికారులతో ఇప్పుడు ఎక్క‌డ మీటింగ్ పెట్టినా.. రియ‌ల్ ఎస్టేట్ గురంచే కేసీఆర్ ఆరా తీస్తున్నార‌ని తెలుస్తోంది. దీనికి ఒక కార‌ణం ఉంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం మొత్తం రాష్ట్రంలోని […]

మోడీ పొగిడారు, అమిత్‌ షా విమర్శించారు.

రాజకీయం అంటేనే ఓ వింత. ప్రధాని హోదాలో నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ని ప్రశంసలతో ముంచెత్తుతారు. కెసియార్‌ కూడా ముఖ్యమంత్రి హోదాలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కొనియాడతారు. కానీ టిఆర్‌ఎస్‌ నాయకులు, బిజెపి నాయకులు మాత్రం పరస్పరం విమర్శించుకుంటుంటారు. నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడైనటువంటి అమిత్‌ షా తెలంగాణ పర్యటనలో కెసియార్‌ని విమర్శించారు. కెసియార్‌ ప్రభుత్వాన్ని ‘కంపెనీ’గా అభివర్ణించారాయన. పార్టీ ఫిరాయింపులను ప్రశ్నించడమే కాకుండా, తెలంగాణకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏమీ చేయలేదని కూడా విమర్శించడం జరిగింది. ఈ విమర్శలతో […]

పవన్ కెసిఆర్ కలవబోతున్నారోచ్

అవును జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యణ్, తెరాస అధ్యక్షుడు,తెలంగాణ ముఖ్యమంత్రి కలవబోతున్నారు.. అయితే రాజకీయంగా మాత్రం కాదు.. ఇద్దరి రాజకీయ దారులు వేరు..ఒకరేమో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యం గా పార్టీ ని స్థాపించి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రయితే..ఇంకొకరేమో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హక్కులకోసం పోరాడుతామంటున్న నాయకుడు. ఈ ఇద్దరి రాజకీయ లక్షాలు వేరైనా..ఇద్దరి కలయిక మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది.కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి కొడుకు నిఖిల్ కుమార్ హీరోగా నటించిన […]

నాలుక చీరేస్తారట, ఎందీ నిజమేనా?

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఇప్పుడంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారుగానీ, ఒకప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడే. ఆయన ఎమ్మెల్యేగా ఇప్పుడు పదవిలో ఉన్నదే తెలుగుదేశం పార్టీ కారణంగా. అది ఆయన మర్చిపోతే ఎలా? రాజకీయాల్లో పార్టీ మారడం ఫ్యాషన్‌ అయిపోయింది. పార్టీ మారాక, కెసియార్‌ – తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కి ‘దేవుడైపోయారు’. అంతకు ముందైతే, కెసియార్‌ని పట్టుకుని నానా విమర్శలు చేసేసిన ఘనుడే ఈ తలసాని శ్రీనివాస్‌యాదవ్‌గారు కూడా. తప్పదండీ, గారు అని సంబోధించకపోతే ఈయనగారికి ఒళ్ళు […]

కెసిఆర్ కి సవాల్ విసిరిన డీకే అరుణ

తెలంగాణ లో తెరాస గవర్నమెంట్ జిల్లాల విభజన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అశాస్త్రీయంగా ఉందని పేర్కొంటూ శనివారం ఇందిరాపార్క్ వద్ద రెండు రోజులు నిరాహార దీక్షను పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ చేపట్టారు. ఈ ధీక్షలో కాంగ్రెస్ పార్టీ నేత డీకే అరుణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ విసిరారు. తాను రేపు సాయంత్రం వరకు దీక్షలోనే ఉంటానని, జిల్లాల విభజనపై బహిరంగ చర్చకు రావాలని సవాల్లో డిమాండ్ చేశారు. ఈ […]

కవిత కౌంటర్ అదిరింది

నిజామాబాద్ ఎంపీ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి కుమార్తె కవిత ఈ మధ్య రాష్ట్ర రాజకీయాల్లో అంతా చురుగ్గా పాల్గొనడం లేదన్నది వాస్తవం.హస్తిన రాజకీయాలతోనే కవిత బిజీ బిజీ గా గడుపుతోంది.ఎప్పుడో అడపా దడపా తెలంగాణా జాగృతి తరపున ఇక్కడ కనిపిస్తోందంతే. దీనికి కారణం లేకపోలేదు.రాష్ట్రంలో తన తండ్రి ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్నారు.ప్రతిపక్షం అనేదే లేకుండా నిర్వీర్యం చేసేసారు.ఏదయినా చిన్న చితకా ఇబ్బందులుంటే అన్న కేటీర్,బావ హరీష్ రావు లు చక్కదిద్దేస్తున్నారు.ప్రభుత్వం పై వ్యతిరేకత బాగా ఎక్కువయినా..ప్రతి పక్షాలకు […]

కెసియార్‌ స్పీడ్‌కి విపక్షాలు బేజార్‌!

కొత్త జిల్లాలతో తెలంగాణ వైశాల్యమేమీ పెరగదు. కానీ 10 జిల్లాల తెలంగాణ ఇకపై 27 జిల్లాల తెలంగాణగా కొత్త రూపు సంతరించుకోనుంది. సెంటిమెంట్‌ పరంగా తెలంగాణ రాష్ట్ర సమితికి ఇదో అడ్వాంటేజ్‌. తెలంగాణ ఉద్యమంలోనే కెసియార్‌ జిల్లాల విభజన గురించి ప్రస్తావించారు. ఇప్పుడు ఆయన ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. సరిగ్గా సమయం చూసి, మహారాష్ట్రతో నీటి ఒప్పందాల అంశాన్ని కెసియార్‌ తెరపైకి తెచ్చారు. మ హారాష్ట్ర నీటి ఒప్పందాల గొడవలో విపక్షాలు ఉండగానే, జిల్లా విభజన వ్యవహారాన్ని […]