ఆ రిపోర్టులు కేసీఆర్ వ్యూహంలో భాగమేనా?

ఎమ్మెల్యేల‌పై నిఘా వ‌ర్గాల‌తో స‌ర్వే నిర్వ‌హించి.. మార్కులు కేటాయిస్తుంటారు ఏపీ సీఎం చంద్ర‌బాబు! ఎప్పటిక‌ప్పుడు ఇలా ప్రోగ్రెస్ కార్డులు రూపొందించి.. త‌క్కువ మార్కులు వ‌చ్చిన ఎమ్మెల్యేల‌కు బ్రెయిన్ వాష్ చేస్తుంటారు! ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రెస్ కార్డుల‌నే త‌యారుచేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌! దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు నిద్ర క‌రువు అవుతోంద‌ట‌. ఇప్ప‌టికే రెండు సార్లు ఇటువంటి నివేదిక‌లు తెప్పించుకున్నారు! ముచ్చ‌టగా మూడోసారి కూడా రిపోర్ట్ త‌యారైంద‌ట‌! ఈ రిపోర్టుల్లో ఏముందోన‌నే టెన్ష‌న్ అందరిలోనూ పెరిగిపోయింద‌ట‌. టెన్ష‌న్ మాటెలా […]

బీజేపీతో టచ్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే … కెసిఆర్ పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారట.

టీఆర్ఎస్‌లో అస‌మ్మ‌తి గళం బ‌య‌ట‌ప‌డింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఇప్పుడిప్పుడే అసంతృప్తి సెగ‌లు త‌గులుతున్నాయి. కొంత కాలం నుంచీ మంత్రి ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్న ఎమ్మెల్యే శ్రీ‌నివాస్ గౌడ్.. ఇప్పుడు ఆ ఆశ‌లు గ‌ల్లంత‌వ‌డంతో ఇప్పుడు ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నారు. ఉద్య‌మ కారుల‌కు పార్టీలో ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌న్న అభిప్రాయం కొంత‌కాలం నుంచీ టీఆర్ఎస్‌లో వినిపిస్తోంది. ఇప్పుడు ఇది వాస్త‌వమేన‌నే అభిప్రాయంతో శ్రీ‌నివాస్ గౌడ్ ఉన్నార‌ట‌. ఇక పార్టీలో ఉండ‌టం అన‌వ‌స‌ర‌మ‌నే భావ‌న ఆయ‌న‌లో నిండిపోయింద‌ట‌. దీంతో ఇక పార్టీని […]

టీఆర్ఎస్ – టీడీపీ పొత్తు…తెరవెనక ఏం జరిగింది..!

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో చాలా మందికి టీడీపీనే రాజ‌కీయంగా లైఫ్ ఇచ్చింది. ఆ మాట‌కు వ‌స్తే సీఎం కేసీఆర్ రాజ‌కీయ ప్ర‌స్థానం సైతం టీడీపీతోనే స్టార్ట్ అయ్యింది. త‌ర్వాత కేసీఆర్ ప్ర‌త్యేక తెలంగాణ కోసం టీఆర్ఎస్‌ను స్థాపించి తెలంగాణ సాధించారు. ప్ర‌స్తుతం తెలంగాణ తొలి సీఎంగా కూడా కేసీఆర్ రికార్డుల‌కు ఎక్కారు. ఇదిలా ఉంటే రాష్ట్రం విడిపోయాక తెలంగాణ‌లో తెలుగుదేశం రోజు రోజుకు అవ‌సాన ద‌శ‌కు చేరుకుంటోంది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి […]

టీఆర్ఎస్ ఓట‌మి ఇంటి దొంగ‌ల ప‌నేనా?

వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న టీఆర్ఎస్ జైత్ర‌యాత్ర‌కు బ్రేక్ ప‌డింది. అది కూడా పార్టీకి బాగా ప‌ట్టున్న ఉత్త‌ర తెలంగాణ‌లో ఓట‌మి చ‌విచూసింది. ఇక త‌మ‌కు ఎదురు లేద‌నుకున్న గులాబీ దండుకు షాక్ త‌గిలింది. ఇప్ప‌టివ‌ర‌కూ గెలుపు గ‌ర్వంతో పైకెగిరిసిన టీఆర్ఎస్ నేత‌లు.. ఒక్క‌సారిగా పాతాళానికి ప‌డిపోయారు. ఊహించ‌ని ఈ ప‌రిణామంతో ఒక్క‌సారిగా టీఆర్ఎస్‌లో గుబులు మొద‌లైంది. వెంట‌నే పార్టీ హైక‌మాండ్ రంగంలోకి దిగింది. పోస్టుమార్టం చ‌ర్య‌లు ప్రారంభించింది. ఉత్త‌ర తెలంగాణ‌లో అంతా టీఆర్ఎస్ మ‌యం! వ‌రంగ‌ల్ నుంచి […]

టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే మ‌ధ్య ” మంత్రి ” చిచ్చు

టీఆర్ఎస్ పార్టీలోని విభేదాలు సీఎం కేసీఆర్‌కు త‌ల‌నొప్పిగా మారుతున్నాయి. మంత్రి ప‌ద‌వి విష‌యంలో తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యే మ‌ధ్య వివాదం రాజుకుంది. ఒక‌రిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకునే వ‌ర‌కూ వెళ్లింది. స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్లు విసురుకునే స్థాయికి చేరుకుంది. చాలెంజ్‌లు చేసుకున్నారు కూడా! మీడియా ముఖంగా ఉద‌యం.. తీవ్రంగా విమ‌ర్శ‌లు చేసుకున్న వారే.. సాయంత్రం ఇద్ద‌రూ క‌లిసి ఒకే వేదిక‌ను పంచుకున్నారు. త‌మ మ‌ధ్య విభేదాలు లేవంటూనే మ‌రోసారి విమ‌ర్శించుకున్నారు. దీంతో ఆశ్చ‌ర్య పోవ‌డం టీఆర్ఎస్ నాయ‌కులు, […]

రుణ‌`మాఫీ`తో ఇద్ద‌రు చంద్రుల‌కు చెక్‌

తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయ‌డానికి బీజేపీ అస్త్రశ‌స్త్రాలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో భారీ విజ‌యం సాధించిన త‌ర్వాత‌.. ఆ రాష్ట్రంలో కొత్త‌గా ఏర్ప‌డే ప్ర‌భుత్వం రైతుల‌కు `రుణ‌మాఫీ` చేస్తుంద‌ని, ఆభారం కేంద్ర‌మే భ‌రిస్తుంద‌ని చేసిన‌ కేంద్ర‌మంత్రి ప‌క‌ట‌నతో.. ఇప్పుడు ఇద్ద‌రు చంద్రుల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. 2014 ఎన్నికల్లో రుణ‌మాఫీ నే ప్ర‌చారంగా చేసుకుని అటు చంద్ర‌బాబు, ఇటు కేసీఆర్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పుడు అదే అస్త్రాన్ని 2019 ఎన్నిక‌ల్లో ఉప‌యోగించే దిశ‌గా కేంద్రం అడుగులేస్తోంది. […]

కాంగ్రెస్ నాయ‌కులకు కేసీఆర్ ఝ‌ల‌క్‌

త‌న‌పై కాంగ్రెస్ చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు బ‌డ్జెట్ రూపంలో స‌మాధాన‌మిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్! త‌న వ్యూహాల‌కు తిరుగులేద‌ని, త‌న‌తో పెట్టుకుంటే ఎవ‌రైనా చిత్తు కావాల్సిందేన‌ని మ‌రోసారి రుజువుచేశారు. అంతేగాక కాంగ్రెస్‌ను మ‌ళ్లీ మాట్లాడ‌కుండా చేశారు. దీంతో ఆ పార్టీ నేత‌లు సందిగ్ధ స్థితిలో ప‌డిపోయారు! ఇప్ప‌టికే అన్ని వ‌ర్గాలపై ప‌ట్టు సాధించిన కేసీఆర్‌.. ఇప్పుడు ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో బీసీల‌కే పెద్ద పీటే వేశారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ బీసీల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని విమ‌ర్శిస్తున్న కాంగ్రెస్ నేత‌ల‌కు.. చెక్ చెప్పారు. […]

తెలంగాణ‌లో ప‌వ‌న్ బ‌లం ఎంత‌..?

2019 ఎన్నిక‌ల్లో రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తాన‌ని జ‌న‌సేన అధినేత, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌కటన‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి! ప్రజాస‌మస్య‌ల‌పై పోరాటం, బ‌హిరంగ స‌మావేశాలు వంటివి నిర్వ‌హించి.. ఏపీ ప్ర‌జ‌ల్లోకి జ‌న‌సేన‌ను తీసుకెళ్లాడు. మ‌రి తెలంగాణ‌లో ఇప్ప‌టివ‌ర‌కూ ఏ స‌మ‌స్య‌పైనా స్పందించ‌లేదు! తెలంగాణ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వ దృష్టికి తీసుకెళ్ల‌లేదు. అస‌లు జ‌న‌సేన ఉన‌కి తెలంగాణ‌లో అస‌లు లేనే లేదు. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో.. ఏధైర్యంతో ప‌వ‌న్ తెలంగాణ‌లో పోటీకి దిగుతాన‌ని ప్ర‌క‌టించాడు? ఆయ‌న బ‌ల‌మేంటి? […]

గ‌వ‌ర్న‌ర్‌కు కేసీఆర్ కాస్ట్‌లీ గిఫ్ట్‌..!

ఉమ్మ‌డి రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌, తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌ధ్య‌.. అవినాభావ సంబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు! ముఖ్యంగా తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత కేసీఆర్‌ను స‌రైన మార్గంలో గైడ్ చేస్తూ మార్గ‌ద‌ర్శిలా ఉన్నారు న‌ర‌సింహ‌న్‌!! అంతేగాక ఉమ్మ‌డి రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్నా.. కేవ‌లం తెలంగాణ‌కు మాత్ర‌మే ల‌బ్ధి చేకూరేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే అప‌వాదునూ మూట‌గ‌ట్టుకున్నారు. అయితే త‌న‌కు ఎంత‌గానో అండ‌గా నిలిచిన న‌ర‌సింహ‌న్‌కు ఇప్పుడు కేసీఆర్ అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. గ‌వ‌ర్న‌ర్ ప‌దవీకాలం […]