తెలంగాణ నేత‌లు త‌లో దిక్కుకు పోయారు

దాదాపు 60 ఏళ్ల క‌ల సాకారంలో భాగంగా.. తెలంగాణలో కొత్త‌ జిల్లాల ఏర్పాటు.. నేత‌ల‌కు కేరాఫ్ లేకుండా చేసింద‌ట‌! ఇంత‌కుముందు నేత‌ల పేర్లు చెబితే జిల్లాలు, లేదా జిల్లాల పేర్లు చెబితే నేత‌లు చ‌టుక్కున గుర్తొచ్చేవారు. కానీ ఇప్పుడు లెక్క‌కు మిక్కిలి జిల్లాల ఏర్పాటుతో నేత‌ల జిల్లాల స్వ‌రూపం మారిపోయింది. ఒక్కొక్క నేత ప‌రిధి ఒకటికి మించి రెండు మూడు జిల్లాల‌కు చేరిపోయింది దీంతో నేత‌లు త‌లో దిక్కుకు పోయిన‌ట్టు అనిపిస్తోంద‌ట‌! ఫ‌లితంగా ఇప్పుడు తాము ఏజిల్లాకు […]

కేసీఆర్ క‌ల నెర‌వేరేనా?

బంగారు తెలంగాణ సాకారం పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ చేప‌ట్టిన జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ పూర్త‌యి.. స‌ద‌రు కొత్త జిల్లాల ప్రారంభం కూడా జ‌రిగిపోయింది. విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా పెద్ద ఎత్తున జ‌రిగిన ఆయా జిల్లాల ఏర్పాటును మంత్రులు ప్రారంభించారు. దీంతో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం 21 కొత్త జిల్లాల‌తో మొత్తంగా 31 జిల్లాల తెలంగాణ‌గా ఆవిర్భ‌వించింది. దీంతో పాల‌న క్షేత్ర‌స్థాయికి వెళ్తుంద‌ని, పాల‌నా ఫ‌లాలు ప్ర‌తి ఒక్క‌రికీ చేరువ అవుతాయ‌ని, అవినీతి న‌శిస్తుంద‌ని, కొత్త […]

కేసీఆర్ మొక్కుల ఖ‌రీదు అన్ని కోట్లా!

తెలంగాణ సీఎం కేసీఆర్ మొక్కుల పేరుతో వివిధ దేవుళ్ల‌కు చేయిస్తున్న స్వ‌ర్ణా భ‌ర‌ణాల ఖ‌ర్చు ఖ‌జానాకు తిప్ప‌లు తెస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. రూ.ల‌క్ష‌ల‌లో అయితే, ఈ మొక్కులు తీర్చేందుకు ఎవ‌రికీ ఎలాంటి అభ్యంత‌రం ఉండ‌దు. కానీ, ఈ మొక్కులు దాదాపు 10 కోట్ల‌కు చేర‌డంతోనే(ఇది ఫ‌స్ట్ ఫేజ్ మాత్రమే. ఇంకా చాలా ఉంది) ప్ర‌జల్లోని ఓ వ‌ర్గం కేసీఆర్ వైఖ‌రిపై అసహ‌నంతో ఉంద‌ని తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటైతే.. అటు ఏపీ, ఇటు తెలంగాణ‌ల్లోని దేవ‌తా మూర్తుల‌కు బంగారు […]

కేసీఆర్ స్కెచ్ అదిరింది

తెలంగాణ‌ను బంగారు తెలంగాణ చేయాల‌న్న సీఎం కేసీఆర్ సంక‌ల్పం నెర‌వేర‌బోతోందా? కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణ భ‌విష్య‌త్తు మారిపోనుందా? కేంద్రం నుంచి భారీ ఎత్తున నిధులు వ‌ర‌ద‌లై పార‌నున్నాయా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. జిల్లాల ఏర్పాటు అంశంపై వెల్లువెత్తిన ఆందోళ‌న‌లు స‌ద్దుమ‌ణిగి 10 జిల్లాల తెలంగాణ ఇప్పుడు 31 జిల్లాల మ‌హా తెలంగాణ‌గా అవ‌త‌రించ‌బోతోంది. దీంతో జిల్లాలు, మండ‌లాలు, పంచాయ‌తీల రూపు రేఖ‌లు స‌మూలంగా మారిపోనున్నాయి. అదేస‌మ‌యంలో పాల‌న క్షేత్ర‌స్థాయికి చేరుకునేలా ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లూ […]

