ఎమ్మెల్యేల‌ను అడ్డంగా ఇరికించేసిన జ‌గ‌న్‌..!

ఔను! త‌ప్పు నాది కాదు..ఎమ్మెల్యేల‌దే!- అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌. స్వ‌యంగా తాను ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌క‌పోయినా.. మాజీ మంత్రులు.. నాయ‌కుల‌తో ఆయ‌న త‌న మాట‌గానే చెప్పించారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు “మా ఎమ్మెల్యే త‌ప్పులేదు!“ అని అనుకున్న వారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేను అనుమానంగా చూడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌నే టాక్ వినిపిస్తోంది. ఇది ఆశించిన ప‌రిణామం కాద‌ని, క్షేత్ర‌స్థాయిలో ఎమ్మెల్యే మ‌రింత బ‌ల‌హీనం అవుతార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏం జ‌రిగిందంటే.. గ‌త 2019 […]

ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై మరో ట్విస్ట్

ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై హైకోర్టు డివిజన్ బెంచ్ ట్విస్ట్ ఇచ్చింది. కొన్ని రోజులుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి, ఏపీ ప్రభుత్వానికి మధ్య సినీ రంగ సమస్యల పరిష్కారం, టికెట్ల ధరలు తగ్గించడం వంటి అంశాలపై వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. సినిమా టికెట్లను ప్రభుత్వం తీసుకొచ్చే ఆన్లైన్ టికెట్ విధానం ద్వారానే విక్రయించాలని, బెనిఫిట్ షోలు నిషేధిస్తూ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను కూడా తగ్గించింది. దీనిపై టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర వ్యతిరేకత […]

కనగరాజ్ కు మళ్లీ పదవి.. ఈసారైనా ఉంటుందో.. ఊడుతుందో..!

తమిళనాడుకు చెందిన మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ గుర్తున్నారా..కొన్నేళ్ళ క్రితం ఏపీ ఎస్ఈసీగా నియమితులైన ఆయన కోర్టు తీర్పు కారణంగా కొద్ది రోజుల్లోనే ఆ పదవిని కోల్పోయారు. తాజాగా ఆయనకు ఏపీ ప్రభుత్వం మరొక పదవి కట్టబెట్టింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరించారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనే కొనసాగారు. అయితే ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. […]

టాలీవుడ్ హీరోలపై వైసీపీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు..!

నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టాలీవుడ్ హీరోలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాయలసీమలోని కడప, చిత్తూరుతో పాటు నెల్లూరు జిల్లాలో వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ వరదల కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. భారీ వర్షాల కారణంగా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి, తీవ్ర కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరూ ముందుకు […]

సింహాద్రి అనుకుంటే చాగంటిగా మారిన ఎన్టీఆర్

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పై వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే లు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు తన సతీమణి పట్ల అసభ్య వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం పట్ల నందమూరి కుటుంబం కూడా తీవ్రంగా స్పందించింది. నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ,పురందేశ్వరి, కళ్యాణ్ రామ్, నారా రోహిత్ వైసీపీ నేతలు […]

మూడు రాజధానులు బిల్లు ఉపసంహరణ.. వెనకడుగు కాదా.. మరో ముందడుగు కోసమేనా..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకున్నట్లు కోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది వెల్లడించారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ప్రభుత్వం నిజంగా మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకున్నది.. ఒకే ఒక్క రాజధాని కోసం కాదని.. బిల్లులో ఉన్న అడ్డంకులను తొలగించుకుని.. 3 రాజధానులు పై మరొక బిల్లు పెట్టే అవకాశం ఉందని […]

అధైర్యపడొద్దు మిత్రమా.. చంద్రబాబుకు ఫోన్ లో రజినీకాంత్ పరామర్శ..!

ఏపీ అసెంబ్లీ లో శుక్రవారం ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అర్ధాంతరంగా అసెంబ్లీని వీడిన చంద్రబాబు తిరిగి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశాడు. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తన భార్య భువనేశ్వరిపై అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన భావోద్వేగానికి గురై వెక్కి వెక్కి ఏడ్చిన […]

సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అల్లు అరవింద్..!

టాలీవుడ్ లో గీతా బ్యానర్ తో అల్లు అరవింద్ నిర్మాతగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపుతోనే ప్రస్తుతం జగన్ కు ఒక విజ్ఞప్తి చేస్తున్నారు అల్లుఅరవింద్. అదేమిటంటే ఇప్పుడు విడుదలయ్యే సినిమాలు అన్నీ జగన్ చేతుల మీదనే ఆధారపడి ఉన్నాయని ఆయన ఉద్దేశించి అరవింద్ కొన్ని విషయాలను తెలియజేస్తున్నారు. కరోనా కారణంగా..సినీ పరిశ్రమలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించుకోవాలని కోరారు. చిత్ర పరిశ్రమ విజయవంతంగా కొనసాగించేందుకు సహకరించాలని జగన్ గారికి ఈ విషయాన్ని […]

పవన్ కళ్యాణ్ సినిమాకు చిక్కులు తప్పవా..?

రిపబ్లిక్ సినిమా ఫ్రీరిలీజ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కామెంట్స్ వైసిపి మంత్రుల నుంచి కౌంటర్లు వస్తూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తన సినిమా నిర్మాతకు సైతం కొన్ని రోజుల క్రితమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు వెళుతున్నానని చెప్పినట్లు సమాచారం. కానీ కొంతమంది టాలీవుడ్ హీరోలు నుంచి పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ లభిస్తోంది.తన ప్రసంగంలో టాలీవుడ్ హీరోలు కొంతమంది పేరును ప్రసంగించడం కూడా జరిగింది. కానీ హీరో నాని తప్ప మిగతా హీరోలు […]