” బిగ్ బ‌జార్‌ “ను బాబు సేవ్ చేశారా

దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దుతో జ‌నాలు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. చేతిలో చిల్లిగ‌వ్వ లేక ఇబ్బందులు ప‌డేవారు పెరిగిపోయారు. పెద్ద నోట్లు ఉండి కూడా ఏం చేయాలో తెలియ‌క తిప్ప‌లు ప‌డుతున్నారు. అయితే, ఈ పెద్ద నోట్ల ర‌ద్దును కూడా కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్ర‌బాబుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. నోట్ల ర‌ద్దు విష‌యం బాబుకు నెల రోజుల ముందే తెలిసిపోయింద‌ని విప‌క్షాలు అంటున్నాయి. ఈ క్ర‌మంలోనే […]

ఏపీలో చంద్ర‌న్న ఫోన్లు..!

త్వ‌ర‌లోనే ఏపీ ప్ర‌జ‌లంద‌రి(ఫోన్లు లేనివారు) చేతుల్లోనూ చంద్ర‌న్న ఫోన్లు వ‌చ్చేయ‌నున్నాయి. ప్ర‌స్తుతం పెద్ద నోట్ల ర‌ద్దుతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న విష‌యం తెలిసిందే. దీంతో క్యాష్ లెస్ మ‌నీ ట్రాన్సాక్ష‌న్ దిశ‌గా ప్ర‌భుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ఈ క్ర‌మంలో దేశంలోని మిగ‌తా రాష్ట్రాల సీఎంక‌న్నా ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రింత వేగంగా ఉన్నారు. పెద్ద నోట్లు ర‌ద్ద‌యిపోవ‌డంతో ప్ర‌జ‌లు ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ల‌కు మ‌ళ్ల‌మ‌ని ఆయ‌న చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్వైపింగ్ […]

చంద్ర‌బాబు – మోడీ ఎవ‌రిని న‌మ్మాలి…!

ఒక‌ప్పుడు ఏదైనా విష‌యంపై స‌ర్వే చేప‌డితే.. దాని ఫ‌లితాలపై జ‌నాల్లో పెద్ద ఎత్తున ఆస‌క్తి ఉండేది. ముఖ్యంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడ‌తారు? ఎవ‌రికి ఎన్ని ఓట్లు వ‌స్తాయి? వ‌ంటి అనేక విష‌యాల‌పై జ‌రిగే స‌ర్వేలను ప్ర‌జ‌లు, మేధావులు నిశితంగా గ‌మ‌నిస్తుంటారు. స‌ర్వేల్లో వ‌చ్చిన రిజ‌ల్ట్ దాదాపు త‌ర్వాత నిజ‌మ‌య్యేది. అయితే, రానురాను ఈ స‌ర్వేల‌కు ప్రాధాన్యం త‌గ్గిపోతోంది. ఎవ‌రికి ఇష్ట‌మొచ్చినట్టు వాళ్లు స‌ర్వేలు నిర్వ‌హించ‌డం, స‌ర్వేఫ‌లితాలు ఏక‌ప‌క్షంగా ఉండ‌డం వంటివి ప్ర‌ధానంగా గ‌మ‌నిస్తుండ‌డంతో […]

బాబు కేబినెట్‌లో సెటిల్‌మెంట్ మంత్రికి ప్ర‌మోష‌న్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు కేబినెట్‌లో జ‌గ‌న్‌ను తిట్టే శాఖా మంత్రి, దూకుడు మంత్రి, సెటిల్మెంట్ మంత్రికి ప్ర‌మోష‌న్ రానుంద‌ట‌. ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌త ఆరేడు నెల‌లుగా త‌న కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ప్ర‌క్షాళ‌న‌లో త‌న కుమారుడు లోకేష్‌కు సైతం కేబినెట్ బెర్త్ ద‌క్కుతుంద‌ని వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క్షాళ‌న‌లో ప‌నితీరు స‌రిగా లేని మంత్రుల‌ను తొల‌గించి వారి స్థానంలో సీనియ‌ర్ల‌కు, కొత్త‌వారికి కూడా ఛాన్స్ ఉంటుంద‌న్న టాక్ ఉండ‌నే […]

చంద్ర‌బాబు – కేసీఆర్‌కు ఒకే టెన్ష‌న్ ..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలోకి విప‌క్ష పార్టీల నుంచి ప‌లువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ చేసేశారు. ఈ జంపింగ్‌ల విష‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేసీఆర్‌, చంద్ర‌బాబు క‌నీస సంప్ర‌దాయాలు కూడా పాటించ‌కుండా విప‌క్ష పార్టీల ఎమ్మెల్యేల‌ను త‌మ పార్టీలో చేర్చేసుకున్నారు. అయితే ఇప్పుడు పార్టీలు జంప్ చేసిన ఎమ్మెల్యేల‌తో పాటు వీటిని ప్రోత్స‌హించిన చంద్ర‌బాబు, కేసీఆర్ సైతం ఇర‌కాటంలో ప‌డనున్నార‌ని తాజా సంఘ‌ట‌న‌లు దోహ‌దం చేస్తున్నాయి. తెలంగాణ‌లో పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై […]

కుంభ‌కోణంలో ఆ ఏపీ మంత్రి రాజీనామా..!

