జగన్ కి సొంత జిల్లాలో మరోషాక్..

వైకాపా అధినేత జ‌గ‌న్ టైం అస్స‌లు ఏమీ బాగోలేద‌ని అనిపిస్తోంది. ఇప్ప‌టికే దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఆయ‌నను ఆయ‌న జ‌ట్టును వీడి చంద్ర‌బాబు సైకిల్ ఎక్కేశారు. దీంతో పార్టీలో కొంత బ‌ల‌హీన‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మ‌రోప‌క్క.. బ‌లంగా ఉన్న గొంతులు ఏవైనా పార్టీలోకి వ‌స్తాయోమ‌న‌ని జ‌గ‌న్ వెయ్యిక‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నాడు. ఈ నేప‌థ్యంలోనే త‌న సొంత జిల్లా క‌డ‌ప‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగ‌ల్రాయుడు వ్య‌వ‌హారం తెర‌మీద‌కి వ‌చ్చింది. ఈయ‌న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయిన‌ప్ప‌టికీ.. నిజానికి […]

ఏపీ రాజ‌కీయాల్లో మూడు ముక్క‌లాట‌

అధికారం కోసం ఏపీలో ఈసారి మూడు ముక్కలాట జ‌ర‌గ‌నుంది. అనుభ‌వ‌జ్ఞుడిగా పేరున్న చంద్ర‌బాబుకు.. న‌వ్యాంధ్ర‌ను పునాదుల నిర్మించే అవ‌కాశాన్ని ఏపీ ప్ర‌జ‌లు అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. దీంతో ఆ అధికారాన్ని ఎలాగైనా నిలుపుకోవాల‌నే పట్టుద‌ల‌తో ఆయ‌న ఉన్నారు. హోరాహోరీగా జ‌రిగిన ఆ ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప తేడాతో అధికారం కోల్పోయిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని దృఢ నిశ్చ‌యంతో ఉన్నాడు. దీనికి తోడు జ‌న‌సేనాధిప‌తి ప‌వ‌న్ రంగంలోకి దిగబోతున్నాడు. గెలుపును శాసించేలా చేయ‌గ‌లగ‌డంతో ఎవ‌రికి […]

జ‌గ‌న్ క‌ట్ట‌డికి బాబు వ్యూహం ఇదేనా?!

పొలిటిక‌ల్‌గా ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే టీడీపీ, వైకాపాల మ‌ధ్య ఇప్పుడు హోదా రూపంలో మ‌రింత అగ్గి రాజుకుంది! ప్ర‌త్యేక హోదా కోసం జ‌గ‌న్ నేతృత్వంలో మొన్న త‌ల‌పెట్టిన శాంతి యుత ప్ర‌ద‌ర్శ‌న‌కు బాబు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌కుండా మొగ్గ‌లోనే తొక్కేసిన విష‌యం కొన్ని మీడియా ఛాన‌ళ్లు దాచి పెట్టినా.. సోష‌ల్ మీడియా ఎవ‌రి కొమ్మూ కాయ‌దు కాబ‌ట్టి.. దీని ద్వారా అంద‌రికీ అర్ధ‌మైపోయింది. సో.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఓ మాదిరిగా ఉన్న జ‌గ‌న్ రేటింగ్ ఇప్పుడు […]

జ‌గ‌న్‌కు చిన్నాన్న షాక్‌

శాస‌న‌మండ‌లి ఎన్నిక‌లు జ‌రుగుతున్న త‌రుణంలో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌కు ఝ‌లక్ త‌గ‌ల‌బోతోంది. పార్టీ వ్య‌వ‌హారాల‌తో పాటు కుటుంబ క‌ల‌హాలు కూడా ఇప్పుడు జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పిగా మారాయి. ఇప్ప‌టికే ఒక చిన్నాన్న పార్టీలోకి తిరిగి వ‌స్తే.. మ‌రో చిన్నాన్న ఇప్పుడు పార్టీ నుంచి వెళిపోయేందుకు సిద్ధంగా ఉన్నార‌ట‌. కొంత‌కాలం నుంచి వైఎస్ కుటుంబంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌తో ఆయ‌న క‌ల‌త చెందార‌ట‌. దీంతో త‌న‌ కుటుంబంతో స‌హా జ‌గ‌న్‌కు దూర‌మ‌వ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. జగన్‌ సొంత చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి […]

జగన్,పవన్ మధ్యలో డీజీపీ

ప్రత్యేక హోదా మరో సారి రాజకీయ రంగు పులుముకుంటోంది.తమిళుల జల్లికట్టు స్ఫూర్తి తో ఆంధ్ర యువత కూడా ఈ నెల 26 న విశాఖ ఆర్ .కే బీచ్ లో శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.పిలుపునివ్వడం వరకు బాగానే వున్నా దానికి అటు జన సేన ఇటు వైసీపీ పార్టీ లు మద్దతు పలకడం తో సమస్యలు మొదలయ్యాయి. ఆంధ్ర యువత స్వచ్ఛందంగా నిరసనకు పిలుపునివ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం.అదీగాక ప్రజా స్వాత్మ్యం లో శాంతియుత నిరసన […]

జ‌గ‌న్ ద్రోహుల గుప్పెట్లో సాక్షి మీడియా

తెలుగు వారి మ‌న‌స్సాక్షి.. సాక్షి! అంటూ తెలుగు లోగిళ్ల‌లోకి ఉవ్వెత్తున దూసుకొచ్చిన సాక్షి దిన‌ప‌త్రిక ఓ సంచ‌ల‌నం! అప్ప‌టి వ‌ర‌కు ఉన్న మీడియా ఆధిప‌త్యానికి గండి కొడుతూ.. కేవ‌లం రూ.2కే దాదాపు 18 నుంచి 20 పేజీల‌తో స‌మ‌గ్ర స‌మాచారాన్ని అందించిన ప‌త్రిక అత్యంత స్వ‌ల్ప కాలంలోనే తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌సు దోచుకుని.. తెలుగు లోగిళ్ల‌కు ద‌గ్గ‌రైంది. వాస్త‌వానికి కాంగ్రెస్ అనుకూల ప‌త్రిక‌గా అరంగేట్రం చేసినా.. ఆ త‌ర్వాత వైఎస్ మ‌ర‌ణం, త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో […]

బాబు ప్లాన్‌తో జ‌గ‌న్‌కే మేలా..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు వైఖ‌రి ఇప్పుడు తీవ్ర వివాదాస్ప‌దం అవుతోంది. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో రైతులు అంద‌రూ త‌న‌కు స‌హ‌క‌రించార‌ని, దాదాపు 33 వేల ఎక‌రాల‌ను ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చార‌ని ప్ర‌తి చోటా చెప్పుకొనే చంద్ర‌బాబు.. ఇప్పుడు ఇదే విష‌యంలో ఆంక్ష‌లు విధిస్తున్నార‌నే టాక్ మొద‌లైంది. రైతులు త‌మ ఇష్ట‌ప్ర‌కారం కొంత మేర‌కు మాత్ర‌మే భూములు ఇచ్చార‌ని, మిగిలిన భూముల‌ను ప్ర‌భుత్వం బ‌లవంతంగా ఆక్రమించింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ప‌లువురు రైతులు ఇటీవ‌ల వైకాపా అధినేత […]

డీఎల్‌పై జ‌గ‌న్ మైండ్‌గేమ్ ?

సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలుపుతూ నాయ‌కులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేయ‌డం సాధార‌ణ‌మే! అయితే ఇప్పుడు క‌డ‌ప జిల్లాలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు స్థానికంగా రాజకీయ దుమారం రేపుతున్నాయి. శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు రాజ‌కీయాల్లో ఉండ‌రు అనే సూక్తిని నిజం చేసేలా క‌నిపిస్తోంది. వైఎస్‌ను, ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్‌ను శ‌త్రువులా భావించే మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డి ఫొటో వైసీపీ నాయ‌కులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో క‌నిపించ‌డం కొత్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌కు తెర‌తీస్తోంది. క‌డ‌ప గ‌డ‌ప‌లో రాజ‌కీయాలు రోజురోజుకీ ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. త‌న‌ […]

జ‌గ‌న్ రోల్‌లో ప‌వ‌న్ హిట్

`ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిప‌క్ష పాత్ర‌ను వైసీపీ స‌మ‌ర్థంగా నిర్వ‌హించ‌లేక‌పోతోంది`.. ఇది చాలా రోజుల నుంచి మంత్రుల నుంచి విశ్లేష‌కులంద‌రూ చెబుతున్న మాట‌. అయితే ఈ విమ‌ర్శ‌లు త‌ప్ప‌ని ఎప్పుడూ నిరూపించ‌లేక‌పోయారు ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌. అయితే ఇప్పుడు ప్ర‌తిప‌క్ష పాత్ర‌ను జ‌న‌సేనాని స‌మ‌ర్థంగా నిర్వ‌హిస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్ర‌జాస‌మ‌స్య‌పై పోరాటాలు చేస్తూ.. ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూ ఆ స‌మస్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో విజ‌యం సాధిస్తున్నారు. అలాగే ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కాన్ని పెంచుకుంటున్నారు. 2019 ఎన్నిక‌ల్లో పోటీకి ప‌క్కా ప్ర‌ణాళిక‌తో […]