వెరీ వెరీ స్పెషల్‌ చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అంతే, ఆయన ఏం చేసినా అందులో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న బ్యాడ్మింటన్‌ సంచలనం సింధుని విజయవాడకు ఆహ్వానించిన చంద్రబాబు, ఆమెకు సాదర స్వాగతం పలికారు. సన్మాన సభలో చంద్రబాబు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. సింధుతో కలిసి వేదికపై కాస్సేపు జరదాగా షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఆడారు. చూపరుల్ని బాగా ఆకట్టుకున్న విషయమిది. అలాగే సింధుతోపాటు, ఆమె కోచ్‌ గోపీచంద్‌ని కూడా ఘనంగా సన్మానించారు. సింధు గురించి మాట్లాడుతున్న సమయంలో చంద్రబాబు, […]

చెత్త మాట: చంద్రబాబు భయపడతారా!

నరేంద్రమోడీని చూసి చంద్రబాబు భయపడతారా? అన్న ప్రశ్న రాజ్యసభలో టిడిపి ఎంపి వేశారు. అసందర్భమైన ప్రశ్న ఇది. ప్రత్యేక హోదా అడగడానికి చంద్రబాబు భయపడుతున్నారనే వాదన ఉత్పన్నమవుతోంది. దానికి కారణం కూడా లేకపోలేదు. తెలుగుదేశం పార్టీ, ఎన్‌డిఏ ప్రభుత్వంలో భాగస్వామి. కాబట్టి, చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రాష్ట్రానికి గతంలో రాజ్యసభ ద్వారా సంక్రమించిన ప్రత్యేక హోదా హక్కుని సాధించుకుని ఉండాలి. నరేంద్రమోడీ ప్రభుత్వం అంటే అందులో చంద్రబాబు కూడా భాగమే గనుక, ఇది చాలా సులువైన […]

చంద్రబాబు ఈసారి రిస్క్‌ చేయదలచుకోలేదు

పోలీస్‌ శాఖలో ఉన్నతాధికారులుగా పనిచేసినవారు రాజకీయాల్లోకి రావడం వింతేమీ కాదు. సమైక్య తెలుగు రాష్ట్రానికి డిజిపిలుగా పనిచేసిన పేర్వారం రాములు, దినేష్‌ రెడ్డి పదవీ విరమణ అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. పేర్వారం రాములు టిడిపిలో పనిచేసి, ప్రస్తుతం టిఆర్‌ఎస్‌లో ఉన్నారు. దినేష్‌రెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాక భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళారు. అప్పటికి అధికారంలో ఉన్న పార్టీలతో ఉన్న సత్సంబంధాల కారణంగా […]

కయ్యమా,వియ్యమా: బాబు దారెటు ?

ప్రత్యేక హోదా అనే పదాన్ని వినడానికి కూడా కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఇష్టపడటంలేదు. ఆ ఎన్‌డిఎ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కూడా భాగమే. రాజ్యసభలో ఈ రోజు జరగాల్సిన ఓటింగ్‌ని భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా జరగనీయలేదు. కానీ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రత్యేక హోదా బిల్లుకి అనుకూలంగా ఓటేయడానికి సిద్ధమైంది. అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో. బిజెపి నుంచి ‘బిల్లుపై ఓటింగ్‌ జరగనీయం’ అని హామీ వచ్చిన తర్వాతే, ‘ఆ బిల్లుకి అనుకూలంగా ఓటేస్తాం’ […]

వెండితెరపై చంద్రబాబు!

పొలిటికల్‌ స్టార్‌ వెండితెర స్టార్‌ అయ్యేలాగున్నారు. చంద్రబాబు నటిస్తారో నటించరోగానీ ఆయన మీద ఓ సినిమా రూపొందుతోంది. టిడిపి నాయకులే ఈ సినిమాని రూపొందించడానికి ముందుకు వచ్చారు. విజయవాడకు చెందిన మల్లికార్జున యాదవ్‌ కార్పొరేటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనే ఈ చిత్రానికి నిర్మాత. ‘చంద్రోదయం’ పేరుతో రెండేళ్ళ చంద్రబాబు పాలనలోని విజయాల్ని ప్రజలకు చేరేవేసేందుకు ఈ చిత్రాన్ని తీయనున్నారట. ఎపి టిడిపి ముఖ్య నాయకుల్లో ఒకరైన హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఈ చిత్ర షూటింగ్‌ని ప్రారంభిస్తారు. పసుపులేటి వెంకట్‌ […]

‘స్విస్‌’ ఉచ్చులో చంద్రబాబు ఇరుక్కున్నారా?

రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాల్ని చూశారు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబునాయుడు. ఆయన రాజకీయాల్లో ఉండగానే ఒకప్పటి తెలుగు రాష్ట్రం ఇప్పుడు రెండుగా విడిపోయింది. అలా విభజన జరగడానికి ఆయన కూడా ఓ కారణం. 23 జిల్లాల తెలుగు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా రికార్డు సమయం ఏకధాటిగా పరిపాలించిన ఘనత చంద్రబాబుకి మాత్రమే దక్కింది. ఆయన ఇప్పుడు కేవలం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి. పదేళ్ళు సమైక్య తెలుగు రాష్ట్రానికి ఆయన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అయితే […]

కేవీపీకి టీడీపీ సపోర్ట్…

ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు ఊహించని మద్దతు లభించింది. ఈ బిల్లు ఓటింగ్ వరకు వస్తే… దానికి అనుకూలంగా ఓటేయాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ తీర్మానించింది. పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు మాట్లాడినా… పార్టీలతో ప్రమేయం లేకుండా మద్దతు తెలపాలని కూడా […]

చంద్రబాబుకి పుష్కరాల దెబ్బ

పుష్కరాల్లో స్నానం పరమ పవిత్రంగా భావిస్తుంటారు. కానీ ఆ పుష్కర జలాలే అపవిత్రం అనే వాదన వస్తే భక్తులు ఆందోళన చెందకుండా ఉంటారా? తెలంగాణ పండితులు, ఆంధ్రప్రదేశ్‌లో పుష్కర స్నానం చేయడం వల్ల ఫలితం ఉండదని స్పష్టం చేయడం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పెద్ద షాక్‌. వారి వాదనకి ఓ కారణం ఉంది. అదేమిటంటే గోదావరి నది, కృష్ణా నదిలో కలవడం వల్ల కృష్ణా నదిలో పుష్కర స్నానం తగినంత ఫలితాన్ని ఇవ్వదట. అయితే ఇది కుట్రపూరితంగా చేస్తున్న […]

చంద్రబాబుకి షాకిచ్చిన నరేంద్రమోడీ

కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలుగుదేశం పార్టీకి ఇంకో అవకాశం ఇవ్వకపోవడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చంద్రబాబుకి పెద్ద ఝలక్‌ ఇచ్చారని చర్చించుకుంటున్నారు రాజకీయ వర్గాలలో. టిడిపి నాయకులు కూడా నరేంద్రమోడీ తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. ఇప్పుడున్న రెండు కేంద్ర మంత్రి పదవులతోపాటు కొత్తగా మరో పదవిని టిడిపి ఆశించింది. ఒకరు క్యాబినెట్‌ మంత్రి, ఒకరు సహాయ మంత్రిగా టిడిపి నుంచి కేంద్రంలో ఉన్నారు. వారిని అలాగే ఉంచి, కొత్త ఛాన్స్‌ ఇవ్వాలని చంద్రబాబు […]