గెలిచింది బీజేపీనా..ఈటలనా..?కమలం నేతల మదిలో అంతర్మథనం

హుజూరాబాద్ ఉప ఎన్నికలు ముగిశాయి.. ఈటల రాజేందర్ విజయం సాధించాడు.. ప్రమాణ స్వీకారం కూడా ముగిసింది.. అయినా కమలం నేతల్లో ఏదో అసంత్రుప్తి.. ఎన్నికల్లో గెలిచింది భారతీయ జనతా పార్టీనా.. లేక ఈటల రాజేందరా అనే ప్రశ్న కమలం నాయకులకు నిద్రలేకుండా చేస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గం అంటే ఈటల.. ఈటల అంటే హుజూరాబాద్ నియోజకవర్గం.. అటువంటి చోట అనుకోకుండా ఉప ఎన్నికలు వచ్చాయి.. హోరా హోరీ ప్రచారం నిర్వహించారు.. అధికార పార్టీ తరపున హరీశ్ రావు, ఇతర […]

ప్లాన్ – బీ అమలు చేసిన అధినేత

చదరంగమైనా.. రాజకీయమైనా ఎత్తులు..పై ఎత్తులు ఉంటాయి.. ప్రత్యర్థి వేసే ఎత్తును ఊహించి మనం స్టెప్ వేయాలి.. లేకపోతే అంతే.. ఒక్కసారిగా చెక్ పడిపోతుంది.. ఆ తరువాత ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. ఇటువంటి విషయాల్లో రాజకీయ ఉద్ధండుడు కేసీఆర్ చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రత్యర్థి వేసే ఎత్తుకు మరో రెండు, మూడు స్టెప్స్ ముందే ఊహించి ప్లాన్ రూపొందిస్తారు. అవే ప్లాన్ -ఏ, ప్లాన్- బీ.. ముందుగా అనుకున్న ప్రకారం ప్లాన్ – ఏ ను అమలు […]

రాళ్లేసిన ప్రాంతంలోనే.. పూలు వేయించుకున్న ఈటల

ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ పార్టీలో అనేక సంవత్సరాలు పనిచేసి.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మంత్రిగా పనిచేసి.. ఆ తరువాత అధినేత కేసీఆర్ తో విభేదాలొచ్చి పార్టీలోంచి బయటకు వచ్చారు. ఇంకా చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీ ఈటలను ఒంటరి చేయాలని చూసింది. పార్టీలో ఉన్నపుడు మంత్రి వర్గం నుంచి తొలగించిన అనంతరం.. ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విచిత్రమేమంటే ఆయన అలా రాజీనామా చేసిన కొద్ది సేపటికే […]

వేల నామినేషన్లన్నారు.. చివరకు 61 మాత్రమే వేశారు

ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వేల మందితో నామినేషన్లు వేయిస్తాం.. ప్రభుత్వానికి మా సత్తా చూపుతాం అంటూ పలువురు నాయకులు, ప్రజాసంఘాలు, నిరుద్యోగులు, కాంట్రాక్టు వర్కర్లు గతంలోపేర్కొన్నారు. అందరూ.. నామినేషన్ వేస్తే బ్యాలెట్ పేపర్ కాదు కదా.. బ్యాలెట్ బుక్ తయారు చేయాలని మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఉప ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది.. నామినేషన్ల గడువు కూడా ముగిసింది. తీరా ఎన్ని నామినేషన్లు దాఖలు చేశారంటే.. కేవలం 61 మాత్రమే. అదీ […]

హుజూరాబాద్ ఎన్నికల్లో నలుగురు రాజేందర్లు?

అవును మీరు చదివింది నిజమే.. ఈనెల 30న జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నలుగురు రాజేందర్లు పోటీచేస్తున్నారు. అదేంది ఉన్నది ఒక్క రాజేందరే కదా అనే అనుమానం రావడం సహజం. వారందరూ రాజేందర్లే అయినా.. అందరూ ఈటల రాజేందర్లు కాదు.. కాబట్టి పెద్ద టెన్షనేం అవసరం లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఇది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ […]

అనుకున్నదొకటి.. అయినదొకటి.. బోల్తాపడ్డావులే నాయకా..

ఈటల ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది.. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడం.. ఆ తరువాత ఈటల పార్టీకి రాజీనామా చేయడం.. బీజేపీ కప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. అంతేనా.. ఈటల రాజీనామాతో హుజూరాబాద్ లో ఎన్నికలు నేడో..రేపో వచ్చేస్తాయన్నట్లు టీఆర్ఎస్ అధినేత భావించారు. అందుకే దళితబంధు పథకం ప్రారంభించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఈటల కూడా తానేం తక్కువ కాదన్నట్లు.. నేను రాజీనామా చేసినందుకే దళితబంధు వచ్చింది..అంటూ ఆ క్రెడిట్ తనకు దక్కేలా మాట్లాడుతున్నారు. […]

గులాబీ పార్టీలో ప్రవీణ్ గుబులు..!

ఐపీఎస్ అధికార పదవిని వదులుకొని ప్రజాజీవితంలోకి అడుగుపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ తరువాత బీఎస్పీలోకి అట్టహాసంగా చేరారు. ఆ రోజే.. ఆయన నేరుగా సీఎంను టార్గెట్ చేశారు. ఏనుగు మీద ప్రగతి భవన్ కు వెళదాం అని పిలుపునిచ్చారు. ప్రవీణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలను టీఆర్ఎస్ నాయకులు ఖండించారు గానీ నామమాత్రంగానే.. ఐపీఎస్ చదివిన మేధావిని ఎలా ఎదుర్కోవాలనే విషయం టీఆర్ఎస్ పార్టీకి అర్థం కావడం లేదు. ముఖ్యంగా కారు పార్టీలో ఉన్న దళిత […]

స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం కేసీఆరే..

ఎవరీకి పెద్దగా తెలియని గెల్లు శ్రీనివాస యాదవ్ పేరుకు ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.. ముందు ఆయన కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పాలి.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస యాదవ్ ను ప్రకటించడంతో ఆయన ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. ఈటల రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ స్థానాన్ని ఎలా అయినా గెలుచుకోవాలని, అది మా సీటని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. […]

కేసీఆర్ సార్.. ఇదేం విచిత్రం

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావుది  నేనింతే అన్నట్టుంది వ్యవహారం. నేను అనుకున్నది చేస్తా.. నాకు నచ్చినట్టు చేస్తా.. నచ్చకపోతే అంతే.. అని ఆయన చెప్పకపోయినా..చేస్తున్న పనులు మాత్రం నా ఇష్టం అన్నట్లుంది. దీనికి ఉదాహరణ ఎమ్మెల్యే కోటాలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలే.. ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే.. ప్రస్తుతం కరోనా కేసులు రోజు రోజుకూ ఎక్కువవుతున్నాయి. . ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే […]