బాబు ప్లాన్‌కి ఆ ముగ్గురూ బ‌లే!!

పాలిటిక్స్‌లో ఆరితేరిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబు తిరిగి 2019లోనూ ఏపీలో అధికారంలోకి రావాల‌ని భావిస్తుండ‌డం తెలిసిందే. అయితే, భావ‌న ఉంటే స‌రిపోతుందా? దానికి త‌గిన ప్ర‌య‌త్నం ఉండాలి క‌దా?! అనేవాళ్లు చాలా మందే ఉంటారు. ఈ విష‌యంలో బాబుకు ఎవ‌రూ స‌ల‌హాలు ఇవ్వ‌క్క‌ర్లేదు! 2019 ఎన్నిక‌ల‌పై ఇప్ప‌టి నుంచే ప‌క్కా ప్లాన్‌తో ఉన్న బాబు.. దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నారు. 2019 నాటికి రాష్ట్రంలో ఎవ‌రు క్రియాశీల‌కంగా మార‌తారో? ఎవ‌రి వ‌ల్ల త‌న ఉనికికి […]

నాగార్జున పొలిటిక‌ల్ ఎంట్రీ..!

అక్కినేని నాగార్జున. ప‌రిచ‌యం అక్క‌ర్లేని ఫేస్‌. ఇప్ప‌టి వ‌ర‌కు మూవీలు, స్టార్ షోల‌తో తెలుగు వారికి ద‌గ్గ‌రైన ఈ చిన్నినాయ‌న‌.. ఇప్పుడు పొలిటిక‌ల్‌గా కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న‌ట్టు.. పొలిటిక‌ల్ పండితులు అంచ‌నా వేస్తున్నారు. అదికూడా ఏపీలోని ఏకైక విప‌క్షం వైకాపాలోకి జ‌గ‌న్ చేరుతున్నార‌నే టాక్ బాగా వినిపిస్తోంది. వైకాపా అధ్య‌క్షుడు జ‌గ‌న్‌కి అత్యంత స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. గ‌తంలో జ‌గ‌న్ ఆస్తుల కేసులో జైల్లో ఉన్న‌ప్పుడు స్వ‌యంగా వెళ్లిన నాగ్‌.. జ‌గ‌న్‌ని ప‌రామ‌ర్శించి వ‌చ్చారు. […]

ఏపీలో వైకాపా, టీడీపీ కేసుల ఫైట్!

ఏపీలో అధికార టీడీపీ, విప‌క్ష వైకాపాల మ‌ధ్య వాతావ‌ర‌ణం మ‌రింత ముదురుతోంది. ఇప్ప‌టికే రెండు పార్టీల మ‌ధ్య ప‌చ్చ‌గడ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. ఇది ఇప్ప‌ట్లో స‌మ‌సిపోయేలా లేద‌ని తాజా ప‌రిస్థితులను బ‌ట్టి చూస్తే తెలిసిపోతోంది. రాజ‌ధాని నిర్మాణం స‌హా పోల‌వరం, ప‌ట్టిసీమల విష‌యంలో అధికార టీడీపీని వైకాపా పెద్ద ఎత్తున ఇరుకున పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే అనేక కేసులు కూడా న‌మోద‌య్యాయి. కొన్ని ఇప్ప‌టికీ కొన‌సాగుతున్నాయి. మ‌రోప‌క్క‌, నేరుగా సీఎం చంద్ర‌బాబునే […]

ఆయ‌న ఎంట్రీతో ఉత్కంఠ‌గా గుంటూరు పాలిటిక్స్‌

పాలిటిక్స్‌లో ఒక్కో నేత‌కు ఉంటే ప్ర‌జాద‌ర‌ణే డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇదే ఫార్ములాతో దూసుకుపోయేందుకు రెడీ అవుతున్నారు గుంటూరుకు చెందిన గుంటూరు జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌క్కెన మ‌ల్లికార్జున‌రావు. ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో మంచి ఆద‌ర‌ణ ఉంద‌నేది గుంటూరులో ఎవ‌రిని అడిగినా చెప్పేస్తారు. వాస్త‌వానికి గ‌త రెండు ఎన్నిక‌ల్లో ఆయ‌న టైం బాగోక పోవ‌డంతో ఎమ్మెల్యే కాలేక‌పోయారు. 2004లో వినుకొండ నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిచినా.. 2009లో మాత్రం ఆయ‌న టికెట్‌ను పొంద‌లేక పోయారు.  ఆ త‌ర్వాత 2014 […]

అమ్మ నెచ్చెలి.. శ‌శిక‌ళ సీఎం ప్లాన్ తెలిస్తే.. !