తెలంగాణ‌లో 34వ జిల్లా కోసం మ‌రో ఎమ్మెల్యే దీక్ష‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జిల్లాల ఏర్పాటు త‌ల‌నొప్పి ఇప్పుడిప్పుడే వ‌ద‌లేలాలేదు! ఏ టైం చూసుకుని ఆయ‌న జిల్లాల ప్ర‌క‌టన చేశారో కానీ, ఆయ‌న‌కు ఇంటా బ‌య‌టా కూడా పెద్ద ఎత్తున త‌ల‌నొప్పి ప్రారంభ‌మైంది. త‌మ‌కు జిల్లా కావాలంటే త‌మ‌కు కావాలంటూ అధికార పార్టీ టీఆర్ఎస్ స‌హా విప‌క్ష కాంగ్రెస్ నేత‌లు రోడ్ల మీద‌కి వ‌చ్చి పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. గ‌ద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ త‌న ప‌ద‌వికి రాజీనామా అస్త్రం సంధించారు. దీంతో దిగివ‌చ్చిన కేసీఆర్ […]

కేసీఆర్ ఫ‌స్ట్ టార్గెట్ టీఆర్ఎస్ నేత‌లే

తెలంగాణ‌లో కొద్దిరోజ‌ల క్రితం పోలీసుల ఎన్‌కౌంట‌ర్లో హ‌త‌మైన న‌యీముద్దీన్ చేసిన ఘాతుకాలు, అత‌డి అనుయాయుల అరాచ‌కాలు రోజుకొక‌టి చొప్పున ఇంకా వెలుగుచూస్తూనే ఉన్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఇత‌డికి సంబంధించిన కేసులు విచార‌ణ‌ను పోలీసులు మ‌రింత వేగ‌వంతం చేశారు.   తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా ఈ కేసువిచార‌ణ‌పై ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌రాలు సేక‌రిస్తున్నారు. దీనికి కార‌ణాలు లేక‌పోలేదు.  గ్యాంగ్ స్టర్ నయీం అరాచ‌కాల‌కు స‌హ‌క‌రించిన వాళ్ల‌లో ప‌లువురు అధికారుల‌తోపాటు, రాజ‌కీయ నేత‌ల సంఖ్యా ఎక్కువ‌గానే ఉంద‌న్న ఆరోప‌ణ‌లు […]

కేసీఆర్ మీద సొంత పార్టీ ఎమ్మెల్యే తిరుగుబాటు

కొత్త జిల్లాల ఏర్పాటు అంశం.. మొత్తం మీద తెలంగాణ సీఎం కేసీఆర్ కు శిరోభారంగా మారిన‌ట్టే క‌నిపిస్తోంది. ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌కు మైలేజీ రాకుండా చేయాల‌న్న ఉద్దేశంతో.. వారి డిమాండ్ల‌నూ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని కొత్త జిల్లాల సంఖ్య‌ను టీఆర్ ఎస్ అధినేత తాజాగా ఏకంగా 21కి చేర్చారు. అయినా ఈ అంశం రోజుకో వివాదాన్ని రాజేస్తూనే ఉంది. కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర‌  మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లను ప్ర‌త్యేక‌ జిల్లాగా చేయాలనే డిమాండ్‌తో  మొదలైన ఈ […]

కేసీఆర్‌కు కొత్త త‌ల‌నొప్పి…. 33 జిల్లాలు కావాలి

తెలంగాణ ను బంగారు తెలంగాణ చేయాల‌న్న టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ వ్యూహం కాస్తా.. తెలంగాణ‌ను జిల్లాల తెలంగాణ‌గా మారుస్తోందా ? అనిపిస్తోంది! వాస్త‌వానికి పాల‌న సౌల‌భ్యం కోసం, ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ కావ‌డం కోసం, కొత్త నాయ‌కులు, నేత‌లు వ‌స్తార‌ని భావించిన కేసీఆర్ ప్ర‌స్తుత‌మున్న ప‌ది జిల్లాల రాష్ట్రాన్ని 25 జిల్లాలు చేయాల‌ని నిర్ణ‌యించారు. వీటిలో ముఖ్యంగా పెద్ద పెద్ద జిల్లాలుగా ఉన్న‌వాటిపై ఆయ‌న తొలుత దృష్టి పెట్టారు. ఇక‌, ఆ త‌ర్వాత దీనికి […]

కేసీఆర్ ముందా వాళ్ల కుప్పిగంతులు

వ‌ర్త‌మాన రాజ‌కీయాల్లో తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ ఎస్ అధినేత కల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుది విభిన్న‌శైలి. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను.. ఎవ‌రూ ఊహించ‌లేని ఎత్తుల‌తో చిత్తు చేయ‌డ‌మే కాదు. ప‌రిపాల‌న‌లోనూ ఆయ‌న త‌న‌దైన మార్కును చూపేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. అది ఏ అంశ‌మైనా స‌రే… సాధ్యాసాధ్యాలకు ఆయ‌న నిఘంటువులో అర్థాలు వేరుగా ఉంటాయి.  ఆయ‌న పాల‌నా ప‌రంగా ఏ నిర్ణ‌యం తీసుకున్నా అందులో పార్టీకి భ‌విష్య‌త్తులో అనుకూలించే వ్యూహాలు అంత‌ర్లీనంగా దాగి ఉంటాయి. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్య‌మంత్రిగా పీఠాన్ని అధిష్టించిన త‌రువాత […]