ఆ మంత్రిపై చంద్ర‌బాబు సీక్రెట్ నిఘా..!

ఏపీ ముఖ్య‌మంత్రి సీఎం చంద్ర‌బాబుకు ఇంటి పోరు త‌ప్ప‌డం లేదు. ముఖ్యంగా కేబినెట్‌లోని మంత్రి తీరుపై ఇప్పుడు ఆయ‌న తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ట‌. కీల‌క‌మైన నిర్ణ‌యాల‌ను త‌నకు స‌న్నిహితుడైన‌, మ‌రో పార్టీ అధినేత‌కు చెబుతుండ‌టంతో ఏం చేయాలో తెలియ‌ని సందిగ్థ స్థితిలో టీడీపీ అధినేత ఉన్నార‌ట‌. మంత్రి ప‌ద‌వి నుంచి తీసేస్తే.. ఆయ‌న సామాజిక‌వర్గం నుంచి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని భావించి వెన‌క‌డుగు వేస్తున్నార‌ట‌. పార్టీని ఇబ్బందుల కు గురిచేస్తున్న ఆయ‌న వ్య‌వ‌హార శైలి.. గ‌తంలో మంత్రిగా […]

ప్ర‌త్తిపాటిని మంత్రి పోస్ట్ ఊష్టింగ్…కానీ ఆఖరి నిమిషంలో ఏంజరిగింది

ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌లో గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి ప్ర‌త్తిపాటి పుల్ల‌రావు బాబు వేటు నుంచి త‌ప్పించుకున్నారు. ప్ర‌క్షాళ‌న వార్త‌లు స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి ప్ర‌త్తిపాటికి సైతం బాబు ఉద్వాస‌న పలుకుతార‌ని వార్త‌లు జోరుగా హ‌ల్‌చ‌ల్ చేశాయి. గుంటూరు జిల్లాకు చెందిన రావెల కిషోర్‌బాబుతో పాటు ప్ర‌త్తిపాటిని కూడా మార్చేసి జిల్లా నుంచి అదే సామాజిక‌వ‌ర్గానికి చెందిన మ‌రో ఎమ్మెల్యేకు మంత్రి ప‌ద‌వి అంటూ ఊహాగానాలు వ‌చ్చాయి. ఈ ప్ర‌క్షాళ‌న‌లో రావెల‌ను త‌ప్పించిన చంద్ర‌బాబు ప్ర‌త్తిపాటిని మాత్రం […]

ఉలిక్కి పడ్డ చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ఆశావాహుల మ‌ధ్య పెద్ద చిచ్చే పెట్టింది. మంత్రి ప‌ద‌వులు రాని ఆశావాహులు, సీనియ‌ర్లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే మంత్రి ప‌ద‌వి పోయిన సీనియ‌ర్ లీడ‌ర్ బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌గా, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు సైతం తాను రాజీనామాకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. ఇక విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు స‌త్య‌నారాయ‌ణ‌మూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శ్రీకాకుళం జిల్లా నుంచి సీనియ‌ర్ లీడ‌ర్ గౌతు […]

బాబు కేబినెట్‌లో క్యాస్ట్ ఈక్వేష‌న్ లెక్క త‌ప్పిందిగా…

ఏపీ కేబినెట్ విస్త‌ర‌ణ సొంత పార్టీ నేత‌ల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. మొత్తం 26 ఖాళీలు పూర్తి కావ‌డంతో ఇక కొత్త‌గా ఎవ్వ‌రికి ఛాన్స్ ఇచ్చే ప‌రిస్థితి కూడా లేదు. ఈ విస్త‌ర‌ణ‌లో కులాల లెక్క త‌ప్పిన‌ట్టు రాజ‌కీయంగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. కొన్ని సామాజిక‌వ‌ర్గాల‌కే పెద్ద పీఠ వేయ‌గా మ‌రి కొన్ని కీల‌క కులాల‌కు అస్స‌లు ప్రాధాన్య‌మే ల‌భించ‌లేదు. మైనార్టీలు, ఎస్టీలతో పాటు క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం నుంచి ఒక్క మంత్రికి కూడా చోటులేదు. దీంతో ఈ వ‌ర్గాల్లో […]

ప‌య్యావుల కేబినెట్ ఎంట్రీకి అడ్డు పుల్లెవ‌రు..!