సీఎం సీటంటే.. ఎవ‌రికి చేదు చెప్పండి? పొలిటిక‌ల్ నేత‌లు ఎన్ని క‌ష్టాలు పడినా.. ఆ సీటు కోస‌మేక‌దా?! అలాంటి హాట్ సీటు కోసం త‌మిళ‌నాడులో దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత‌కు నెచ్చెలిగా ఉన్న శ‌శిక‌ళా న‌ట‌రాజ‌న్ ఎంతకు తెగించిందో తెలిస్తే.. ముక్కున వేలేసుకోవాల్సిందే. జ‌య‌కు స‌న్నిహితురాలిగా, పోయెస్ గార్డెన్‌కి కాప‌లాదారుగా వ్య‌వ‌హ‌రించిన శ‌శిక‌ళ‌పై ఇప్పుడు అనేక క‌థ‌నాలు వెలుగు చూస్తున్నాయి. అమ్మ‌తో స్నేహం వెనుక.. శ‌శిక‌ళ ఆమె కుటుంబం పెద్ద ప్లాన్‌తోనే ఉన్నార‌ని ఆ క‌థ‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. సెప్టెంబ‌రు […]

జగన్ మంచి జోష్ మీద ఉన్నారు.

వైకాపా అధినేత జ‌గ‌న్ ఇప్పుడు మంచి జోష్ మీదున్నారు. 2014లో కొంచెం తేడాతో సీఎం సీటు కోల్పోయాన‌న్న బాధ ఆయ‌న‌ను ఒక ప‌క్క వేధిస్తున్నా.. మ‌రోప‌క్క మాత్రం.. పొలిటిక‌ల్‌గా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న హ్యాపీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆక‌ర్ష్ పిలుపుతో వైకాపా నుంచి పెద్ద ఎత్తున వ‌ల‌స‌లు పెరిగిపోయాయి. క్యూక‌ట్టి మ‌రీ.. వైకాపా నేత‌లు, జిల్లా స్థాయి ఇంచార్జ్‌లు సైతం సైకిలెక్కేశారు. దీంతో జ‌గ‌న్‌కి […]

కాపుల కోసం జ‌గ‌న్ షాకింగ్ స్కెచ్‌

వ‌చ్చిన అవ‌కాశాన్ని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డం, రాని అవ‌కాశంలో త‌మ వంతు కోసం వెతుకులాడ‌డం పాలిటిక్స్‌లో నేత‌లు చేసే ప‌ని! ఇప్పుడు ఏపీలోనూ ఇదే త‌ర‌హా రాజకీయాలు న‌డుస్తున్నాయి. 2019లో  ఎట్టిప‌రిస్థితిలోనూ అధికారంలోకి రావాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్న ఏకైక విప‌క్ష నేత జ‌గ‌న్‌.. అప్ప‌టి ప‌రిస్థితుల‌ను తాను ఇప్ప‌టి నుంచే స‌ర్దు బాటు చేసుకునేందుకు య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ఈ క్ర‌మంలో అధికార టీడీపీ ఓటు బ్యాంకును చీల్చ‌డంపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టిన జ‌గ‌న్‌.. […]

జ‌గ‌న్‌తో పొత్తు కోసం ఆ పార్టీ త‌హ‌త‌హ‌

ఏంటి ఆశ్చ‌ర్యంగా ఉందా?! కాంగ్రెస్‌ని, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. నానా తిట్లు తిట్టి.. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్మించి.. ఆమెను ఎదిరించి.. కాంగ్రెస్‌కి హ్యాండిచ్చి.. సొంత కుంప‌టి షురూ చేసి.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అడ్ర‌స్ లేకుండా పోవ‌డానికి కార‌ణ‌మైన వైకాపా అధినేత జ‌గ‌న్‌తో పొత్తు కోసం కాంగ్రెస్ త‌హ‌త‌హ లాడుతోందంటే.. ఎవ‌రికైనా ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌దు! ఇప్ప‌టికిప్పుడున్న స‌మాచారం ప్ర‌కారం అయితే, జ‌గ‌న్‌తో పొత్తు మాత్ర‌మే కాదు… కాంగ్రెస్ భావి సీఎంగా కూడా జ‌గ‌న్‌ను ప్ర‌క‌టించ‌నుంద‌నే సంకేతాలు వెలువడుతున్నాయి. […]

ఆ ఎన్నిక‌ల్లో పెద్ద నోట్ల ఎఫెక్ట్ త‌ప్ప‌దా ?

ఎన్నిక‌ల‌న్నాక నోట్ల‌తోనే ప‌ని!! అంత‌లా మారిపోయాయి దేశంలో ఎన్నిక‌లు. నిజానికి చెప్పాలంటే.. మారిపోలేదు మ‌న నేత‌లే అలా మార్చేశార‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు! ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా నోట్లు కొట్టందే ఓట్టు రాల‌ని ప‌రిస్థితి. అవి ఢిల్లీస్థాయి ఎన్నిక‌లైనా, గ‌ల్లీ స్థాయి ఎన్నిక‌లైనా.. పోరులో గెల‌వాలంటే.. నోట్లు కుమ్మ‌రించాల్సిందే. ఇదంతా ఎందుకంటే.. త్వ‌ర‌లోనే రాష్ట్రంలో మునిసిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దాదాపు 11 మునిసిప‌ల్ స్థానాల‌కు, 5 కార్పొరేష‌న్ల‌కు ఎన్నిక‌లు ఖాయ‌మ‌ని తెలిసిపోయింది. ప్ర‌భుత్వం ఓట‌ర్ల జాబితా పంప‌గానే ఎన్నిక‌ల సంఘం […]