2014-15 మ‌ధ్య కాలంలో గుంటూరు కేంద్రంగా జ‌రిగిన ప‌త్తి కొనుగోళ్ల‌లో వెలుగు చూసిన కుంభ‌కోణం దేశాన్ని కుదిపేసిన సంగ‌తి తెలిసిందే. ద‌ళారులు, వ్యాపారుల‌తో కుమ్మ‌క్క‌యిన మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బంది రైతుల నుంచి ప‌త్తిని అతి త‌క్కువ ధ‌ర‌కు కొనుగోలు చేసి, ఎక్కువ మొత్తానికి కొన్న‌ట్టు రికార్డులు సృష్టించారు. ఈ క్ర‌మంలో దాదాపు 1000 కోట్ల మేర‌కు కుంభ‌కోణం జ‌రిగిన‌ట్టు విజిలెన్స్ విభాగ‌మే నిగ్గు తేల్చింది. దాదాపు ల‌క్షా 93 వేల క్వింటాళ్ల ప‌త్తిని రైతుల నుంచి […]

ఏపీలో బాబుకు త‌ల‌నొప్పిగా మ‌రో కుల ఉద్య‌మం

ఆశ్చ‌ర్యంగా అనిపించినా ఇది నిజ‌మేనంటున్నారు ప‌శ్చిమ‌గోదావ‌రికి చెందిన టీడీపీ నేత‌లు. ఇప్ప‌టికే తూర్పుగోదావ‌రి జిల్లాకి చెందిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం చేస్తున్న కాపు ఉద్య‌మంతోనే చంద్రాబాబుకు తిక్క‌పుడుతుంటే.. ప‌శ్చిమ గోదావ‌రి కి చెందిన మ‌రో నేత మాదిగ స‌భ నిర్వ‌హిస్తాన‌ని, త‌న త‌ఢాకా చూపుతాన‌ని బెదిరిస్తున్నాడు. దీంతో ఇప్పుడు ఈ ఉద్య‌మానికి కులం క‌ల‌రింగ్ వ‌స్తే.. బాబు డోలాయ‌మానంలో ప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. నిజానికి కుల ఉద్య‌మాల‌కు రాష్ట్రంలో కొత్త‌కాదు. అయినా.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఈ […]

ఆ ఎన్నిక‌ల్లో పెద్ద నోట్ల ఎఫెక్ట్ త‌ప్ప‌దా ?

ఎన్నిక‌ల‌న్నాక నోట్ల‌తోనే ప‌ని!! అంత‌లా మారిపోయాయి దేశంలో ఎన్నిక‌లు. నిజానికి చెప్పాలంటే.. మారిపోలేదు మ‌న నేత‌లే అలా మార్చేశార‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు! ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా నోట్లు కొట్టందే ఓట్టు రాల‌ని ప‌రిస్థితి. అవి ఢిల్లీస్థాయి ఎన్నిక‌లైనా, గ‌ల్లీ స్థాయి ఎన్నిక‌లైనా.. పోరులో గెల‌వాలంటే.. నోట్లు కుమ్మ‌రించాల్సిందే. ఇదంతా ఎందుకంటే.. త్వ‌ర‌లోనే రాష్ట్రంలో మునిసిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దాదాపు 11 మునిసిప‌ల్ స్థానాల‌కు, 5 కార్పొరేష‌న్ల‌కు ఎన్నిక‌లు ఖాయ‌మ‌ని తెలిసిపోయింది. ప్ర‌భుత్వం ఓట‌ర్ల జాబితా పంప‌గానే ఎన్నిక‌ల సంఘం […]

చంద్ర‌బాబు – కేసీఆర్ ఫీట్లు చూశారా..!

ఇప్ప‌టికే ఒక ప‌క్క ప్ర‌భుత్వ పాల‌న‌, మ‌రోప‌క్క పార్టీ కార్య‌క‌లాపాల వ్యూహ ర‌చ‌న‌ల‌తో క్ష‌ణం తీరిక లేకుండా ఉన్న ఏపీ సీఎం చంద్ర‌బాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు స‌రికొత్త ఫీట్లు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ బ‌లంగా ఉన్న ప్ర‌ధాన విప‌క్షాల‌ను నిర్వీర్యం చేసే క్ర‌మంలో ఆయా పార్టీల నుంచి పెద్ద ఎత్తున వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హించారు ఇద్ద‌రు చంద్రులు. ఆప‌ర్ ఆక‌ర్ష్‌కి తెర‌తీసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. టీడీపీ, కాంగ్రెస్‌, వైకాపా ఆఖ‌రికి క‌మ్యూనిస్టులను సైతం త‌న కారెక్కించుకున్నారు. […]