ఏపీలో కేబినెట్ ప్ర‌క్షాళ‌న వార్త‌లు గ‌త కొద్ది రోజులుగా జోరుగా వినిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌కాక్ష‌ళ‌న‌లో ఆశావాహుల లెక్క‌లు భారీగానే ఉన్నాయి. ఎమ్మెల్యేలుగా ఉన్న వారు, సీనియ‌ర్లు, జంపింగ్ జ‌పాంగ్‌లు, ఎమ్మెల్సీలు ఇలా ఎవ‌రికి వారు త‌మ‌కు కేబినెట్‌లో బెర్త్ ఖాయ‌మ‌ని ఆశ‌ల్లో మునిగి తేలుతున్నారు. ఎవ‌రి వాద‌న‌లు ఎలా ఉన్నా చంద్ర‌బాబు త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేశ్‌కు ఫ‌స్ట్ బెర్త్ ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక ఇటీవ‌ల గుండెపోటుతో మృతిచెందిన నంద్యాల ఎమ్మెల్యే […]

క్యాబినెట్ విస్త‌ర‌ణ‌లో బాబుకు బ్రేక్ వేస్తోందెవ‌రు..!

ఏపీ క్యాబినెట్ విస్త‌ర‌ణ అంశం దాదాపు గ‌త యేడాది కాలంగా ఊరిస్తూ..ఊరిస్తూ వ‌స్తోంది. ఈ ఊరింపుకు త్వ‌ర‌లోనే ఓ ముగింపు రానుంద‌ని తెలుస్తోంది. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై చంద్ర‌బాబు క‌స‌ర‌త్తులు ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ విస్త‌ర‌ణ‌కు ఓ వ్య‌క్తి బ్రేకులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌లో చాలా ట్విస్టులు చోటు చేసుకుంటాయ‌ని…ఇది ఓ థ్రిల్ల‌ర్ మూవీని త‌ల‌పించ‌డం ఖాయ‌మ‌న్న టాక్ న‌డుస్తోంది. విస్త‌ర‌ణ‌లో కొత్త‌గా ఎన్నికైన ఎమ్మెల్సీల‌తో పాటు జంపింగ్ జ‌పాంగ్‌ల‌కు చోటు ద‌క్కుతుంద‌ని […]

బాబు కేబినెట్‌లో ఆ రెడ్డిగారు అవుట్‌..!

ఏపీ క్యాబినెట్‌లో దీపావళికి కాస్త అటూ ఇటూగా ప్ర‌క్షాళ‌న జ‌ర‌గ‌డం ఖాయ‌మ‌ని, కొంద‌రు కొత్త స‌భ్యులకు మంత్రివ‌ర్గంలో స్థానం ద‌క్క‌నుంద‌నీ, అదే స‌మ‌యంలో కొంద‌రు పాత కాపుల‌కు క్యాబినెట్ నుంచి ఉద్వాస‌న త‌ప్ప‌ద‌నీ టీడీపీ అధిష్ఠానం కొంత‌కాలంగా సంకేతాలు పంపుతూ వ‌స్తోంది.  ఇక ఇప్పుడు దీపావ‌ళి సంబ‌రాలు ముగిసిన‌ట్టే..   మరి ఇప్పుడైనా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా.. అని పార్టీలోని ఆశావ‌హులు స‌హ‌జంగానే ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. మ‌రి కొత్త‌గా ఎవ‌రెవ‌రిని మంత్రిప‌ద‌వులు వ‌రించ‌నున్నాయ‌నేది ఆస‌క్తిక‌రంగానే క‌నిపిస్తోంది. […]