చంద్ర‌బాబు మాట‌ల్లో పేద‌.. చేతల్లో రాజు

హంగులూ ఆర్భాటాల‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆమ‌డ దూరంలో ఉంటార‌నే విష‌యం ఆయ‌న మాట‌లు, దుస్తుల‌ను బ‌ట్టి తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఆయ‌న హైద‌రాబాద్‌లో కొత్త‌గా నిర్మించుకున్న ఇల్లు చూస్తే మాత్రం నోరెళ్ల బెట్టాల్సిందే. అత్యంత ఖ‌రీదైన ఫ‌ర్నీచ‌ర్‌, అత్యాధునిక హంగులతో విశాల‌మైన ప్రాంగ‌ణంలో.. క‌ట్టుకున్న ఈ అద్భుత‌మైన రాజ్‌మ‌హ‌ల్ గురించి రోజుకో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌స్తుంది. అదేంటంటే.. సినిమాల్లో చూసిన విధంగా.. కారుతో నేరుగా ఫ‌స్ట్ ఫ్లోర్‌లోకే వెళ్లిపోవ‌చ్చ‌ట‌. `నా చేతికి వాచీ ఉండ‌దు. […]

ప‌వ‌న్ నీ ప్ర‌శ్న‌ల్లో నిజాయితీ ఎక్క‌డ‌..!

ప్ర‌శ్నించేందుకే పార్టీ పెట్టాన‌ని చెప్పుకునే ప‌వ‌న్ సినిమాల వ‌ర‌కు ప‌వ‌ర్‌స్టార్ అయినా పొలిటికల్‌గా ఇంకా ఏ స్టారో చెప్ప‌లేని ప‌రిస్థితి. ప‌వ‌న్ నీతి, నిజాయితీ ఆయ‌న‌కు ప్ల‌స్ కావొచ్చేమో గాని, అవి పొలిటిక‌ల్‌గా సెకండ్ కేట‌గిరిలో ఉన్నాయి. కానీ పొలిటిక‌ల్‌గా ప‌వ‌న్ త‌న ప‌వ‌ర్ చూపిస్తాడ‌ని అంద‌రూ అనుకుంటుంటే ఆయ‌న చేస్తోన్న రాజ‌కీయం మాత్రం ఆయ‌న సినిమాల్లాగానే రొటీన్‌గా, రెగ్యుల‌ర్‌గా ఉంద‌న్న విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. ప‌వ‌న్ న్యూస్ పేప‌ర్ల‌ను, వార్త‌ల‌ను బాగానే ఫాలో అవుతాడు. ఆయ‌న‌కు […]

మరోసారి వైసీపీని వెంటాడుతున్న ఆపరేషన్ ఆక‌ర్ష్‌

రెండేళ్ల‌లో త‌మ అధినేత సీఎం ప‌గ్గాలు అందుకుంటాడ‌ని క‌ల‌లు కంటున్న‌ వైసీపీ నేత‌లకు టెన్ష‌న్ మొద‌లైంది. టీడీపీ ప‌ని అయిపోయింద‌ని, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రాజ‌న్య రాజ్యం వ‌స్తుంద‌ని క‌లలు కంటున్న కార్య‌క‌ర్త‌ల్లో క‌ల‌వరం మొద‌లైంది. వైసీపీ అధినేత జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని సీబీఐ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డంతో వైసీపీ నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. త‌మ నేత జైలుకు వెళితే.. ఏంట‌నే ప్ర‌శ్న‌లు, సందేహాలు అంద‌రి మెద‌డును తొలిచేస్తున్నాయి. త‌ర్వాత త‌మ భ‌విష్య‌త్తు ఏంట‌ని ఇప్ప‌టినుంచే […]

2019లో ఇద్దరు వైసీపీ సిట్టింగ్ ఎంపీలకు నో టిక్కెట్..!

ఏపీలో స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీ బ‌లంగా ఉన్న క‌డ‌ప‌-క‌ర్నూలు-నెల్లూరు జిల్లాల్లో ఆ పార్టీ అభ్య‌ర్థులు ఘోరంగా ఓడిపోయారు. దీంతో వైసీపీ అధినేత జ‌గ‌న్  ఈ మూడు జిల్లాల్లో కొంద‌రు పార్టీ నేత‌ల‌పై చాలా సీరియ‌స్‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే కీల‌క స్థానాల్లో ఉన్న వారికి సైతం 2019 ఎన్నిక‌ల సాక్షిగా షాక్ ఇవ్వ‌క త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. కడప జిల్లా కంచుకోటను టీడీపీ బద్ధలు కొట్టడంపై ఆగ్రహంగా ఉన్న వైసీపీ అధినేత జగన్ […]

వైసీపీలోకి మంచు ఫ్యామిలీ ఎంట్రీ..!ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌పై క‌న్ను..!

టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీకి స‌ప‌రేట్ క్రేజ్ ఉంది. విల‌క్ష‌ణ న‌టుడు మోహ‌న్‌బాబు రూటే ఓ స‌ప‌రేటుగా ఉంటుంది. మోహ‌న్‌బాబుకు ఇటు సినిమా రంగంతో పాటు అటు రాజ‌కీయ రంగంతోను ఎంతో అనుబంధం ఉంది. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీతో పాటు విప‌క్ష వైసీపీతోను ఆయ‌న‌కు చాలా ద‌గ్గ‌రి రిలేష‌న్ ఉంది. ఏపీ ప్ర‌స్తుతం సీఎం చంద్ర‌బాబు మోహ‌న్‌బాబుకు వ‌రుస‌కు మేన‌త్త కొడుకు అవుతాడు. ఇక విపక్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ అయితే అల్లుడు వ‌రుస అవుతాడు. గ‌తంలో […]

సమయం లేదు మిత్రమా … కడపలో ఇక రణమే

స్థానిక మండలి ఎన్నికలు దగ్గరపడుతున్న దృష్ట్యా పార్టీ గెలుపుకి అవసరమైన ఓటర్లని ఒక చోటకి చేర్చండి ,నాయకులంతా అప్రమత్తం అవండి అని పార్టీ నాయకులకి ,పార్టీ శ్రేణుకులకు టీడీపీ అధ్యక్షులు మరియు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశించారు .దీనితో పార్టీ నియోజవర్గ ఇంచార్జిలు మరియు నాయకులూ ఓటర్లను శిబిరాలకు తరలిస్తూ ఉండటంతోపాటు ,మిగిలి ఉన్నవారిని కూడా తరలిస్తున్నారు .దీంతో శిబిర రాజకీయాల సందడి మరింత పెరిగింది. పోరు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఇరు పార్టీలు ఎవరి వ్యూహ […]

బెజవాడ వైసీపీ రాజకీయం రసవత్తరం

స‌మైక్యాంధ్ర‌లోనే బెజ‌వాడ రాజ‌కీయం అంటే మ‌హారంజుగా ఉండేది. బెజ‌వాడ పాలిటిక్స్‌లో ఏం జ‌రుగుతుందా ? అని అంద‌రూ ఎంతో ఆసక్తితో ఎదురు చూసేవారు. రెండు ఫ్యామిలీల మ‌ధ్య వార్ బెజ‌వాడ పాలిటిక్స్‌ను చాలా ఇంట్ర‌స్టింగ్‌గా మార్చేశాయి. ఇదిలా ఉంటే అదే బెజ‌వాడ‌లో విప‌క్ష వైసీపీ పాలిటిక్స్ ఇప్పుడు మ‌హా ఇంట్ర‌స్టింగ్‌గా మారాయి. ఏపీ రాజ‌కీయాల‌కు కేంద్ర‌బిందువైన విజ‌య‌వాడ‌లో ప‌ట్టుకోసం వైసీపీ అధినేత జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత నుంచి చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డ […]

`ఆప‌రేష‌న్ జ‌గ‌న్` అధికార పార్టీ వ్యూహం స‌క్సెస్‌

అనుకున్న‌దే అయింది! క‌థ అడ్డం తిరిగింది! అస‌లు విష‌యం ప‌క్క‌దారి ప‌ట్టింది! ఇప్పుడే కాదు ప్ర‌తిసారీ అలానే జ‌రుగుతోంది! ప్ర‌తిప‌క్ష నాయకుడి వ్యూహం బెడిసికొట్టింది.. విష‌యం పైకి రాకుండా ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిని కార్న‌ర్ చేయ‌డంలో అధికార ప‌క్షం మ‌రోసారి విజ‌యం సాధించింది! అధికార ప‌క్షం అల్లిన ఉచ్చులో వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌రోసారి చిక్కుకుపోయారు. ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలో దివాక‌ర్ బ‌స్సు ట్రావెల్స్ సంఘ‌ట‌న‌లో కీల‌కమైన విష‌యాలను ప్ర‌జ‌లు పట్టించుకోకుండా.. వారి ఫోక‌స్‌ అంతా జ‌గ‌న్‌పై ప‌డేలా […]

ఏపీలో ఇదో టైప్ రాజ‌కీయం…బాధితుల వ‌ద్ద రాజ‌కీయాలు..!

మొన్న విశాఖ.. నేడు నందిగామ‌!! సంఘ‌ట‌న‌లు వేర్వేరు కావొచ్చు. కానీ జ‌రిగిన ర‌చ్చ మాత్రం ఒక్క‌టే! హోదా కోసం యువ‌త పోరాడుతుంటే.. అందుకు మ‌ద్ద‌తు తెలిపేందుకు వ‌చ్చిన ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌ను అధికారులు ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు. చివ‌ర‌కు అక్క‌డి నుంచే వెనుతిరిగేలా చేశారు. ఇప్పుడు నందిగామ‌లోనూ ఇదే పరిస్థితి. బ‌స్సు ప్ర‌మాదంలో మృతులు, క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామర్శించేందుకు వ‌చ్చిన జ‌గ‌న్‌ను అధికారులు అడ్డుకున్నారు. వైసీపీ నేత‌లు కూడా అందుకు త‌గ్గ‌ట్టుగానే ప్ర‌వ‌ర్తించారు. అధికార‌, విప‌క్షాల మ‌ధ్య గ‌ల రాజ‌కీయ […]